భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి: ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW, భారతీయ మార్కెట్లో కొత్త BMW X5 xDrive SportX Plus SUV ని విడుదల చేసింది. BMW X5 xDrive SportX Plus రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి XDrive40i మరియు xDrive30d వేరియంట్లు. ఈ రెండు వేరియంట్లు కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

దేశీయ మార్కెట్లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ధరల విషయానికి వస్తే, xDrive40i ధర రూ. 77.90 లక్షలు కాగా, xDrive30d వేరియంట్ ధర రూ. 79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కార్ బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

BMW ఇండియా, ఈ రెండు మోడళ్లను భారతదేశంలోనే స్థానికంగా తయారు చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ ఈ కొత్త మోడల్స్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

BMW ఇండియా X5 xDrive SportX Plus అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో రివర్స్ అసిస్టెంట్, BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ వంటి అనేక కొత్త టెక్నాలజీలతో వస్తున్నాయి. మొత్తం మూడు మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లతో X5 xDrive SportX Plus SUV ని కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ మరియు బ్లాక్ సఫైర్ అనే కలర్స్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

కొత్త BMW X5 xDrive SportX Plus SUV కాన్బెర్రా బీజ్ కలర్ మరియు బ్లాక్‌ సెన్సటెక్ అపోల్స్ట్రే తో ప్రామాణికంగా పొందుతుంది. డిజైన్ పరంగా, కొత్త X5 xDrive SportX Plus పెద్ద సింగిల్-పీస్ హెక్సా గోనల్ కిడ్నీ షేప్ గ్రిల్‌ను పొందుతుంది. ఇవి కాకుండా ఈ SUV లో LED హెడ్‌లైట్లు, LED ఫాగ్ ల్యాంప్‌లు మరియు 3D LED వ్రాపారౌండ్ టెయిల్‌లైట్లు ఉపయోగించబడ్డాయి. ఇందులో కనిపించే రూఫ్ రైల్స్ శాటిన్-ఫినిష్డ్ అల్యూమినియంలో వస్తాయి.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

కొత్త BMW X5 xDrive30d యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 3.0-లీటర్, ట్విన్‌పవర్ టర్బో ఇన్-లైన్ డీజిల్ ఇంజిన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ కేవలం 6.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

ఇక BMW X5 xDrive40i యొక్క 3.0-లీటర్, ట్విన్‌పవర్ టర్బో ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 340 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

ఈ కారు BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌లో 3D నావిగేషన్‌తో BMW ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 ని పొందుతుంది. ఇది కాకుండా, కారు హై రిజల్యూషన్‌తో 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచెస్ కంట్రోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), కార్నర్ బ్రేక్ కంట్రోల్ (CBC), ఆటో హోల్డ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికిల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్ మరియు ISOFIX చైల్డ్ సీట్ వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త లగ్జరీ కారు ఎలాంటి అమ్మకాలను చవి చూస్తుందో త్వరలో తెలుస్తుంది.

భారత్‌లో విడుదలైన BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి

BMW కంపెనీ తన కొత్త SUV లపై 3 సంవత్సరాల / 40,000 కిమీల నుండి 10 సంవత్సరాల / 2,00,000 కిమీల వార్నటీని కూడా అందిస్తుంది. ప్రామాణిక రెండు సంవత్సరాల వారంటీ వ్యవధి పూర్తయిన తర్వాత, మూడవ సంవత్సరం ఆపరేషన్ నుండి గరిష్టంగా ఆరవ సంవత్సరం వరకు వారంటీ ప్రయోజనాలను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

BMW ఇండియా అద్భుతమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే నెలకు రూ. 65,999 నుండి తక్కువ నెలవారీ చెల్లింపులతో ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందిస్తుంది. 4 సంవత్సరాల వరకు బైబ్యాక్ హామీ మరియు టర్మ్ ఆప్షన్‌ల వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొనువులుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.కావున ఎక్కువ మంది ఈ కొత్త SUV లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
New bmw x5 xdrive sportx plus launched in india at rs 77 90 lakhs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X