భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

దక్షిణ కొరియా కార్ దిగ్గజం కియా మోటార్స్ కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇంత ప్రజాదరణ పొందటానికి ప్రధాన కారణం కంపెనీ మార్కెట్లో విడుదల చేసిన అత్యుత్తమ మోడల్స్. కంపెనీ ఇప్పటికి కూడా తన ఉనికిని మరింత విస్తరించుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు కంపెనీ కియా సెల్టోస్ మరియు సొనెట్ యొక్క కొత్త ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. వీటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

మార్కెట్లో విడుదలైన కియా సెల్టోస్ మరియు సొనెట్ యొక్క కొత్త ఎడిషన్ మోడల్స్ ధరలు వరుసగా రూ. 9.95 లక్షలు మరియు రూ. 6.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త మోడల్స్ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ యొక్క సెల్టోస్ కొత్త ప్రీమియం వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

కొత్త అప్డేట్స్ తో విడుదలైన ఈ వేరియంట్లలో పాడిల్ షిఫ్టర్‌లు జోడించబడి ఉంటాయి. ఈ పాడిల్ షిఫ్టర్ కారు స్టీరింగ్ వెనుక అమర్చబడి ఉంటాయి. ఇది గేర్ లివర్ వలె పనిచేస్తుంది, కావున వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండి డ్రైవింగ్ ని మరింత సులభతరం చేస్తుంది.

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

ఇప్పుడు ఈ పాడిల్ షిఫ్టర్ ఉపయోగించి స్టీరింగ్ నుండి చేతిని తొలగించకుండా గేర్ మార్చవచ్చు. పాడిల్ షిఫ్టర్లు కొత్త సెల్టోస్ జిటిఎక్స్ ప్లస్ 1.5 డి 6ఏటి మరియు 1.4 టి-జిడిఐ 7 డిసిటి వేరియంట్లలో మరియు సొనెట్ యొక్క అన్ని ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తాయి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

కియా సెల్టోస్ యొక్క 1.5-లీటర్ పెట్రోల్ హెచ్‌టికె ట్రిమ్ ఇప్పుడు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి) తో లభిస్తుంది. అంతే కాకుండా దీనిని సెల్టోస్ ఇప్పుడు కొత్త ప్రీమియం వేరియంట్ 1.4 టి-జిడిఐ పెట్రోల్ జిటిఎక్స్ (ఓ) లో కూడా ప్రవేశపెట్టబడింది. కొత్త సోనెట్ యొక్క హెచ్‌టిఎక్స్ ట్రిమ్‌లో 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్‌లో 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ మరియు 1.5 డీజిల్ ఇంజన్‌లో 6 ఎటి గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

సెల్టోస్ మరియు సొనెట్ యొక్క కొత్త ఎడిషన్‌లో ఉన్న పాడిల్ షిఫ్టర్ చాలా స్పెషల్ ఫీచర్ అని కంపెనీ పేర్కొంది. ఎందుకంటే ఈ ఫీచర్ డ్రైవర్‌కు ఎటువంటి సమస్యలు లేకుండా గేర్‌లను మార్చడానికి సహాయపడుతుంది.

MOST READ:పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

కొత్త సెల్టోస్ ఐఎమ్‌టి వేరియంట్‌కు ఇప్పుడు కొత్త ఇంటీరియర్ లభిస్తుంది. ఈ వేరియంట్ లోపలి భాగంలో సీడ్ అండ్ బ్లాక్ కలర్ లో సబ్ హోల్స్టర్ కలిగి ఉన్నాయి. వీటి వల్ల లోపలి భాగం చాలా అధునాతమ్గా కనిపించడమే కాకుండా చాలా అవిలాసవంతమైన అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఇప్పడు ఈ అన్ని వేరియంట్లలో ఫుల్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్ ఇవ్వబడింది.

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

సెల్టోస్ లోయర్ ట్రిమ్‌కు కియా అనేక కొత్త ఫీచర్లను జోడించింది. ఇందులో వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సిస్టమ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్రీమియం సీడ్ ఫాబ్రిక్ సీట్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ వంటివి ఉంటాయి.

MOST READ:హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్[వీడియో]

భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్; ధర & వివరాలు

ఈ కొత్త వేరియంట్లలో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ కంట్రోల్ వంటివి సెల్టోస్ హెచ్‌టికె ట్రిమ్‌లో స్టాండర్డ్ గా లభిస్తాయి. అంతే కాకుండా ఇప్పుడు సన్‌రూఫ్ మరియు డ్రైవర్ విండోను ఇప్పుడు ఓపెన్ చేయడానికి మరియు క్లోస్ చేయడానికి వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌ ఉంది. కావున వీటిని వాయిస్ కంట్రోల్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు.

Most Read Articles

English summary
2021 Kia Seltos And Sonet Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X