బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ప్రారంభ తేదీని కూడా బిఎమ్‌డబ్ల్యూ ఇటీవల వెల్లడించింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క కొత్త లాంగ్-వీల్‌బేస్ వెర్షన్ జనవరి 21, 2021 న భారతదేశంలో విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా దృవీకరించింది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

అయితే కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క బుకింగ్స్ ఈ నెల 11 న ప్రారంభమవుతాయని కూడా కంపెనీ తెలిపింది. ఈ కారు ఇప్పటివరకు విడుదలైన వాటిలోకంటే పొడవైన మరియు విశాలమైన ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ అవుతుంది. ప్రయాణీకులకు అదనపు స్థలాన్ని అందించడానికి సెడాన్ అదనపు పొడవును కలిగి ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

గ్రాన్ లిమోసిన్ వెర్షన్ లాంగ్-వీల్‌బేస్ మినహా మిగతా అన్ని అంశాలలో స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. కారు యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ కూడా స్టాండర్డ్ వేరియంట్లో మాదిరిగానే ఉంటుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది.

MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో వైర్‌లెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3 డి నావిగేషన్, రియర్ పార్క్ అసిస్ట్, బిఎమ్‌డబ్ల్యూ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 255 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 8 స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడింది.

MOST READ:భారత్‌లో కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన జీప్ : పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

ఈ కారులో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజన్ కూడా ఇవ్వవచ్చు. ఈ ఇంజన్ 188 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను స్టాండర్డ్ గా కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

ఈ కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఇప్పటివరకు విడుదలైన పొడవైన మరియు విశాలమైన ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్. అంతే కాకుండా ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్‌ఇ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

దేశవ్యాప్తంగా తన ఉత్పత్తి శ్రేణిలో కంపెనీ ధరను పెంచబోతున్నట్లు ఇటీవల బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది. కావున బిఎమ్‌డబ్ల్యూ మరియు మినీ మోడల్ రేంజ్ 2021 జనవరి 4 నుండి పెరిగిన ధరలతో భారతదేశంలో విక్రయించబడుతుంది. ఇప్పటికే దాదాపు చాలా కంపెనీలు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ కూడా పెంచిన ధరతో విక్రయిస్తుంది.

Most Read Articles

English summary
BMW 3 Series Gran Limousine Pre-Bookings To Begin From January 11. Read in Telugu.
Story first published: Friday, January 8, 2021, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X