2022 లో విడుదలకు సిద్దమవుతున్న బిఎమ్‌డబ్ల్యూ X3 మరియు X4 మోడల్స్; వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన 2022 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఎక్స్4 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ రెండు ఎస్‌యూవీలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్‌లలో అప్‌డేట్స్‌ ఫీచర్స్ కలిగి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించిన ఈ కొత్త ఎస్‌యూవీల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

కంపెనీ అప్డేట్ చేసిన లైనప్‌లో ఇప్పుడు మరింత శక్తివంతమైన ఎక్స్3 ఎమ్ మరియు ఎక్స్4 ఎమ్ వేరియంట్లు కూడా చేరాయి. బిఎమ్‌డబ్ల్యూ ఇప్పుడు ఈ రెండు ఎస్‌యూవీలను 'ఎం స్పోర్ట్' ప్యాకేజీతో అందిస్తుంది. కావున ఇది చాలా మంచి స్టైలింగ్ డిజైన్ కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మరియు ఎక్స్4 ఎస్‌యూవీలు అప్‌డేట్ చేసిన కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. ఇది మునుపటి కంటే సన్నగా కనిపిస్తుంది. రెండు ఎస్‌యూవీలు ముందు భాగంలో కొంచెం పెద్ద కిడ్నీ గ్రిల్‌ పొందుతుంది. ఇది మొత్తానికి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

కొత్త బిఎమ్‌డబ్ల్యూలో పునఃరూపకల్పన చేయబడిన ముందు మరియు వెనుక బంపర్లు, 19 ఇంచెస్ స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్ మరియు అప్డేట్ చేసిన ఎల్ఈడీ టైల్ లైట్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎమ్ మరియు ఎక్స్4 ఎమ్ మోడళ్లు మరింత దూకుడుగా ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

బిఎమ్‌డబ్ల్యూ రెండు వేరియంట్లు స్టాండర్డ్ మోడల్ కంటే స్పోర్టియర్ లుకింగ్ ఫ్రంట్ బంపర్లతో వస్తాయి, అంతే కాకుండా పెద్ద ఎయిర్ ఇంటెక్స్ తో మంచి కూలింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి. రెండు ఎస్‌యూవీల పర్ఫామెన్స్ వేరియంట్‌లకు అనేక ఇతర స్పోర్టి ఎలిమెంట్స్‌తో పాటు ఎమ్-స్పెసిఫిక్ రియర్ బంపర్‌లు లభిస్తాయి.

MOST READ:లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్‌; గంటకు 324 కి.మీ వేగం, ధర రూ. 3.54 కోట్లు

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3, ఎక్స్‌4 ఫేస్‌లిఫ్ట్‌ల యొక్క ఇంటీరియర్‌ల విషయానికి వస్తే, ఇది చాలా ఆకర్షణీయమైన కొత్త డిజైన్‌ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలు ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పెద్ద 12.3 ఇంచెస్ స్క్రీన్‌ను పొందుతాయి.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

కొత్త ఎక్స్3 మరియు ఎక్స్4 రెండూ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ కనెక్టెడ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. వీటితో పాటు, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో సహా అనేక ఇతర ఫీచర్లు కూడా ఈ రెండింటిలో అందించబడ్డాయి. మరోవైపు, ఎమ్ మోడల్స్ ప్రకాశవంతమైన ఎమ్ లోగో, ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే మరియు మౌంటెడ్ కంట్రోల్స్ తో ఎమ్ స్టీరింగ్ వీల్స్ తో స్పోర్ట్స్ సీట్లను పొందుతాయి.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

బిఎమ్‌డబ్ల్యూ నుంచి రానున్న కొత్త కార్స్, ఇవే.. చూసారా!

కొత్త బిఎమ్‌డబ్ల్యూ మోడల్స్ లో లైట్ వెయిట్ 20 ఇంచెస్ ఎమ్ అల్లాయ్ వీల్స్ మరియు ఆప్సనల్ 21 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. 2022 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3 మరియు ఎక్స్‌4 వాటి పాత మోడళ్ల మాదిరిగానే డీజిల్‌, పెట్రోల్‌ ఇంజన్లతో రానున్నాయి. ఇందులో ఉన్న అన్ని ఇంజిన్ ఆప్సన్స్ కూడా స్టాండర్డ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
New 2022 BMW X3 And X4 Facelift SUVs Unveiled For Global Market. Read in Telugu.
Story first published: Wednesday, June 9, 2021, 14:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X