హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

రెనాల్ట్ ఇండియా ఇటీవల దేశీయ మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన రెనాల్ట్ కిగర్‌ను విడుదల చేసింది. ఈ రెనాల్ట్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా డీలర్‌షిప్‌లో 11,000 రూపాయల ముందస్తు మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క డెలివరీలు షురూ చేసింది.

హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

కంపెనీ డెలివరీ ప్రారంభమైంది, కావున ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏకంగా 100 రెనాల్ట్ కిగర్ యూనిట్ల మెగా డెలివరీ ప్రారంభమైంది. దీనికి సంబంధించి వీడియో పిపిఎస్ రెనాల్ట్ షో రూమ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇక్కడ ఒక్కసారిగా 100 యూనిట్లను డెలివరీ చేయడం చూడవచ్చు.

హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

రెనాల్ట్ కిగర్ డెలివరీలు మార్చి 3 నుండి దేశవ్యాప్తంగా కంపెనీ ప్రారంభించింది. రెనాల్ట్ కిగర్ ప్రస్తుతం దేశంలో చౌకైన కాంపాక్ట్ ఎస్‌యూవీ, అంతే కాకుండా ఇది గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఎస్‌యూవీ లాంచ్ అయినప్పటి నుంచి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది.

MOST READ: అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్లు మరియు నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. రెనాల్ట్ కిగర్ తన విభాగంలో కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. రెనాల్ట్ కిగర్ యొక్క ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ. 5.45 లక్షలు.

హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

రెనాల్ట్ కిగర్ యొక్క టాప్ వేరియంట్ ధరను రూ. 9.55 లక్షల వరకు ఉంది. రెనాల్ట్ కిగర్ కలిగి ఉన్న తక్కువ ధర వాళ్ళ ఎక్కువమంది వినియోగదారులు ఆకర్షించబడుతున్నారు. ఈ కారణంగా దేశీయ ,మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని సిఎమ్‌ఎఫ్-ఎ + ప్లాట్‌ఫాంపై నిర్మించారు.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

రెనాల్ట్ కిగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 72 బిహెచ్‌పి మరియు 100. బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తాయి. దీనికి 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఎఎమ్‌టి మరియు సివిటి గేర్‌బాక్స్ ఎంపిక ఉంది.

రెనాల్ట్ కిగర్ RXZ వేరియంట్ లో డ్రైవ్ మోడ్, నార్మల్, ఎకో మరియు స్పోర్ట్ యొక్క ఎంపికను కూడా అందిస్తుంది. కావున వాహనదారుడు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు. రెనాల్ట్ కిగర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, సి షేప్ ఎల్‌ఇడి టైల్ లైట్, టర్న్ ఇండికేటర్ ఆన్ ఓఆర్‌విఎం, బ్లాక్ ఓఆర్‌విఎం, రియర్ స్పాయిలర్, సాటిన్ సిల్వర్ రూఫ్ రైల్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

హైదరాబాద్‌లో 'రెనాల్ట్ కిగర్' మెగా డెలివరీ : వివరాలు

రెనాల్ట్ కిగర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు ఎసి వెంట్స్ కొద్దిగా లైట్ గ్రే కలర్ ఉంటాయి. ఇది 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కల్గి ఉంటుంది.

Image Courtesy: PPS Renault

Most Read Articles

English summary
Renault Kiger 100 Units Delivery In Hyderabad. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X