ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న డిఫెండర్ మోడళ్లలో ఓ డీజిల్ వెర్షన్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 (త్రీ-డోర్స్) మరియు డిఫెండర్ 110 (ఫైవ్-డోర్స్) వెర్షన్లలో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. మార్కెట్లో డిఫెండర్ 90 డీజిల్ ధరలు రూ.94.36 లక్షల నుండి రూ.1.08 కోట్ల మధ్యలో ఉండగా, డిఫెండర్ 110 ధరలు రూ.97.03 లక్షల నుంచి రూ.1.08 కోట్ల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).

Land Rover Defender Price
90 SE ₹94.36 Lakh
90 HSE ₹98.37 Lakh
90 X-Dynamic HSE ₹101.57 Lakh
90 X ₹108.16 Lakh
110 SE ₹97.03 Lakh
110 HSE ₹101.04 Lakh
110 X-Dynamic HSE ₹104.24 Lakh
110 X ₹108.19 Lakh
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

ఈ కొత్త 2021 మోడల్ ల్యాండర్ రోవర్ డిఫెండర్ డీజిల్ వెర్షన్లలో 3.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 300 పిఎస్ పవర్‌ను 1,500-2,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 650 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

అన్ని డీజిల్ వెర్షన్లు కూడా ఒకే గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తాయి. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి విడుదలయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఈ కార్లు ల్యాండ్ రోవర్ యొక్క సిగ్నేచర్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 కేవలం 6.7 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. అలాగే, డిఫెండర్ 110 కేవలం 7 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. ఈ రెండు వేరియంట్ల గరిష్ట వేగాన్ని గంటకు 191 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

డీజిల్ ఇంజన్లతో నడిచే డిఫెండర్ మోడళ్లు, పెట్రోల్ మోడళ్ల మాదిరిగానే టెర్రైన్ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటాయి. పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే, డీజిల్ మోడళ్ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అయితే, వీటి (డీజిల్ వెర్షన్ల) మైలేజ్ కూడా అధికంగానే ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారులో కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఆటోమేటిక్ ఎల్‌ఇడి హెడ్‌లైట్లు, ఎల్‌ఇడి టెయిల్ లైట్స్, హీటెడ్ మరియు ఆటో-ఫోల్డ్ ఫంక్షన్‌తో కూడిన పవర్-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైనవి ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

అంతేకాకుండా, ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3 ఇంచ్ ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెడ్-అప్ డిస్ప్లే మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో డీజిల్ వేరియంట్స్ విడుదల

సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, 3డి సరౌండ్ కెమెరా సిస్టమ్, వాటర్ వాడింగ్ సెన్సార్లు (నీటి లోతు కోసం), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ లాంచ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు రోల్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
New Diesel Variants Launched In Land Rover Defender: Price, Specs, Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X