Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థగా ఇప్పటికీ దాని ఉనికిని చాటుకుంటోంది. ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కంపెనీ ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ (Audi A8 Facelift) ని అంతర్జాతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ అనేది కొత్త వెర్షన్ మోడల్ కాదని ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని కంపెనీ తెలిపింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లగ్జరీ సెడాన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (Mercedes-Benz S-Class) మరియు బిఎండబ్ల్యు 7 (BMW 7) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా, అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఇది మొత్తానికి కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా షార్ప్ మరియు స్టైలిష్ డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో చాలా అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్‌ ఉంటుంది. దీనికి రెండు వైపులా మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉపయోగించబడ్డాయి. ఇది కాకుండా, ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చే మరో ఎలిమెంట్ ఏమిటంటే, ఈ సెడాన్ కోసం OLED టెయిల్‌లైట్‌లను ఎంచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందించింది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

ఇక ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ యొక్క సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఈ సెడాన్ 21 ఇంచెస్ వరకు అల్లాయ్ వీల్స్‌ను ఎంచుకునే ఆప్సన్ అందించింది. అయితే కంపెనీ ఇందులో స్టాండర్డ్‌గా 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ అందిస్తుంది. ఇది కారును చాలా దూకుడుగా కనిపించేలా చేస్తాయి.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

కంపెనీ ఈ కొత్త ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ లో బ్రేకింగ్ కోసం, కార్బన్-సిరామిక్ బ్రేక్‌ ఆప్సన్స్ అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్‌ ఎక్స్టీరియర్ మాత్రమే కాకుండా దాని ఇంటీరియర్ ని కూడా బాగా అప్డేట్ చేసింది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్‌ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో అనేక డ్రైవర్-అసిస్ట్ ఫీచర్స్ మరియు టెక్నాలజీ వంటివి ఉపయోగించబడ్డాయి. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్ లో క్షితిజసమాంతరంగా ఉండే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. కావున వినియోగదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాబిన్ విశాలంగా ఉండటమే కాకుండా అద్భుతంగా ఉంటుంది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

కొత్త ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్ కనెక్టెడ్ టెక్‌తో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను పొందుతుంది. ఇది కాకుండా, ఈ కారుకు పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి వాటిని కూడా పొందుతుంది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లను పొందుతుంది. ఇందులో మొదటి 3.0-లీటర్ V6 TFSI ఇంజిన్ కాగా, రెండవది 4.0-లీటర్ TFSI ఇంజన్. ఈ రెండూ కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. కావున ఇంజన్లు 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

అంతే కాకుండా ఇందులో ఆడి యొక్క ఫోర్-వీల్-డ్రైవ్ క్వాట్రో సిస్టమ్ ఈ రెండు ఇంజన్లతో ఉపయోగించబడుతుంది. సెడాన్ యొక్క మరింత శక్తివంతమైన పర్ఫామెన్స్ బేస్డ్ వెర్షన్ S8 ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌తో కూడా అందించబడుతుంది. ఇది 563 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

Audi A8 Facelift: ఇప్పుడు సూపర్ డిజైన్ & సూపర్ ఫీచర్స్

ఈ కొత్త ఆడి ఎ8 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ యొక్క ధర వంటి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కావున దీనికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడవుతుంది. అప్పటివరకు వేచి ఉండక తప్పదు. ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు స్కూటర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన బైక్స్ మరియు స్కూటర్స్ గురించి మాత్రమే కాకూండా ఆటో మొబైల్ గురించిన ఆసక్తికరమైన విషయాలను గురించి మొత్తం సమాచారం తెలుసుకోండి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New audi a8 facelift unveiled for global market features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X