సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమయం స్మాల్ కార్ బ్రాండ్ మినీ తమ 5-డోర్ వెర్షన్ కూపర్ మోడల్‌లో ఓ కొత్త 2021 వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ మినీ కూపర్ ఇప్పుడు సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంది.

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

కొతత్ 2020 మినీ కూపర్ ఫేస్‌లిఫ్ట్ 5-డోర్ వెర్షన్ మార్చ్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ముందుగా ఈ కారు యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. మినీ కూపర్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్‌ను అలాగే ఉంచుతూనే, దాని ఫ్రంట్ డిజైన్‌లో మాత్రం కంపెనీ కొన్ని కీలకమైన డిజైన్ మార్పుల చేసింది.

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

మినీ 3-డోర్ వెర్షన్‌తో పోలిస్తే, ఈ 5-డోర్ వెర్షన్ మినీ కారు 72 మిమీ ఎక్కువ పొడవును మరియు 160 మిమీ అధిక వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. స్టైలింగ్ పరంగా చూస్తే, దీని ముందు భాగంలో హెక్సాగనల్ రేడియేటర్ గ్రిల్ మరియు గుండ్రటి హెడ్‌లైట్‌లతో ఇది ‘ఫ్రెంచ్-గడ్డం' స్టైల్‌ను ప్రతిభింభించేలా ఉంటుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్‌మొబైల్; వివరాలు

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

ఫ్రంట్ హెడ్‌లైట్స్ స్టాండర్డ్ మినీ హైడ్‌లైట్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే, వెనుక భాగంలోని టెయిల్ ల్యాంప్స్‌ను మాత్రం యూనియన్ జాక్ డిజైన్‌లో తయారు చేశారు. ఈ కారులోని అన్ని లైట్లు ఎల్‌ఈడిల రూపంలోనే ఉంటాయి. ఫ్రంట్ బంపర్‌లో ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో పెద్ద స్క్వేర్డ్-ఆఫ్ ఎయిర్ ఇన్‌టేక్స్‌ను గమనించవచ్చు.

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

పియానో ​​బ్లాక్ ఎక్స్టీరియర్ ఆప్షన్‌తో పాటుగా, ఇందులో మల్టీటోన్ రూఫ్ ఎక్స్టీరియర్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా ఈ కలర్స్‌ను మార్చుకునే అవకాశాన్ని కూడా కంపెనీ కలిపిస్తోంది. అంటే కస్టమర్లు తమకు నచ్చిన రూఫ్ కలర్‌ని, తమకు నచ్చిన బాడీ కలర్‌తో జతచేసుకునే వెసలుబాటు ఉంటుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

ఇక ఇందులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, లోపలి భాగంలో అధునాతన కాక్‌పిట్ డిజైన్ లేఅవుట్ కనిపిస్తుంది. ఇందులో కొత్తగా 8.8-అంగుళాల టచ్ డిస్ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనిని డ్యాష్‌బోర్డ్ మధ్య భాగంలో గుండ్రటి ప్యానెల్‌లో అమర్చబడి ఉంటుంది.

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

కారులోని సెంటర్ ఎయిర్ వెంట్స్‌ను ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌కి ఇరువైపులా డ్యాష్‌బోర్డ్ ఉపరితలాలతో ఫ్లష్ అయ్యేలా డిజైన్ చేశారు. డ్రైవర్ వైపు ఆప్షనల్ మల్టీఫంక్షనల్ ఇన్స్ట్రుమెంట్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంటుంది. ఇంకా ఇందులో ప్రీమియం లెథర్‌తో చుట్టబడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఫినిష్డ్ గేర్ లివర్ వంటి మార్పులు కూడా ఉన్నాయి.

MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

ఈ 5-డోర్ వెర్షన్ మినీ కూపర్‌లో పొడగించిన కొలతల కారణంగా, రెండవ వరుసలో మరింత ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఫలితంగా లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్‌ కూడా పెరుగుతుంది. ఇందులోని వెనుక సీట్లు 60:40 స్ప్లిట్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ కారులో బూట్ స్పేస్ 278 లీటర్లుగా ఉంటుంది, వెనుక వరుసలోని సీట్లను మడచడం ద్వారా బూట్‌స్పేస్‌ను 941 లీటర్లకు పెంచుకోవచ్చు.

సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కొత్త 2021 మినీ కూపర్ 5-డోర్ వేరియంట్

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, మార్చి 2021 నుండి ఈ కొత్త 5-డోర్ వెర్షన్ మినీ కూపర్ ముందుగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాతి దశలో ఆసియా మార్కెట్లకు వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి ఈ మోడల్ భారత ఎంట్రీ గురించి ఎలాంటి సమాచారం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు సూపర్ లుక్, సూపర్ ఫీచర్స్

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
New 2021 Mini Cooper 5-Door Hatchback Gets New Design And Additional Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X