కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

జపనీస్ కార్ బ్రాండ్ Nissan తమ సరికొత్త స్పోర్ట్స్ కారు 'Nissan Z' ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త కార్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న లెజెండరీ 370 Z మోడల్‌ని భర్తీ చేస్తుంది మరియు దీనిని 'Nissan Z Coupe' (నిస్సాన్ జీ కూప్) అని పిలుస్తారు.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

పాత తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం Nissan Z మోడల్ ఎంతో అధునాతనంగా తీర్చిదిద్దబడింది. అమెరికాలోని ప్రసిద్ధ న్యూయార్క్ నగరంలో కంపెనీ తమ కొత్త Nissan Z కారును ఆవిష్కరించింది. వచ్చే ఏడాదిలో ఇది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ప్రారంభంలో Nissan తమ 370 Z మోడల్ యొక్క రీప్లేస్‌మెంట్ స్పోర్ట్స్ కారు గురించి టీజర్లను విడుదల చేసినప్పుడు, ప్రతి ఆటోమోటివ్ ఔత్సాహికుల మదిలో మెదిలిన విషయం ఒక్కటే, అదే దాని డిజైన్ సిల్హౌట్. దీని క్లాసిక్ షేప్, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కస్టమర్లను, కార్ ప్రియులను ఆకట్టుకుంది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ఈ నేపథ్యంలో, Nissan తమ పాపులర్ స్పోర్ట్స్ కార్ ప్రియులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా, అదే క్లాసిక్ డిజైన్‌ను ముందుకు తీసుకువెళ్తూ, డ్రైవ్‌ట్రెయిన్ మరియు డైనమిక్స్‌పై దృష్టి పెట్టి, ఈ కొత్త 2022 Nissan Z కారును తయారు చేసింది. ఒక సంవత్సరం క్రితం కంపెనీ వెల్లడించిన 'Z PROTO' కాన్సెప్ట్‌కు చాలా దగ్గరగా ఉండేలా కంపెనీ ఈ కొత్త స్పోర్ట్స్ కారును డిజైన్ చేసింది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

డిజైన్ పరంగా చూసుకుంటే, ఈ కొత్త 2022 Nissan Z ముందు వైపు స్క్వేర్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అలాగే, మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇందులో ప్రత్యేకమైన ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్‌లను కూడా ఉపయోగించారు కలిగి ఉంటుంది. దీని సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పొడవాటి బానెట్ మరియు వాలుగా ఉండే రియర్ డిజైన్‌తో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ఈ కొత్త 2022 Nissan Z వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్ కూడా స్వేర్ డిజైన్‌లో ఉంటాయి మరియు ఈ రెండింటినీ వెనుక వైపు పూర్తిగా పియానో బ్లాక్ కలర్ డిజైన్‌తో రూపొందించారు. గ్లోసీ బ్లాక్ అండ్ బాడీ కలర్‌లో రూపొందించిన రియర్ బంపర్ మరియు దానిలో అమర్చిన డ్యూయెల్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్స్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

కొత్త Nissan Z ఇంటీరియర్స్‌లో ఇది చదరపు సెంట్రల్ కన్సోల్ మరియు గుండ్రని డోర్ హ్యాండిల్స్ వంటి విభిన్న ఉపరితల ఆకృతులతో జపనీస్ స్పోర్ట్స్ కార్ ఇంజనీరింగ్‌కు అద్దం పడుతుంది. ఇందులోని సెంటర్ కన్సోల్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని పైభాగంలో ఏసి వెంట్స్ మరియు ఆ పైభాగంలో అమర్చిన మూడు అనలాగ్ గేజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ఈ మూడు అనలాగ్ గేజ్‌లు టర్బోచార్జర్ బూస్ట్, టర్బోచార్జర్ టర్బైన్ వేగం మరియు వోల్ట్‌లను చూపుతాయి. కొత్త Nissan Z లోపలి భాగంలో కస్టమర్ల దృష్టిని ఆకర్షించే మరొక విషయం ఏంటంటే, దాని గుండ్రటి స్టీరింగ్ వీల్ మరియు దాని వెనుక భాగంలో అమర్చిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ స్టీరింగ్ వీల్‌పై అనేక రకాల స్విచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ట్రిమ్ వారీగా చూసుకుంటే, బేస్ వేరియంట్‌లో కంపెనీ 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే మరింత ప్రీమియం అయిన స్పోర్ట్ ట్రిమ్‌లో 9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు లిమిటెడ్ ఎడిషన్ 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగిస్తోంది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ఈ రెండు వేరియంట్లతో పాటుగా కంపెనీ ఓ లిమిటెడ్-ఎడిషన్ 'Z PROTO' వేరియంట్‌ను కూడా విక్రయించనుంది. ఇలాంటివి కంపెనీ కేవలం 240 యూనిట్లను మాత్రమే (అమెరికాలో) తయారు చేయనుంది. కొత్త Nissan Z PROTO వేరియంట్‌లో కంపెనీ ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్స్, బ్లాంజ్ కలర్‌లో ఫినిష్ చేయబడిన 19 ఇంచ్ రే అల్లాయ్ వీల్స్, లోపలి భాగంలో ప్రత్యేకమైన లెదర్ ఇన్సర్ట్‌లు మరియు కొన్ని యల్లో కలర్ యాక్సెంట్లతో కనిపిస్తుంది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కారులో శక్తివంతమైన 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ వి6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 400 హెచ్‌పి శక్తిని మరియు 475 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డిస్‌కంటిన్యూ చేయబడిన Nissan 370 Z మోడల్ కంపెనీ 68 హెచ్‌పిలు ఎక్కువ శక్తిని మరియు 108 ఎన్ఎమ్‌ల ఎక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆప్షనల్ నైన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల ద్వారా రియర్ వీల్ డ్రైవ్ సదుపాయంతో అందుబాటులోకి రానుంది. ఇందులోని పెర్ఫార్మెన్స్ ట్రిమ్‌లో, లాంచ్ కంట్రోల్ సిస్టమ్ మరియు లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్ ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త 2022 Nissan Z స్పోర్ట్స్ కార్ ఆవిష్కరణ; డీటేల్స్

అలాగే, ఇందులోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పాదచారుల గుర్తింపుతో కూడిన ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో పాటుగా ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తోంది.

Most Read Articles

English summary
New 2022 nissan z sports car unveiled globally features specs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X