భారత్‍లో 2021 Audi Q5 లాంచ్.. ఎప్పుడంటే?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో తన కొత్త 2021 Audi Q5 Facelift (2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్) SUV ని విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కొత్త లగ్జరీ SUV ని 2021 నవంబర్ 23 న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో కొత్త 2021 ఆడి క్యూ5 బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. కావున ఈ SUV కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షల అడ్వాన్స్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తిని స్థానికంగా ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ఇప్పుడు భారతీయ మార్కెట్లో ప్రారంభించబడింది. కావున ఆడి ఇండియా ఈ కొత్త ఫేస్‌లిఫ్టెడ్ SUVని స్థానికంగా తయారుచేయనుంది. కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉండి, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

కొత్త 2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ మునుపటికంటే కూడా చాలా స్పోర్టివ్‌గా కనిపిస్తోంది, ఇది హానీ కూంబ్ నమూనాతో పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఉంది. 2021 Audi Q5 Facelift యొక్క ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కస్టమైజ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లతో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. వీటితో పాటు కారు యొక్క టెయిల్‌గేట్ కూడా మార్చబడింది.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

Audi Q5 Facelift యొక్క వెనుక భాగం కూడా చాలా స్పోర్టీగా ఉంటుంది. ఈ కొత్త కారు మునుపటి మోడల్ కంటే కూడా చాలా వెడల్పుగా కనిపిస్తుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ అల్ట్రా బ్లూ మరియు డిస్ట్రిక్ట్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త Audi Q5 Facelift చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

Audi Q5 Facelift యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, సాధారణ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్యాబిన్ మరియు కొత్త క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ మధ్య చాలా పోలికలు ఉండవచ్చు. అయితే, సెంటర్ కన్సోల్‌లోని డ్యూయల్-డిస్‌ప్లే సెటప్ తొలగించబడింది. అయితే ఇందులో లేటెస్ట్ 10.1-ఇంచెస్ ఎమ్ఎమ్ఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉంటాయి.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

ఇవి మాత్రమే కాకుండా ఇందులో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కొత్త 2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్‌లో అందించబడతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

ఈ కొత్త కారులో 12-వోల్ట్ లైట్ వెయిట్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇది A6 వలె, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో, కంపెనీ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజిన్ శక్తిని తన నాలుగు చక్రాలకు ప్రసారం చేస్తుంది.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

Audi Q5 Facelift అనేది ఈ ఏడాది కంపెనీకి 9 వ ఉత్పత్తి కానుంది. ఆడి క్యూ5 అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నింది ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడంలో తప్పకుండా విజయం పొందుతుందని భావిస్తున్నాము.

కంపెనీ ఇటీవల తమ అమ్మకాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంలో లగ్జరీ కార్లపై అధిక పన్నుల కారణంగా, అమ్మకాలు చాలా ప్రభావితం అవుతున్నాయని తెలిపింది. లగ్జరీ కార్ల తయారీదారులకు సహాయం చేయడానికి ప్రభుత్వం టారిఫ్‌లను తగ్గించాలని కార్ల తయారీదారు స్పష్టం చేస్తున్నారు.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

లగ్జరీ కార్ల సెగ్మెంట్‌పై ఆందోళన వ్యక్తం చేసిన ఆడి, దేశంలో లగ్జరీ కార్ల వాటా రెండు శాతం కంటే తక్కువేనని, గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. ఇతర కార్ల సెగ్మెంట్లు వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, లగ్జరీ కార్ల వార్షిక విక్రయాలు 40,000 యూనిట్లకు మించి పెరగడం లేదని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.

భారత్‍లో 2021 Audi Q5 లాంచ్ ఎప్పుడంటే?

కరోనా మహమ్మారి ప్రభావం మరియు సెమీకండక్టర్ చిప్‌ల కొరత కారణంగా, ఈ సంవత్సరం అమ్మకాల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు దేశీయ మార్కెట్లో లగ్జరీ వాహన ప్రియులు ఈ 2021 ఆడి క్యూ5 విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు కంపెనీ ఈ SUV యొక్క విడుదల తేదీని తెలిపింది. కావున వాహన ప్రియులు ఈ కారు డెలివరీ కోసం వేచి చూడాలి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New audi q5 india launch on 23rd november design features engine details
Story first published: Tuesday, November 9, 2021, 14:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X