ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

ఫోర్డ్ ఇండియా 2021 ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మునుపటికంటే సూక్ష్మమైన మార్పులు మరియు కొన్ని కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది. కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర రూ. 7.99 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ) తో ప్రారంభమవుతుంది. ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే రూ. 35,000 తక్కువగా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఐదు వేరియంట్లలో అందించబడుతుంది. అప్ యాంబియంట్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్ మరియు స్పోర్ట్స్. అన్ని వేరియంట్‌లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ (టిటానియం ప్లస్ కాకుండా) రెండింటినీ అందిస్తున్నారు. ఇందులో టాప్-స్పెక్ ట్రిమ్ ధర 11.49 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ).

ఎకోస్పోర్ట్ పెట్రోల్ ప్రైస్ డీజిల్ ప్రైస్
యాంబియంట్ ఎంటి ₹7,99,000 ₹8,69,000
ట్రెండ్ ఎంటి ₹8,64,000 ₹9,14,000
టైటానియం ఎంటి ₹9,79,000 ₹9,99,000

టైటానియం ప్లస్ ఎంటి

₹11,19,000 -
స్పోర్ట్స్ ఎంటి ₹10,99,000 ₹11,49,000
ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లోని ఇతర మార్పుల విషయానికి వస్తే ఇందులో ఉన్న ‘టైటానియం' ట్రిమ్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను చేర్చడం. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ గతంలో టాప్-స్పెక్ స్పోర్ట్స్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కూడా ఫోర్డ్‌పాస్ కనెక్ట్ చేసిన కార్ టెక్‌తో వస్తుంది.

MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

కొత్త టెక్ కస్టమర్లు తమ ఎస్‌యూవీని తమ స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేయడానికి మరియు రిమోట్‌గా అనేక ఫీచర్‌లను ఆపరేట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. ఇది స్టార్ట్, స్టాప్, లాక్ & అన్‌లాక్ మరియు ఏసీ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఫోర్డ్‌పాస్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

ఈ కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో ఈ మార్పులు కాకుండా చూడటానికి మునుపటి మోడల్ లాగానే ఉంటుంది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ మునుపటి మోడల్ లోని చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో SYNC3 టెక్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి వంటివి ఉన్నాయి.

MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

కొత్త 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కూడా అదే 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ అప్సన్ కల్గి ఉంటుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 123 బిహెచ్‌పి మరియు 150 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి మరియు 215 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. పెట్రోల్ ఇంజిన్ అప్సనల్ 6 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు అందించబడుతుంది.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 బుకింగ్స్ హవా.. ఇప్పటికీ తగ్గని జోరు

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ; ధర & వివరాలు

కొత్త 2021 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి 300, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సూక్ష్మ నవీనీకరణలను పొందటమే కాకుండా, కొన్ని అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
2021 Ford EcoSport Compact-SUV Launched In India. Read in Telugu.
Story first published: Monday, January 4, 2021, 16:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X