Just In
- 12 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 20 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
Don't Miss
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2021 స్కొడా ఫాబియా టీజర్ లాంచ్; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!?
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా, తమ కొత్త తరం ఫాబియా హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కొత్త 2021 ఫాబియా టీజర్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. త్వరలోనే ఇది గ్లోబల్ మార్కెట్లలో విడుదల కానుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్కొడా ఆటో ఈ ప్రీమియం బ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో స్విఫ్ట్, బాలెనో, గ్లాంజా, హోండా జాజ్ వంటి మోడళ్లకు పోటీగా ఇక్కడి మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

భారత కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని ధీటుగా ఎదుర్కునేందుకు స్కొడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ఇరు కంపెనీలు తమ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా, భారత్ కోసం కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

దేశీయ మార్కెట్లో మొదటి తరం స్కొడా ఫాబియా హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా 2008లో విడుదల చేశారు. ఆరంభంలో ఇది స్కొడా బ్రాండ్‌కు అమ్మకాల పరంగా మంచి విజయాలను తెచ్చిపెట్టింది. అయితే, ఇటీవలి కాలంలో భారత స్మాల్ కార్ మార్కెట్లో పెరిగిన పోటీని తట్టుకోవటంలో ఫాబియా విఫలమై మార్కెట్ నుండి కనుమరుగైపోయింది.

తాజాగా స్కొడా ఆటో విడుదల చేసిన ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ ఫాబియా చిత్రాలను బట్టి చూస్తే, కంపెనీ ప్రస్తుత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త తరం మోడల్‌ను డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇది నాల్గవ తరానికి చెందిన స్కొడా ఫాబియా.

స్కొడా త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న కుషాక్ ఎస్‌యూవీని తయారు చేస్తున్న ఎమ్‌క్యూబి-ఏ0 ఆర్కిటెక్చర్ ఆధారంగానే ఈ కొత్త తరం స్కొడా ఫాబియాను కూడా తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని స్కొడా ఆటో భారత మార్కెట్ కోసం అనేక ఉత్పత్తులను ప్లాన్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో, కొత్త తరం స్కొడా ఫాబియా హ్యాచ్‌బ్యాక్ కూడా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఉత్పత్తిని భారత్‌లోనే స్థానికంగా లభ్యమయ్యే భాగాలతో అసెంబుల్ చేయగలిగినట్లయితే, కంపెనీ దీనిని సరసమైన ధరకే అందించే అవకాశం ఉంటుంది.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 స్కొడా ఫాబియా 1.0-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 96 బిహెచ్‌పి లేదా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

ఈ అధునాతన ఇంజన్లు చాలా తక్కువ కర్భన ఉద్గారాలను విడుదల చేస్తూ, ఎక్కువ మైలేజీని అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

కొత్త తరం స్కొడా ఫాబియా యువతరాన్ని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్లో విడుదలైనట్లయితే, మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా అల్ట్రాజో మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.