ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాంజ్ జీప్, దశాబ్ధాల క్రితం ఉపయోగించిన 'వ్యాగనీర్' నేమ్ ప్లేట్‌ను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చింది. జీప్ గ్రాండ్ వాగోనీర్ కాన్సెప్ట్ అడుగుజాడలను అనుసరించి, జీప్ ఓ ప్రొడక్షన్ వెర్షన్ వ్యాగనీర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

అంతర్జాతీయ మార్కెట్లలో ఫుల్ సైజ్ ప్రీమియం ఎస్‌యూవీలకు ఛాలెంజ్ విసిరేందుకు జీప్ తమ సరికొత్త వ్యాగనీర్ ఎస్‌యూవీని సిద్ధం చేసింది. కొత్త 2022 జీప్ వాగనీఆర్ మరియు గ్రాండ్ వాగనీఆర్ మూడు వరుసల కాన్ఫిగరేషన్‌తో బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాస్సిస్‌పై నిర్మించబడ్డాయి. ఈ రెండు మోడళ్లకు యూనిబోడీ నిర్మాణం ఉంటుంది.

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాగనీర్ ధర 57,995 డాలర్లు (సుమారు రూ.42.18 లక్షలు)గా ఉంటే, ప్రీమియం గ్రాండ్ వ్యాగనీర్ ధర 86,995 డాలర్లు (రూ. 63.27 లక్షలు)గా ఉంది. ఇవి మార్కెట్లో లెక్సస్ ఎల్ఎక్స్, జిఎమ్‌సి, కాడిలాక్ మరియు లింకన్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనే విభిన్న డిజైన్‌తో వస్తాయి.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

జీప్ వ్యాగనీర్ మరియు గ్రాండ్ వ్యాగనీర్ మోడళ్లలో అప్-మార్కెట్ ఇంటీరియర్స్, మరింత శక్తివంతమైన వి8 ఇంజన్ మరియు స్టాండర్డ్ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి.

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఇంజన్ విషయానికి వస్తే, జీప్ వ్యాగనీర్‌లో శక్తివంతమైన 5.7-లీటర్ వి8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 392 హార్స్‌పవర్ శక్తిని మరియు 548 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి విడుదలయ్యే శక్తిని వెనుక చక్రాలకు ప్రామాణికంగా పంపుతుంది. అయితే, ఇది ఫుల్ టైమ్ క్వాడ్రా-ట్రాక్ I, క్వాడ్రా-ట్రాక్‌లో టూ-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ కేసు మరియు క్వాడ్రా-డ్రైవ్ II తో టూ-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ కేసు మరియు ఎలక్ట్రానిక్ ఎల్‌ఎస్‌డి ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌లను కలిగి ఉంటుంది.

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఈ రెండు ఎస్‌యూవీలు 4,530 కిలోల కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నప్పటికీ, ఇవి అగ్రశ్రేణి ఆఫ్-రోడింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రీమియం వెర్షన్ గ్రాండ్ వ్యాగనీర్ మరింత శక్తివంతమైన 6.4-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు.

MOST READ:నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఈ ఇంజన్ గరిష్టంగా 471 హార్స్‌పవర్ శక్తిని మరియు 617 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని క్వాడ్రా-ట్రాక్ II వ్యవస్థ ద్వారా ఇంజన్ నుండి వెలువడే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఇందులో స్థిరమైన సెంటర్ కన్సోల్‌తో మొదటి రెండు వరుసలలో ఎయిర్ సస్పెన్షన్, సర్దుబాటు చేయగల యాంబియంట్ లైటింగ్ మరియు కెప్టెన్ సీట్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. అయితే, వినియోగదారులు కావాలనుకుంటే ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచ్ యుకనెక్ట్ 5 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ వినోదం కోసం కుడి వైపున 10.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్కీన్, వెనుక వరుసలో ప్యాసింజర్ల వినోదం కోసం 10.1 ఇంచ్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మరియు 23-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది మారుతి వ్యాగన్ఆర్ కాదు.. నెక్స్ట్ జనరేషన్ జీప్ వ్యాగనీర్

ఇంకా ఇందులో హ్యాండ్స్ ఫ్రీ యాక్టివ్ డ్రైవ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఫార్వర్డ్ కొల్లైజన్ అలెర్ట్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్ట్రెయిట్ ఫ్రంట్ ఫాసియా, సెవన్-స్లాట్ స్లిమ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు పాత వ్యాగనీర్ డిజైన్ గుర్తుచేసే కొన్ని డిజైన్ ఎలిమెంట్స్‌తో ఈ కొత్త తరం వ్యాగనీర్‌ను తయారు చేశారు.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Revealed 2022 Production Spec Wagoneer And Grand Wagoneer SUVs. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X