వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'స్విఫ్ట్'లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మారుతి సుజుకి తమ కొత్త 2021 మోడల్ స్విఫ్ట్ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ కొత్త మోడల్‌ను కంపెనీ లిస్ట్ చేసింది. కంపెనీ టీజ్ చేసిన వివరాల ప్రకారం, కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇందులో సరికొత్త అప్‌గ్రేడెడ్ ఇంజన్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టనుంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

ఐడిల్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీతో కూడిన నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ ఇంజన్‌ను ఈ కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ వలన ఇంజన్ నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సమయం ఐడిల్‌గా రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది మరియు తిరిగి క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది.

MOST READ:ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ విడుదల చేసిన నితిన్ గడ్కరీ, ఏం చెప్పారో తెలుసా..!

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

ఈ కొత్త ఐడిల్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీతో ఇంధన సామర్థ్యం (మైలేజ్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉండనున్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇది భారత్‌లో కూడా విడుదల కానుంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

ప్రస్తుత మారుతి సుజుకి విక్రయిస్తోన్న స్విఫ్ట్ మోడల్ మూడవ తరానికి చెందినది. గత 2017లో ఈ కారును పూర్తిగా రీడిజైన్ చేశారు. కాగా, ఇప్పుడు ఇందులో కొత్తగా వస్తున్న ఫేస్‌లిఫ్ట్ దాని ప్రస్తుత తరం మోడల్‌లో తుది ప్రధాన అప్‌గ్రేడ్ కావచ్చు. ఈసారి భవిష్యత్తులో మారుతి సుజుకి నుండి రాబోయే స్విఫ్ట్ పూర్తిగా కొత్త తరానికి చెందినదిగా ఉండే అవకాశం ఉంది.

MOST READ:2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ హెడ్‌ల్యాంప్స్, హనీకోంబ్ మెష్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ఆశించవచ్చు. అలాగే, ఇది డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో వస్తుందని అంచనా. టాప్-ఎండ్ వేరియంట్లలో రూఫ్‌ని బ్లాక్ కలర్‌లో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

ఇకపోతే, ఇంటీరియర్స్‌లో చేయబోయే మార్పులు మాత్రం చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి డిజైన్ ఇంప్రూవ్‌మెంట్స్ మినహా ఓవరాల్ డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ ప్రస్తుత మోడల్ మారిగానే ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీని సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియోని సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు లభించవచ్చని అంచనా.

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

అయితే, కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో ప్రధానమైన మార్పు దాని ఇంజన్ రూపంలో ఉండనుంది. స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 1.2-లీటర్ కె12 ఎన్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..

వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన 2021 మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; త్వరలో విడుదల

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించనుంది. ఇదే ఇంజన్‌ను డిజైర్ కాంపాక్ట్ సెడాన్ మరియు బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో కూడా ఉపయోగిస్తున్నారు. కొత్త 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ ఈ విభాగంలో ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు టాటా టియాగో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New 2021 Maruti Suzuki Swift Facelift Listed On Company Website; India Launch Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X