New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారతదేశంలో తమ లేటస్ట్ బిఎస్6 'ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్' (New Volkswagen Tiguan) ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో ఈ కొత్త కారు ధర రూ. 31.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది మరియు ఇది కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. తాజాగా, కొత్త టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ కి సంబంధించి కంపెనీ ఓ టెలివిజన్ కమర్షియల్ ను విడుదల చేసింది.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

ఫోక్స్‌వ్యాగన్ ఈ టెలివిజన్ కమర్షియల్ లో తమ కొత్త టిగువాన్ ఎస్‌యూవీ యొక్క డిజైన్ మరియు ఫీచర్ వివరాలను హైలైట్ చేసింది. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో వచ్చిన ఈ 5 సీటర్ ఎస్‌యూవీ అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను కలిగి ఉంటుంది. గతంలో ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో విక్రయించిన టిగువాన్ ఆల్-స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ, కంపెనీ ఈ కొత్త టిగువాన్ 5-సీటర్ మోడల్ ను ప్రవేశపెట్టింది. మునుపటి మోడల్ తో పోలిస్తే, ఇది మరింత మెరుగైన డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంది.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

భారతదేశంలో బిఎస్ 6 కాలుష్య ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత కంపెనీ తమ పాత వెర్షన్ టిగువాన్ ఎస్‌యూవీ అమ్మకాలను నిలిపివేసింది. ఇదివరకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా విక్రయించిన పాత తరం టిగువాన్ మోడల్ ను కంపెనీ విదేశాలలో తయారు చేసి, పూర్తిగా తయారైన మోడల్ భారతదేశానికి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో (ఇంపోర్టెడ్ మోడల్‌గా) విక్రయించేంది. అయితే, ఇప్పుడు ఈ కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కంపెనీ ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ చేస్తోంది.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

ఈ కొత్త ఎస్‌యూవీని స్థానికంగా అసెంబుల్ చేస్తున్న కారణంగా, దీని ధర కూడా మునుపటి కన్నా తక్కువగా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన ఈ టెలివిజన్ ప్రకటనలో కొత్త టిగువాన్ ఎస్‌యూవీ నగర రోడ్లపై తిరుగుతున్నప్పుడు దానిలోని అనేక డిజైన్ ఎలిమెంట్స్ ని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానమైనది ఫోక్స్‌వ్యాగన్ ఇంటెలిజెంట్ టెక్నాలజీతో కూడిన ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు. ఇవి ఈ విభాగంలోనే అత్యుత్తమమైన మరియు ప్రకాశవంతమైన హెడ్‌ల్యాంప్‌లలో ఒకటిగా ఉంటాయి.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

సాధారణ ఎల్ఈడి హెడ్‌లైట్లు అందించే కాంతితో పోల్చుకుంటే, ఈ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు చాలా మెరుగ్గా ఉండి, ఎక్కువ కాంతిని అందిస్తాయి. పాత మోడల్ తో పోల్చుకుంటే కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ప్రీమియం అప్పీల్ కోసం కంపెనీ ఇందులో చిన్నపాటి మార్పులు చేర్పులు చేసింది.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

ఇందులో ప్రధానంగా, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సన్నటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, అప్‌గ్రేడ్ చేసిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన ఫ్రంట్ మరియు రీడిజైన్ చేసిన రియర్ బంపర్‌, స్టైలిష్ 18 ఇంచ్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, టెయిల్ ల్యాంప్‌ల కోసం అప్‌గ్రేడ్ చేసిన ఎల్ఈడి ఇన్సర్ట్‌లు మరియు వెనుక భాగంలో బూట్ లిడ్ మధ్యలో ఉండే విశాలమైన 'టిగువాన్' బ్యాడ్జ్, హై-స్టాప్ మౌంట్ బ్రేక్ ల్యాంప్ తో కూడిన రియర్ స్పాయిలర్, షార్ప్ ఫిన్ యాంటెన్నా, స్ప్లిట్ టెయిల్ లైట్స్, వెనుక బంపర్ దిగువ భాగంలో క్రోమ్ ఇన్సెర్ట్స్ వంటి పలు డిజైన్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఇంటీరియర్‌లలో కూడా కంపెనీ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పుడు ఈ కారులోని క్యాబిన్ వర్చ్యువల్ కాక్‌పిట్ అనుభూతిని అందిస్తుంది. మౌంటెడ్ కంట్రోల్స్ తో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డోర్లపై ప్రీమియం క్రోమ్ ఇన్సెర్ట్స్, తగినంత స్టోరేజ్ స్పేస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం టచ్-కంట్రోల్ ప్యానెల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వియన్నా లెదర్ సీట్లు, సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్, యాంబియెంట్ మూడ్ లైటింగ్ కోసం 30 రకాల కలర్ ఆప్షన్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

ఇంజన్ పరంగా చూస్తే, ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ లో కొత్త 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. కంపెనీ ఇదే ఇంజన్ ను తమ గ్రూప్ లోని ఇతర మోడళ్లయిన Tiguan Allspace, Skoda Octavia, Skoda Superb మరియు Audi Q2 వంటి ఇతర కార్లలో కూడా ఉపయోగిస్తోంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 190 బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

New Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ టెలివిజన్ కమర్షియల్ చూశారా..?

కొత్త 2022 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా అనేక ఇతర భద్రతా ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం, ఈ కారు కేవలం ఒక వేరియంట్‌లో లభిస్తుంది. కొత్త టిగువాన్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర రూ. 31.99 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఇది ఈ విభాగంలో జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New volkswagen tiguan facelift official tvc released lets find all the details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X