కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ Jeep తమ కొత్త Commander ఎస్‌యూవీని బ్రెజిల్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త 2022 Jeep Commander (జీప్ కమాండర్) ఇప్పుడు మూడు-వరుస సీటుతో 7-సీటర్ ఎస్‌యూవీగా లభ్యం కానుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మోడల్ భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా, దాని ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

కొత్త 2022 Jeep Commander ఎస్‌యూవీని కంపెనీ రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంచింది. అవి: లిమిటెడ్ మరియు ఓవర్‌ల్యాండ్. ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను కంపెనీ ఇదివరకే వెల్లడి చేసింది. కొత్త Commander ముందు వైపు నుండి చుడటానికి Jeep అందిస్తున్న Compass ఎస్‌యూవీతో సమానంగా ఉంటుంది.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

అయితే ఇందులో కొద్దిగా భిన్నమైన ఫ్రంట్ గ్రిల్ మరియు సన్నని ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ యూనిట్‌లను కలిగి ఉంటుంది. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను స్వల్పంగా రీడిజైన్ చేశారు. ఫ్రంట్ బంపర్‌లో క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన సన్నని ఎల్ఈడి ఫాగ్ లైట్ బార్ ఉంటుంది. ఇందులోని లిమిటెడ్ ట్రిమ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్‌తో మరింత రగ్గడ్ రూపాన్ని కలిగి ఉండగా, ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు చిన్న సైజు చిన్ స్పాయిలర్‌తో స్పోర్టియర్‌గా కనిపిస్తుంది.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

కొత్త 2022 Jeep Commander ఎస్‌యూవీని వెనుకవైపు నుండి అంత షార్ప్‌గా కనిపించదు. ఇందులోని ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు Jeep Grand Wangoneer (జీప్ గ్రాండ్ వ్యాగోనీర్‌) ఎస్‌యూవీలో కనిపించినట్లుగా ఉంటాయి. వీటిని సరిగ్గా రియర్ విండ్‌స్క్రీన్ క్రింద అమర్చారు. వెనుక టెయిల్ లైట్ల మధ్య కూడా మందపాటి క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది మరియు ఇది రెండు లైట్లను కలుపుతున్నట్లుగా ఉంటుంది.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

కొత్త Commander లిమిటెడ్ ట్రిమ్‌లో రగ్గడ్ లుక్ కోసం చుట్టూ బాడీ క్లాడింగ్ ఉంటుంది. ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ లో మాత్రం బాడీ-కలర్ రియర్ బంపర్ ఉంటుంది. రెండు ట్రిమ్‌లలో కూడా వెనుక స్కిడ్ ప్లేట్స్ కనిపిస్తాయి. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ తో కూడిన ఈ ఎస్‌యూవీ మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

ఓవరాల్‌గా ఈ ఎస్‌యూవీ ముందు వైపు నుండి మరియు సైడ్స్ నుండి మంచి మజిక్యులర్ లుక్‌ని కలిగి ఉంటుంది. Jeep ఎస్‌యూవీల సిగ్నేచర్ స్టైలింగ్ తో కూడిన ట్రాపెజోయిడల్ వీల్ ఆర్చ్‌లు, 214 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ (ఓవర్‌ల్యాండ్ ట్రిమ్‌లో), లిమిటెడ్ ట్రిమ్‌లో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఓవర్‌ల్యాండ్ ట్రిమ్‌లో కొత్త 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

ఇక ఇంటీరియర్స్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్ 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్వెడ్ మరియు లెదర్ అప్‌హోలెస్ట్రీ, సన్నటి ఎయిర్ వెంట్స్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

ఇంకా ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, పవర్ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం అలెక్సా ఇన్-వెహికల్ ఫంక్షన్‌, 10 స్పీకర్లతో కూడిన ప్రీమియం 450 వాట్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2022 Jeep Commander ఎస్‌యూవీలో ప్రయాణీకుల భద్రత కోసం ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగులు, స్టాండర్డ్ మరియు బహుళ ADAS ఫీచర్లు, ఆటోమేటిక్ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మరియు క్రాస్ ట్రాఫిక్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు పార్క్ అసిస్ట్ మొదలైనవి చాలానే ఉన్నాయి.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

ఈ ఎస్‌యూవీలో 233 లీటర్ల స్టాండర్డ్ బూట్ స్పేస్ ఉంటుంది. మూడవ వరుసలోని సీట్లను మడిచినప్పడు ఇది 661 లీటర్లకు మరియు రెండవ వరుసలోని సీట్లను మడచినప్పుడు 1760 లీటర్లకు పెంచుకోవచ్చు. మధ్య వరుసలో బెంచ్ సీట్ ఉంటుంది, దీనిని 60:40 నిష్పత్తిలో మడచుకోవచ్చు. అలాగే, మూడవ వరుసలోని సీట్లను 50:50 నిష్పత్తిలో ఫోల్డ్ చేసుకోవచ్చు.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ బ్రెజిలియన్ వెర్షన్ Commander లో రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మొదటిది 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 185 పిఎస్ శక్తిని మరియు 270 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 1.3 లీటర్ ఇంజన్ ఒక ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్. అంటే, ఇది బయో-ఇథనాల్‌తో కలిపిన పెట్రోల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడా పనిచేయగలదు. ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 170 పిఎస్ శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త 2022 Jeep Commander ఆవిష్కరణ; భారత్‌లో కూడా లాంచ్ అయ్యే ఛాన్స్..!

కొత్త 2022 Jeep Commander లో శాండ్/మడ్, స్నో మరియు ఆటో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఇందులో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కేవలం డీజిల్ ఇంజన్‌కు మాత్రమే పరిమితం చేశారు. బ్రెజిల్ కరెన్సీలో దీని ధర 199,990 బ్రెజిలియన్ రీల్ నుండి 279,990 బ్రెజిలియన్ రీల్ మధ్యలో ఉంటుంది. అంటే, ప్రస్తుత మారకపు విలువ ప్రకారం భారత కరెన్సీలో దీని విలువ రూ.28.00 లక్షల నుండి రూ.39.00 లక్షల మధ్యలో ఉంటుంది. వచ్చే ఏడాదిలో ఇది భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని సమాచారం.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
New 2022 jeep commander 7 seater suv unveiled in brazil details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X