Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్‌ప్రైజ్.. టాటా సఫారీ స్టోర్మ్ తిరిగి మార్కెట్లోకి రానుందా? - స్పై పిక్స్
టాటా మోటార్స్ విక్రయించిన ఐకానిక్ సఫారీ బ్రాండ్ పేరును, హారియర్ ఎస్‌యూవీ ఆధారంగా కంపెనీ తయారు చేసిన కొత్త 7-సీటర్ వాహనానికి పెట్టిన సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ఇప్పుడు గతంలో టాటా మోటార్స్ నిలిపివేసిన 'సఫారీ స్టోర్మ్' బాక్స్ టైప్ ఎస్‌యూవీని తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా, టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. వెనుక వైపు 'ఆన్ టెస్ట్' అనే బోర్డుతో రెడ్ కలర్ యూపి స్టేట్ టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో టెస్టింగ్ చేస్తున్న ఓ వాహనాన్ని ఈ ఫొటోలో గమనించవచ్చు.

బిఎస్6 ఉద్ఘార నిబంధనల నేపథ్యంలో, టాటా మోటార్స్ గడచిన 2019లో తమ సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని మార్కెట్లో నిలిపివేసింది. అయితే, ఇప్పుడు భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ మరియు అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను తిరిగి మార్కెట్లో పునఃప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్ కంపెనీ (టెల్కో) ప్లాంట్ సమీపంలో కంపెనీ ఈ ఎస్‌యూవీని పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న కొత్త తరం 2021 టాటా సఫారీ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో లభిస్తుండగా, ఈ కొత్త సఫారీ స్టోర్మ్‌ను దానికి దిగువన విడుదల చేసే అవకాశం ఉంది.

టాటా గ్రూపుకి చెందిన టెల్కో, ప్రస్తుతం వివిధ రకాల టాటా కార్ల కోసం పవర్‌ట్రెయిన్‌లు మరియు డ్రైవ్‌ట్రెయిన్ భాగాల తయారీ కోసం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో, టెక్నో ప్లాంట్ చుట్టూ ఈ కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌ను టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, ఈ ఎస్‌యూవీలో సరికొత్త బిఎస్6 డీజిల్ ఇంజన్‌ను పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.
MOST READ:భారత్‌లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 2021 విడుదల : ధర & వివరాలు

ప్రస్తుతం టాటా సఫారీ స్టోర్మ్ సాధారణ కస్టమర్లకు అందుబాటులో లేకపోయినప్పటికీ, రక్షణ దళాల కోసం ఇందులో ఆర్మీ-స్పెక్ జిఎస్800 సఫారీ స్టోర్మ్ మోడల్‌ను కంపెనీ ఉత్పత్తి చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో టాటా మోటార్స్ పరీక్షిస్తోన్న ఈ కొత్త సఫారీ స్టోర్మ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ వెర్షనా లేక ఆర్మీ కోసం పరీక్షిస్తున్న సరికొత్త మోడలా అనేది తెలియాల్సి ఉంది.

ఈ కొత్త సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా పరీక్షిస్తోంది. ఒకవేళ ఈ సఫారీ స్టోర్మ్‌ను కేవలం ఆర్మీ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, సాధారణ కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లయితే, మార్కెట్లో దీని డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకునే అవకాశం ఉంది. నిజానికి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ మోడల్‌కి ఇప్పటికీ భలే గిరాకీ ఉంది.
MOST READ:రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలో కొత్త తరం మోడల్ డెవలప్‌మెంట్ గురించి టాటా మోటార్స్ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ విషయం అటుంచి, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన సరికొత్త 2021 టాటా సఫారీ విషయానికి వస్తే, దీనిని ల్యాండ్ రోవర్ యొక్క ఒమేగా ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు.

ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయిస్తున్న హారియర్ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొంది దీనిని డిజైన్ చేశారు. ఈ ఎస్‌యూవీలో అనేక అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 6 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. హారియర్ మరియు సఫారీ డిజైన్లలో వ్యత్యాసాన్ని చూపేందుకు దీని ఫ్రంట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు.
MOST READ:ఫాస్ట్‌ట్యాగ్ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

ఇంజన్ విషానికి వస్తే, ఇందులో సరికొత్త బిఎస్6 కంప్లైట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
మూలం: ఇండియన్ఆటో