భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా విడుదలయింది. దీనిని దేశీయ మార్కెట్ కోసం రూ. 4.10 కోట్ల ధరకు తీసుకువచ్చారు. దీని బుకింగ్స్ ఇప్పుడు ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ నగరాలలో ప్రారంభించబడింది. కొత్త బెంట్లీ బెంటాయిగా రూపకల్పనలో చాలా మార్పులు జరిగాయి. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు ఉన్నాయి. ఈ కొత్త బెంట్లీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

భారత మార్కెట్లో విడుదలైన బెంట్లీ బెంటాయిగా ఎన్ని మార్పులు పొందినప్పటికీ ఇందులో ఉన్న ఇంజిన్ మాత్రం మునుపటిలాగే ఉంటుంది. బెంట్లీ బెంటాయిగా కంపెనీ యొక్క ప్రసిద్ధ మోడల్, ఇది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 20,000 యూనిట్లను విక్రయించింది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

బెంట్లీ బెంటాయిగా మొదటి తరం మోడల్ 2016 లో ప్రవేశపెట్టారు. అంతే కాకుండా ఈ మోడల్ లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో బెంచ్‌మార్క్‌ను నిర్ణయించింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన కూడా లభించింది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

కొత్త బెంట్లీ బెంటాయిగా ఇప్పుడు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లోపలి భాగంలో కొత్త సీట్లు మరియు ట్రిమ్ మరియు మరిన్ని లెగ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇది ముందు భాగంలో పెద్ద గ్రిల్ మరియు రెండు వైపులా వృత్తాకార ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

బెంట్లీ బెంటాయిగా యొక్క సేడ్ ప్రొఫైల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ వంటివి ఉన్నాయి. ఇందులో 10.9 ఇంచెస్ స్క్రీన్ ఉంది, ఇది అదనపు కనెక్టివిటీ టెక్నాలజీ మరియు హై రిజల్యూషన్ గ్రాఫిక్స్ తో వస్తుంది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

ఇది డార్క్ టింటేడ్ డైమండ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ట్రిమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, కొత్త నావిగేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మై బెంట్లీ కనెక్టెడ్ సర్వీస్ కోసం ఈ కారులో సిమ్ కార్డు కూడా ఇవ్వబడింది. బెంట్లీ బెంటాయిగాలో 4.0 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది, ఇది ఆల్ వీల్ డ్రైవ్ కారు.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

బెంట్లీ బెంటాయిగా ఎప్పుడూ అప్డేట్ చేయబడుతూనే ఉంటుంది. ఈ కొత్త మోడల్‌ను కూడా ఇదేవిధమైన అప్డేట్స్ తో తీసుకువచారు. ఇందులో చేసిన అతిపెద్ద మార్పు వెనుక భాగంలో కనిపిస్తుంది. దాని లైసెన్స్ ప్లేట్ యొక్క స్థానం కూడా మార్చబడింది, అలాగే కొత్త సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ లో కూడా కొంత అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త 2021 బెంట్లీ బెంటాయిగా ; పూర్తి వివరాలు

పైన చెప్పినవి మాత్రమే కాకుండా, ఈ కారులో ఇంకా చాలా ఫీచర్లు మరియు టెక్నాలజీ ఇవ్వబడ్డాయి. ఈ కారణంగా ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బెంట్లీ బెంటాయిగా కి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
2021 Bentley Bentayga Launched In India. Read in Telugu.
Story first published: Tuesday, March 16, 2021, 18:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X