Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

జపనీస్ వాహన తయారీ సంస్థ Mitsubishi (మిత్సుబిషి) తన కొత్త జనరేషన్ అవుట్‌ల్యాండర్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ యొక్క కొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌ని గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ కొత్త Mitsubishi Outlander PHEV (మిత్సుబిషి అవుట్‌లాండర్ పిహెచ్ఈవి) వర్చువల్ ప్రీమియర్ ద్వారా ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

కంపెనీ ఈ కొత్త Mitsubishi Outlander PHEV ను డిసెంబర్ మధ్య నాటికి జపాన్‌లో అమ్మకాలను ప్రారంభించనుంది. ఈ కొత్త మోడల్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది దాని కొత్త డిజైన్ కాన్సెప్ట్ కింద, కొత్త తరం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేసింది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

కంపెనీ యొక్క ఈ కొత్త కారు చాలా స్టైలిష్ గా మరియు చాలా దూకుడుగా ఉంటుంది. దీనికోసం ఈ కారు యొక్క ఫ్రంట్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ SUV ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్ ఫ్లేర్‌లతో 20 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఇవి మంచి పనితీరుని అందిస్తాయి. అంతే కాకుండా వెనుకవైపు కారు యొక్క రెండు అంచుల వరకు విస్తరించిన క్షితిజ సమాంతర టెయిల్‌లైట్‌లు ఉంటాయి.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

ఈ కొత్త కారులో కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ అమర్చబడి ఉంటుంది. రేజర్-సన్నని LED లు DRL మరియు టర్న్ సిగ్నల్స్ పైన ఉంచబడ్డాయి. కానీ 3-జోన్ లైటింగ్ ఎలిమెంట్‌తో హెడ్‌ల్యాంప్ బంపర్‌పై తక్కువగా ఉంచబడింది. దిగువ హెడ్‌ల్యాంప్ యూనిట్‌లో LED ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి హై బీమ్ మరియు లో బీమ్ కోసం కోసం ఉపయోపడతాయి. మొత్తానికి ఇది బయటి వైపు ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

ఈ కొత్త మిత్సుబిషి అవుట్‌లాండర్ PHEV SUV మోడల్ లోపలి భాగంలో కూడా ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఈ SUV యొక్క క్యాబిన్‌లో స్కాలాప్యాటెడ్ ఇన్ ట్రూమెంట్ ఉంది, ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు కారు స్థానాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. సెంటర్ కన్సోల్ కొత్త డిజైన్‌తో సమకాలీకరించడానికి గణనీయమైన మార్పులను పొందింది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

ఈ కారు లోపలి భాగంలో డ్రైవర్లు సులభంగా చూడగలిగేలా మానిటర్లు మరియు గేజ్‌లు రూపొందించబడ్డాయి. వినియోగదారులకు మంచి పట్టును అందించడానికి మరియు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి సెలెక్టర్లు, డయల్స్ మరియు స్విచ్‌లు రూపొందించబడినట్లు కంపెనీ తెలిపింది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

మిత్సుబిషి కంపెనీ ఈ కొత్త మోడల్ కారుని 10 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో డైమండ్ కలర్ సిరీస్ కూడా ఉంటుంది. దీనితో పాటు ఇది రెడ్ డైమండ్, వైట్ డైమండ్ మరియు కొత్త బ్లాక్ డైమండ్ వంటి కలర్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

కంపెనీ ఇప్పుడు ఈ కొత్త అవుట్‌లాండర్ PHEV SUV యొక్క స్పెసిఫికేషన్ల గురించి వెల్లడించలేదు. అయితే న్యూ జనరేషన్ మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో పూర్తిగా అభివృద్ధి చెందిన కొత్త తరం PHEV సిస్టం ఉంది. కావున మెరుగైన పనితీరు మరియు అధిక డ్రైవింగ్ పరిధిని అందించే ఒక శక్తివంతమైన మోడల్ గా ఉంటుంది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

అవుట్‌ల్యాండర్ PHEV 2013 లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. బ్రాండ్ దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV అని పిలుస్తుంది. ఇది ట్విన్ మోటార్ 4WD సిస్టమ్ మరియు 100V AC ఎలక్ట్రిక్ సప్లైతో కూడిన అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. ఇది 1,500W వరకు శక్తిని అందించగలదు. ఈ SUV యొక్క బ్యాటరీ ఛార్జ్ మోడ్ కారు స్థిరంగా లేదా నడుస్తున్నప్పుడు ఇంజిన్ నుండి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.

Mitsubishi Outlander PHEV ఇప్పుడు మరింత సూపర్ లుక్.. ఫీచర్స్ అదుర్స్

అవుట్‌ల్యాండర్ PHEV విడుదలైనప్పటి నుండి 60 కి పైగా దేశాలలో విక్రయించబడిందని కంపెనీ తెలిపింది. కొత్త తరం అవుట్‌ల్యాండర్ PHEV యొక్క సాంకేతికలకు సంబందించిన సమాచారాన్ని కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ SUV డైనమిక్ షీల్డ్ స్టైలింగ్‌ని కలిగి ఉంది. ఈ SUV ఎంగెల్‌బర్గ్ టూరర్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందింది. ఈ కొత్త మిత్సుబిషి అవుట్‌లాండర్ PHEV SUV కంపెనీ యొక్క స్వదేశమైన జపాన్‌లో లాంచ్ చేయబడుతుంది. అయితే ఈ SUV భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియదు.

Most Read Articles

English summary
New gen mitsubishi outlander phev design features global debut details
Story first published: Saturday, October 16, 2021, 13:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X