2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమయ్యింది, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆటో మొబైల్ పరిశ్రమలు మంచి అమ్మకాలను చేపట్టే అవకాశం ఉందని ఆశించాయి. కానీ మునుపటికంటే కొంత మంచి అమ్మకాలతో ముందుకు సాగినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ్మకాలను జరపలేకపోయాయి. అయితే ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మోడల్స్ మాత్రమే అద్భుతమైన అమ్మకాలను చేపట్టగలిగాయి. అంతే కాదు టాప్ 10 జాబితాలో కూడా స్థానం పొందాయి.

ఇటీల కాలంలో భారత మార్కెట్లో Tata Punch, Mahindra XUV700, Tata Safari మరియు Volkswagen టైగన్ వంటి మోడల్స్ విదుడయ్యాయి. విడుదలైన అన్ని మోడల్స్ కి కూడా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ వాహనాల యొక్క అమ్మకాల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

టాటా పంచ్ (Tata Punch):

భారతీయ మార్కెట్లో Tata Motors యొక్క Tata Punch విడుదలైన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన స్పందనను పొందగలిగింది. కేవలం ఒక్క నెల సమయం కాకముందే అమ్మకాలలో SUV విభాగంలో నాల్గవ స్థానంలో నిలిచింది. టాటా పంచ్ గత నెలలో 8,453 యూనిట్లు విక్రయించబడ్డాయి.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

Tata Punch మొదటి నెలలోనే టాటా ఆల్ట్రోజ్‌ను అధిగమించగలిగింది. అయితే కంపెనీ ఇప్పటికి ఎన్ని బుకింగ్స్ అందుకుంది అనే విషయం ప్రకటించలేదు. అయినప్పటికీ Tata Motors టాటా పంచ్ కారణంగా, గత నెలలో 33,926 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ కారణంగానే అమ్మకాల పరంగా కంపెనీ మూడవ స్థానంలో నిలిచింది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

కంపెనీ యొక్క అమ్మకాలు 2021 అక్టోబర్‌ నెలలో 44 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కారణంగా మార్కెట్ వాటా ఇప్పుడు 13.7 శాతానికి పెరిగింది. Tata Punch మైక్రో SUV 2021 అక్టోబర్ 18 న విడుదల చేయబడింది. అయితే ఈ నెలలో కూడా మంది అమాంకాలను పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటో Mahindra & Mahindra. మహీంద్రా కంపెనీ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన XUV700 3,407 యూనిట్లు విక్రయించబడింది. ఈ SUV విడుదలైన ఒక నెల సమయంలోనే మహీంద్రా XUV 700 ఏకంగా 70,000 యూనిట్లకు పైగా బుక్ చేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త SUV కి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ అర్థమౌతుంది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

మహీంద్రా కంపెనీ ఇప్పటికే XUV700 యొక్క పెట్రోల్ మోడల్ డెలివరీలను ప్రారంభించింది. అయితే నవంబర్ చివరి వారం నుండి దాని డీజిల్ మోడళ్ల డెలివరీ చేయబడుతుందని తెలిపింది. కంపెనీ నివేదికల ప్రకారం 2022 జనవరి నాటికి 14,000 యూనిట్లను డెలివరీ చేయనుంది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

మహీంద్రా XUV700 మొదటి దశ బుకింగ్‌లు అక్టోబర్ 7న ప్రారంభించబడ్డాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ కైవసం చేసుకుంది. రెండవ రోజు రెండు గంటల వ్యవధిలో మరో 25,000 యూనిట్ల బుకింగ్స్ పొందింది. ఇప్పటికి కంపెనీ 70,000 XUV700 బుకింగ్స్ పొందింది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

టాటా సఫారి (Tata Safari):

టాటా మోటార్స్ యొక్క 6/7-సీటర్ SUV టాటా సఫారి కూడా మార్కెట్‌లో బాగా రాణిస్తోంది. 2021 అక్టోబర్ నెలలో కంపెనీ ఈ SUV యొక్క మొత్తం 1,735 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. టాటా సఫారి XE, XM, XT, XT+, XZ, XZ+ లలో అందుబాటులో ఉంది. సెప్టెంబర్‌లో, ఈ SUV గోల్డ్ ఎడిషన్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

టాటా సఫారీ గోల్డ్ ఎడిషన్ రూ. 21.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయబడింది. కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ రెండు విభిన్న రంగు ఎంపికలలో అందించబడుతుంది. అవి వైట్ గోల్డ్ మరియు బ్లాక్ గోల్డ్ కలర్ ఆప్సన్స్. కంపెనీ ఈ వేరియంట్‌లో బ్లాక్ రూఫ్‌ను అందిస్తుంది. ఈ కొత్త SUV అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఎక్కువమందిని ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్:

Volkswagen కంపెనీ తన టైగన్ SUV ని దేశీయ మార్కెట్లో గత నెలలో 2,551 యూనిట్లను విక్రయించింది. దీనితో ఇది స్కోడా కుషాక్ వంటి ప్రత్యర్థులను కూడా అవలీలగా అధిగమించింది. లాంచ్ అయిన ఒక నెల తర్వాత, ఈ కారు 18,000 కంటే ఎక్కువ యూనిట్లు బుక్ అయినట్లు కంపెనీ తెలియజేసింది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

Volkswagen టైగన్ యొక్క ప్రారంభ ధర రూ. 10.50 లక్షలు(ఎక్స్-షోరూమ్). టైగన్ SUV సుమారు 12,000 యూనిట్ల ప్రీ-బుకింగ్‌లు అందుకోగా, సగటున రోజుకు 250 బుకింగ్‌లను పొందుతున్నట్లు కంపెనీ తెలిపింది. 2021 సంవత్సరానికి కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క మొత్తం ప్రొడక్షన్ బ్యాచ్ అమ్ముడైంది. ఈ SUV కి మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న అధిక డిమాండ్ దృష్ట్యా కంపెనీ ఈ SUV బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది.

2021 అక్టోబర్ అమ్మకాల్లో కొత్త మోడల్స్ హవా.. ఈ నెల అమ్మకాల్లో కూడా పరుగులే?

భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న మోడల్స్ కంటే కూడా కొత్తగా మార్కెట్లో అడుగుపెడుతున్న కార్లకు అమితమైన ఆదరణ ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. గత నెలలో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన రెండు కార్లు గత నెల అమ్మకాల్లో టాప్ 25 లో తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. అంతే కాకుండా మిగిలిన అన్ని కొత్త మోడల్స్ కూడా మంచి స్పందన పొందగలుగుతున్నాయి. ఈ కొత్త మోడల్స్ గత నెలలాగానే ఈ నెలలో కూడా మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #సేల్స్ #sales
English summary
New car sales october 2021 tata punch mahindra xuv700 tata safari volkswagen taigun details
Story first published: Friday, November 5, 2021, 17:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X