భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడో తెలుసా?

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి, ఇప్పటికే దేశీయ మార్కెట్లో అనేక వాహనాలను ప్రవేశపెట్టి అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఈ నేపథ్యంలో భాగంగానే మరో కారును విడుదల చేయడానికి తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తుంది. ఆడి కంపెనీ ప్రవేశపెట్టనున్న మోడల్ 'ఆడి ఆర్ఎస్5'. ఈ కొత్త ఆడి ఆర్ఎస్5 గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

భారత మార్కెట్లో ప్రవేశించనున్న కొత్త ఆడి ఆర్ఎస్5 పవర్ ఫుల్ స్పోర్ట్ బ్యాక్ మోడల్. కంపెనీ ఈ మోడల్ యొక్క విడుదల తేదీని కూడా ఇప్పటికే వెల్లడించింది. నివేదికల ప్రకారం ఆడి ఆర్ఎస్5 2021 ఆగస్టు 9 న అధికారికంగా విడుదల కానుంది. ఈ కొత్త ఆడి ఆర్ఎస్5 కారు భారతదేశంలో సిబియు మార్గం ద్వారా భారత తీరాలను చేరనుంది.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

కొత్త ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ ధర సుమారు రూ. 1.5 కోట్లు ఉంటుందని భావిస్తున్నాము. ఆడి కంపెనీ గత సంవత్సరం చివర్లో ఆర్ఎస్5 ని స్పేస్‌గా పరిచయం చేసింది. ఆడి ఇటీవల ఆడిఎస్5 ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఆర్ఎస్5 మోడల్ మరింత స్టైలిష్ గా ఉంటుంది.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

కొత్త ఆడి ఆర్ఎస్5 మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు ముందు భాగం చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీని ముందుభాగంలో ఫ్రంట్ గ్రిల్ లభిస్తుంది. ఇది ఎస్5 కన్నా కొంచెం వెడల్పుగా ఉంటుంది. దీని ముందు గ్రిల్ క్రింద కొత్త ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. కొత్త ఆడి ఆర్ఎస్5 కారు ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ యూనిట్ ని కలిగి ఉంటుంది.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

కొత్త ఆడి ఆర్ఎస్5 లో కొత్త డిఫ్యూజర్ మరియు 19 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఈ ఆడి ఆర్ఎస్5 కారులో 2.9 లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్-టర్బోచార్జ్డ్ వి6 పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 444 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ మరియు టార్క్‌ను పంపుతుంది.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

ఈ ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్లు వేగవంతం చేయగలదు. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 280 కి.మీ వరకు ఉంటుంది. కొత్త స్పోర్ట్‌బ్యాక్ ఇప్పుడు టర్బో బ్లూ లేదా టాంగో రెడ్‌ అనే కలర్ లో అందుబాటులో ఉంది.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

మార్కెట్లో ఆడి ఎస్5 స్పోర్ట్ బ్యాక్ స్పోర్ట్స్ సస్పెన్షన్. కొత్త స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌లో స్టాండర్డ్ ఆడి డ్రైవ్ సెలెక్ట్ మరియు నాలుగు మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి కంఫర్ట్, ఆటో, డైనమిక్ మరియు ఇండివిజువల్ మోడ్స్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో 2021 ఆడి RS5 లాంచ్ డేట్ ఫిక్స్; ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ సి63 కొత్త ఆడి ఆర్ఎస్5 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి మరియు బీఎండబ్ల్యూ ఎమ్3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త ఆడి స్పోర్ట్ బ్యాక్ వచ్చే వారం ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. అయితే దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన వెంటనే ఎలాంటి అమ్మకాలను నమోదు చేస్తుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
2021 Audi RS5 India Launch Date Confirmed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X