భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఎట్టకేలకు భారత మార్కెట్లో తన 2021 5 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బిఎండబ్ల్యూ 5 సిరీస్‌ యొక్క ప్రారంభ ధర రూ. 62.90 లక్షల. కొత్త 5 సిరీస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 5 సిరీస్ బుకింగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓపెన్ చేయబడ్డాయి. కొత్త 5 సిరీస్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు డిజైన్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

బిఎండబ్ల్యూ 5 సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520 డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 62.90 లక్షలు, రూ. 63.90 లక్షలు మరియు 71.90 లక్షలు. ఈ కొత్త 5 సిరీస్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా తయారుచేయబడింది.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

కొత్త బిఎండబ్ల్యు 5 సిరీస్‌లోని కొన్ని ఎలిమెంట్స్ దాని 3 సిరీస్ నుంచి తీసుకోబడ్డాయి. ఇందులో కిడ్నీ షేప్ గ్రిల్ కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో ఇది చూడటానికి చాలా షార్ప్ గా ఉండటమే కాకుండా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా మరియు వెడల్పుగా కనిపిస్తుంది. దీనికి సింగిల్ పీస్ క్రోమ్ సరౌండ్ ఇవ్వబడింది. ఇది కొత్త హెడ్‌లైట్ మరియు కొత్త క్లస్టర్, కొత్త అడాప్టివ్ ఎల్‌ఇడి మరియు లేజర్ టెక్నాలజీ మరియు షార్ప్ ఎల్-షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

ఈ కొత్త బిఎండబ్ల్యు 5 సిరీస్‌ వెనుక భాగంలో ఎల్-షేప్ ఎల్‌ఇడి టైల్ లైట్స్ ఉన్నాయి. దీని బంపర్ కూడా చాలా దూకుడుగా కనిపిస్తుంది. వీటితో పాటు ఇందులో రెడ్ కాలిపర్‌లతో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే స్టాండర్డ్ వేరియంట్‌కు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. మొత్తానికి కొత్త 5 సిరీస్ చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

కొత్త బిఎండబ్ల్యు 5 సిరీస్‌ యొక్క ఫీచర విషయానికి వస్తే, ఇందులో ఐడ్రైవ్ 7 యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వబడింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది, అంతే కాకుండా అదే పరిమాణంలో స్క్రీన్ సెంట్రల్ కన్సోల్‌లో ఇవ్వబడింది. ఇది దాని మునుపటి వెర్షన్లకంటే కూడా మంచి రెస్పాన్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

బిఎండబ్ల్యు 5 సిరీస్‌ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, గ్లాసియస్ సిల్వర్, కార్బన్ బ్లాక్, మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్లూస్టోన్ అనే కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

ఇవి మాత్రమే కాకుండా ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, బిఎండబ్ల్యు నావిగేషన్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, యూజర్ ఇంటర్ఫేస్ వంటి వాటికీ కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో 360 డిగ్రీల కెమెరా, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్ సీటు, లేజర్ లైట్ వంటివి కూడా ఇవ్వబడ్డాయి.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

అంతే కాకుండా , ఇందులో అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, స్టీరింగ్ అండ్ లేన్ కంట్రోల్ అసిస్టెంట్, ఆటోమేటిక్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

కొత్త బిఎండబ్ల్యు 5 సిరీస్‌ లో మంచి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

కొత్త 5 సిరీస్ వేరియంట్ల ద్వారా పరిమితం చేయబడిన మూడు ఇంజన్ ఆప్సన్స్ తో అందించబడుతుంది. అన్ని ఇంజన్లు అదే 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జత చేయబడతాయి.

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎమ్ స్పోర్ట్స్ వేరియంట్ 2.0-లీటర్, ఇన్లైన్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 5,200 ఆర్‌పిఎమ్ వద్ద 248 బిహెచ్‌పి పవర్ మరియు 4,800 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

అదే విధంగా 520 డి వేరియంట్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 187.7 బిహెచ్‌పి పవర్ మరియు 2,500 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక చివరగా 530డి ఎమ్ స్పోర్ట్స్ వేరియంట్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 261.4 బిహెచ్‌పి పవర్ మరియు 2,500 ఆర్‌పిఎమ్ వద్ద 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది

భారత్‌లో విడుదలైన 2021 బిఎండబ్ల్యూ 5 సిరీస్; ధర & వివరాలు

ప్రస్తుత తరం బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌ 2017 లో ప్రవేశపెట్టారు. దాదాపు సంవత్సరాల తర్వాత దీనిని మల్లి అప్డేట్ చేయడం జరిగింది. 2021 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ భారత మార్కెట్లో ఆడి ఎ 6, మెర్సిడెస్ ఇ-క్లాస్ మరియు జాగ్వార్ ఎక్స్‌ఎఫ్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 BMW 5 Series Launch In India. Read in Telugu.
Story first published: Thursday, June 24, 2021, 13:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X