స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ విఫణిలో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన Hyundai (హ్యుందాయ్) దేశీయ మార్కెట్లో ఒక ఆధునిక మోడల్ విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. Hyundai కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త మోడల్ పేరు Hyundai Tucson (హ్యుందాయ్ టక్సన్).

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న ఈ కొత్త తరం మోడల్ ఇటీవల భారతీయ మార్కెట్లో మొదటిసారిగా టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. ఈ కొత్త హ్యుందాయ్ టక్సన్ 2020 సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడింది. అయితే ఈ కొత్త మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, కానీ కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా ప్రకటించలేదు. త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

కొత్త Hyundai Tucson టెస్టింగ్ సమయంలో ఈ SUV పూర్తిగా కవర్ చేయబడి ఉండటం మీరు చూడవచ్చు. అయినప్పటికీ ఇది కొత్త తరం హ్యుందాయ్ టక్సన్ అని మీరు గుర్తించవచ్చు. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండనుంది, దీనికోసం ఇది ఆధునిక పరికరాలను పొందుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

కొత్త Hyundai Tucson కొత్త మోడల్ వర్టికల్ డిఆర్ఎల్ మరియు స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో పాటు ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్‌ను కలిగి ఉంది. క్రెటా యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇలాంటి గ్రిల్ కనిపిస్తుంది. మొత్తానికి ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

కొత్త Hyundai Tucson దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంచెం పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ మీరు గమనించవచ్చు, ఇది వాహనానికి మరింత దూకుడు రూపాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో ORVMలు మరియు రూప్ రైల్స్ వంటివి కూడా పొందుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

కొత్త Hyundai Tucson మోడల్ లోని ఇంటీరియర్ గురించి అధికారిక సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది కూడా త్వరలో వెల్లడవుతుందని భావిస్తున్నాము. అయినప్పటికి ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ మరియు బోస్ సౌండ్ సిస్టమ్ వంటివి పొందుతుందని భావిస్తున్నాము.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, రెండవ వరుస సీట్ రిక్లైన్ ఫంక్షన్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

Hyundai Tucson ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పోర్ట్ మానిటర్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్ట్‌లు అందించబడతాయి. ఇవన్నీ కూడా ప్రయాణికుల భద్రతను నిర్ధరిస్తాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకుండా, ఇందులో వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ షిఫ్ట్ లాక్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, అడ్వాన్స్‌డ్ ట్రాక్షన్ కార్నరింగ్ కంట్రోల్ మరియు ఇంజన్ మొబిలైజర్‌ వంటి వాటిని పొందుతుంది. అయితే రానున్న ఈ కొత్త మోడల్ ఎన్ని ఇంజన్ ఆప్షన్‌లతో తీసుకురానున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఈ మోడల్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంది. అయితే దేశీయ మార్కెట్లో ఉన్న ఈ మోడల్ 48వి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 2.5 లీటర్ ఇంజన్, 2 లీటర్ ఇంజన్ మరియు 1.6 లీటర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది రెండు ట్యూన్‌లలో తీసుకురాబడుతుంది, ఇందులో 150 బిహెచ్‌పి / 180 బిహెచ్‌పి ఉంటుంది. అలాగే, 1.6-లీటర్ ఇంజన్ రెండు-ట్యూన్డ్ 115 బిహెచ్‌పి /136 బిహెచ్‌పి, అప్సనల్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ మరియు 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికతో అందించబడుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

దీనితో పాటు, 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో హైబ్రిడ్ మరియు మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ ఎంపిక ఇవ్వబడుతుంది. ఈ SUVలో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం ఇది రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది, మొదటిది 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ వివిటి పెట్రోల్ ఇంజన్, అయితే డీజిల్ ఇంజన్ 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ ఇంజన్. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉన్నాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

హ్యుందాయ్ టక్సన్ యొక్క కొత్త తరం మోడల్‌ను వచ్చే ఏడాది మధ్య నాటికి భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ దాని పాత మోడల్‌ కంటే కూడా ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం లాంచ్ సమయంలో వెల్లడవుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Hyundai కొత్త మోడల్ Tucson: లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Hyundai Tucson (హ్యుందాయ్ టక్సన్) మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ మరియు టాటా హారియర్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ టక్సన్ యొక్క మోడల్ అంత విజయవంతం కాలేదు. అయితే కొత్త తరం మోడల్‌తో కంపెనీ యొక్క అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఈ మోడల్ కంపెనీ యొక్క పురోగతికి ఎంతవరకు తోడ్పడుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
New hyundai tucson spied testing design engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X