విడుదలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీ తయారీ సంస్థ అయిన జీప్ తన కొత్త 2022 జీప్ కమాండర్ 7 సీట్స్ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా 2021 ఆగస్టు 26 ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. జీప్ కంపెనీ కమాండర్ 7 సీట్స్ ఎస్‌యూవీ యొక్క మొదటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని బ్రెజిల్‌లో చేయనున్నట్లు సమాచారం. బ్రెజిల్ లో స్పెక్ మోడల్ కమాండర్‌గా ఆవిష్కరించ్చనుంది. అయితే భారతీయ మార్కెట్లో దీని పేరు మార్చే అవకాశం ఉంది. ఈ కొత్త జీప్ కమాండర్ 7 సీట్స్ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలయ్యే ఈ కొత్త జీప్ ఎస్‌యూవీ పేరు 'జీప్ మెరిడియన్' అని భావిస్తున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీ 2022 సంవత్సరం మధ్యలో భారతీయ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. అయితే ఈ ఎస్‌యూవీ యొక్క అధికారిక ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో వెల్లడయ్యాయి.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

2022 జీప్ కమాండర్, సాధారణంగా జీప్ కంపాస్ యొక్క త్రీ రో వేరియంట్‌గా ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీ విస్తరించిన విండో లైన్‌లు మరియు వెనుక భాగంతో భారీ బాడీ-బిల్ట్‌ను పొందుతుంది. ఇక్కడ మనకు కనిపించే ఫోటోల ప్రకారం ఈ ఎస్‌యూవీ క్రోమ్ యాక్సెంట్స్ తో 7-స్లాట్ గ్రిల్ సిగ్నేచర్ ఉపయోగిస్తుంది.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

కొత్త జీపు కమాండర్ ఎస్‌యూవీ ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ లతో దీర్ఘచతురస్రాకార ఆకారపు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, విశాలమైన ఎయిర్-ఇన్లెట్‌లతో విశాలమైన బంపర్ మరియు స్పష్టమైన బోనెట్ కూడా కనిపిస్తుంది. కొత్తగా రూపొందించిన యు ఆకారంలో ఉండే అల్లాయ్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీలో ప్రముఖ వీల్ ఆర్చ్‌లు ఇవ్వబడతాయి.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

2022 జీప్ కమాండర్ ఫ్లాట్ రూఫ్, లాంగ్ రియర్ ఓవర్‌హాంగ్‌లు, నిటారుగా ఉన్న టెయిల్‌గేట్ మరియు క్షితిజ సమాంతర ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను పొందుతుంది. కొత్త జీప్ కమాండర్ యొక్క రియర్ ప్రొఫైల్ జీప్ గ్రాండ్ చెరోకీ మరియు వాగోనీర్ మాదిరిగానే ఉంచబడింది. 2022 జీప్ కమాండర్ లోపలి భాగం జీప్ కంపాస్ కంటే ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

జీప్ కమాండర్ లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అమెజాన్ అలెక్సా సపోర్ట్ మరియు ప్రీమియం అపోల్స్ట్రే మరియు వెంటిలేటెడ్ సీట్లను పొందుతుంది.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

కమాండర్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంతే కాకూండా ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 6 మరియు 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులోకి వస్తుంది.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

కొత్త 2022 జీప్ కమాండర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్, 4-సిలిండర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్‌తో భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఈ డీజిల్ ఇంజిన్ 200 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

2022 జీప్ కమాండర్ యొక్క హై వేరియంట్ లో కంపెనీ ప్రత్యేకంగా 4X4 డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు. ప్రపంచ మార్కెట్లలో, కొత్త జీప్ 7-సీటర్ ఎస్‌యూవీ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఈ ఇంజిన్‌తో తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే జీప్ కంపెనీ మరొక కొత్త ఎస్‌యూవీని తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఎలాంటి అమ్మకాలతో ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

విడుదలలకు సిద్దమవుతున్న మరో కొత్త జీప్ ఎస్‌యూవీ; వివరాలు

ఈ జీప్ రాంగ్లర్ ఇటీవల తన 80 వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంది. అయితే ఈ సందర్భంగా కంపెనీ తన 80 వ యానివర్సరీ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. జీప్ రాంగ్లర్ అద్భుతమైన లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు, వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి రోడ్ క్యాపబిలిటీస్ కూడా కలిగి ఉంటుంది.

ఇందులో 2.0 ఎల్ యూరో 6 డి పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 272 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. అయితే ఇది మంచి సామర్త్యాన్ని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇది కూడా భారతీయ మార్కెట్లో విడుదలవుతుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
New 2022 jeep commander design and features revealed ahead of global debut details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X