Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తమ పంచ్ (Punch) మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) కూడా ఈ విభాగంలో తమ కాస్పస్ (Casper) మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ బుజ్జి ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడి చేసింది.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

తాజా సమాచారం ప్రకారం, Hyundai త్వరలోనే తమ Casper మైక్రో ఎస్‌యూవీని ప్రపంచ మార్కెట్ల కోసం విడుదల చేయబోతోంది. ప్రారంభానికి ముందే ఈ కొరియన్ కార్ల బ్రాండ్ తమ మినీ ఎస్‌యూవీ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్‌ వివరాలను వెల్లడి చేసే చిత్రాల ద్వారా కొత్త 2022 Casper గురించి మరిన్ని వివరాలను పంచుకుంది.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

ఈ నెల ప్రారంభంలో, Hyundai Casper మైక్రో ఎస్‌యూవీ యొక్క మొదటి అధికారిక చిత్రాలను కంపెనీ విడుదల చేసింది. ఇందులో కారు యొక్క బాహ్య డిజైన్‌ను ప్రదర్శించింది. ఈ కారు ఫ్రంట్ డిజైన్ ను గమనిస్తే, పెద్ద రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ లో అమర్చిన గుండ్రటి హెడ్‌లైట్స్, ఫ్రంట్ బంపర్‌లో బ్లాక్ అండ్ గ్రే గార్నిష్, హుడ్ క్రింద అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

దీని సైడ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో సరికొత్త అల్లాయ్ వీల్స్, ఉబ్బినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్, బాడీ చుట్టూ సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, బాడీ కలర్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక విడ్‌షీల్డ్ వద్ద అమర్చిన రియర్ డోర్ హ్యాండిల్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్ మరియు బ్రాక్డ్ అవుట్ ఏ పిల్లర్ వంటి డీటేలింగ్స్ ఇందులో ఉన్నాయి.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

అలాగే, ఇక వెనుక డిజైన్‌లో బంపర్ లో అమర్చిన రెండు గుండ్రటి టెయిల్ ల్యాంప్స్ మరియు వాటి మధ్యలో నెంబర్ ప్లేట్, బంపర్ దిగువ భాగంలో బ్లాక్ అండ్ గ్రే కలర్ స్కిడ్ ప్లేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ స్పాయిలర్ మరియు రియర్ వాషర్ అండ్ వైపర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో గమనించవచ్చు.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

కాగా, Hyundai తాజాగా తమ Casper మైక్రో ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్ వివరాలను తెలిపే టీజర్ చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ చిత్రాల ప్రకారం, క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్స్ అన్నీ బ్లాక్ కలర్ లో ఉంటాయి. అయితే, అప్‌హోలెస్ట్రీ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

ఫ్రంట్ సీట్ బ్యాక్ రెస్ట్‌లు బేజ్ కలర్ లో మరియు సీట్ (కూర్చునే ప్రాంతం) బ్లూ కలర్ అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటాయి. అలాగే వెనుక వరుసలోని రెండు సీట్లు మాత్రం పూర్తిగా బేజ్ కలర్ అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటాయి. సీట్లపై లేత పసుపు రంగు పైపింగ్ కనిపిస్తుంది, ఇది చాలా స్పోర్టీ ఫీల్ ను అందిస్తుంది. మరొక ఇంటీరియర్ టీజర్ లో డ్యాష్‌బోర్డుపై ఆరెంజ్ కలర్ యాక్సెంట్స్ మరియు మొత్తం బేజ్ కలర్ అప్‌హోలెస్ట్రీ కనిపిస్తుంది.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

హ్యుందాయ్ కాస్పర్‌లోని స్టీరింగ్ వీల్ ఫ్లాట్-బాటమ్ ను కలిగి ఉండి మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌ ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెంటర్ కన్సోల్‌ పై ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, డ్యాష్‌బోర్డ్ పైనే అమర్చిన గేర్ నాబ్ మరియు వివిధ రకాల ట్రాక్షన్ మోడ్‌ లను ఎంచుకోవడానికి ఓ గుండ్రటి డయల్ మొదలైనవి ఉన్నాయి.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

కొత్త 2022 Hyundai Casper ను కంపెనీ తమ ప్రాజెక్ట్ AX1 యొక్క ప్రొడక్షన్ వెర్షన్ గా రూపొందించింది. ప్రత్యేకించి, పట్టణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది. ఇదొక 4-సీటర్ మినీ ఎస్‌యూవీ. ప్రస్తుత కంపెనీ తయారు చేస్తున్న Hyundai i10 ప్లాట్‌ఫామ్ పైనే ఈ కొత్త కారును కూడా అభివృద్ధి చేశారు.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

ఈ మైక్రో ఎస్‌యూవీలో ఉపయోగించబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ మల్టీ పాయింట్ ఇంజెక్షన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఇందులోని న్యాచురల్ ఇంజన్ గరిష్టంగా 75 hp శక్తిని విడుదల చేయగలదు. కాగా, టర్బోచార్జ్డ్ యూనిట్ గరిష్టంగా 99 hp శక్తిని ఉత్పత్తి చేయగలదు.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

ఈ ప్లాట్‌ఫామ్ హైబ్రిడ్ లేదా పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాస్పర్ మార్కెట్లో విడుదలైన తర్వాత కంపెనీ ఇందులో హైబ్రిడ్ లేదా పూర్తి ఎలక్ట్రిక్ ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, Hyundai Casper ముందుగా కొరియన్ మార్కెట్లో విడుదల కానుంది. అయితే, ఈ కారును భారతదేశంలో ప్రవేశపెట్టడంపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Casper మైక్రో ఎస్‌యూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చిన Hyundai

అయితే, భారత మార్కెట్లో త్వరలో రాబోయే మైక్రో ఎస్‌యూవీలు టాటా పంచ్ మరియు సిట్రోయెన్ సి3 వంటి మోడళ్లకు హ్యుందాయ్ కాస్పర్ మైక్రో ఎస్‌యూవీ మంచి పోటీగా ఉంటుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Most Read Articles

English summary
New details revealed about hyundai casper micro suv ahead of launch
Story first published: Tuesday, September 14, 2021, 16:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X