Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 6 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
RCB vs RR: ప్రతీకారం తీర్చుకున్న దూబే.. మెరిసిన తేవాతియా! బెంగళూరు లక్ష్యం 178!
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- News
Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో విడుదలైన కొత్త మినీ కంట్రీమాన్ ; ధర & పూర్తి వివరాలు
మినీ కొత్త కంట్రీమాన్ భారత మార్కెట్లో ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త మినీ కంట్రీమ్యాన్ ప్రారంభ ధర రూ. 39.50 లక్షలతో (ఎక్స్-షోరూమ్,ఇండియా) అందించబడుతుంది. ఇప్పుడు దేశీయ మార్కెట్లో కొత్త మినీ కంట్రీమాన్ బుకింగ్‌లు మరియు టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభమయ్యింది. భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి.

మినీ తన కొత్త కంట్రీమాన్ స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ ని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి కంట్రీమాన్ కూపర్ ఎస్ మరియు కంట్రీమాన్ కూపర్ ఎస్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్. రేంజ్-టాపింగ్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ మోడల్ ధర రూ. 43.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

మినీ తన కొత్త కంట్రీమాన్ స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ ని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి కంట్రీమాన్ కూపర్ ఎస్ మరియు కంట్రీమాన్ కూపర్ ఎస్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్. రేంజ్-టాపింగ్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ మోడల్ ధర రూ. 43.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

కంట్రీమాన్ కూపర్ ఎస్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు కంట్రీమాన్ కూపర్ ఎస్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ లో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కూపర్ ఎస్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ వేరియంట్ లో ఉన్న 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా రన్-ఫ్లాట్ టైర్లను మరియు అడిషినల్ ఏరోడైనమిక్స్ కిట్‌ను స్టాండర్డ్ గా పొందుతాయి.

మినీ కంట్రీమాన్ కూపర్ ఎస్ లోపల కార్బన్ బ్లాక్ లెథరెట్ అపోల్స్ట్రే ఉంటుంది. అయితే రేంజ్-టాపింగ్ జేసీడబ్ల్యు ఇన్స్పైర్డ్ ట్రిమ్ ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే తో పాటు సిల్వర్ ట్రిమ్ ని కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో క్రూయిజ్ కంట్రోల్, లేన్ చేంజ్ అలెర్ట్ వంటివి కూడా ఉన్నాయి.
MOST READ:సర్ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

మినీ కంట్రీమాన్ యొక్క రెండు వేరియంట్లు ఒకే 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఇది 189 బిహెచ్‌పి మరియు 280 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ వేరియంట్ కూడా పాడిల్ షిఫ్టర్లతో వస్తుంది.

మినీ కంట్రీమాన్ భారత మార్కెట్లో ప్రముఖ లగ్జరీ విభాగంలో ఒకటిగా ఉంది. కొత్త కంట్రీమాన్ అనేక కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల ఇది చాలా ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది. కొత్త మినీ కంట్రీమాన్ ఇప్పుడు వైట్ మరియు సేజ్ గ్రీన్ అనే రెండు కొత్త రంగు ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]