Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

స్వీడిష్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో (Volvo) భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్లలో వోల్వో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సి60 (Volvo XC60) పెట్రోల్ వెర్షన్ యొక్క మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ ను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనున్న తమ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

వోల్వో ఇండియా ఈ మేరకు తమ ట్విట్టర్ ఖాతాలో ఓ టీజర్ ను కూడా పోస్ట్ చేసింది. వోల్వో తమ ఎక్స్‌సి60 ఎస్‌యూవీ మోడల్ యొక్క కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుత ఆధునిక యుగానికి అనుగుణంగా కంపెనీ ఈ ఎస్‌యూవీని స్మార్ట్ కారుగా రూపొందించినట్లు కంపెనీ తమ టీజర్ లో తెలిపింది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

ఈ టీజర్ ను నిశితంగా పరిశీలిస్తే, కొత్త తరం వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీని కంపెనీ దాని మునుపటి వెర్షన్ కంటే పెద్ద సైజులో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడ్‌ను అందుకుంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్స్, 3డి మెటల్ లోగో, పూర్తి ఎల్‌ఈడి టెయిల్‌ల్యాంప్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు అధునాతన డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా కంపెనీ ఈ కారులో అత్యాధునిక సాంకేతిక ఫీచర్లను అందించనుంది. అలాగే, ఇందులోని లేటెస్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా మెరుగైన ఇంధన సామర్థ్యం (మైలేజ్) కూడా లభ్యం కానుంది. వోల్వో కార్లంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. కాబట్టి, ఈ కొత్త తరం వోల్వో ఎక్స్‌సి60 లో కూడా అనేక మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

తాజాగా వోల్వో ఇండియా ఆవిష్కరించిన కొత్త 2021 ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కంపెనీ ఇప్పటికే కొరియా మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఇందులో కొత్త స్మార్ట్ కార్ సిస్టమ్ ను ఓ కీలక ఫీచర్‌గా అందించబడింది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌ తో వోల్వో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇలా గూగుల్ తో డీల్ కుదుర్చుకున్న మొదటి కార్ మేకర్ వోల్వో కావటం విశేషం.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

ఈ ఒప్పందం ద్వారా, వోల్వో తమ వాహనాలలో గూగుల్ ప్రాసెసర్లు మరియు సేవలతో ఇంటిగ్రేట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఆపరేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తుంది. భారతదేశంలో విడుదల కానున్న కొత్త తరం వోల్వో ఎక్స్‌సి60 కూడా కృత్రిమ మేధస్సుతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో రానుంది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

ఈ టెక్నాలజీ సాయంతో వినియోగదారులు నావిగేషన్ మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్‌ తో సహా అనేక ఫీచర్‌ లను రిమోట్ గా యాక్సెస్ చేయవచ్చు మరియు వాటిని కంట్రోల్ చేయవచ్చు. వోల్వో పేర్కొన్న సమాచారం ప్రకారం, వాయిస్ కంట్రోల్డ్ టెక్స్ట్ మెసేజ్ లు, టర్న్ బై టర్న్ నావిగేషన్, మ్యూజిక్ ట్రాక్స్ కంట్రోల్ మరియు కారు లోపలి క్యాబిన్ యొక్క ఉష్ణోగ్రతను కూడా రిమోట్ గా కంట్రోల్ చేయవచ్చు. వచ్చే ఏడాది నుంచి ఈ టెక్నాలజీ ఇతర వోల్వో కార్లలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

వీటికి అదనంగా, కొత్త వోల్వో ఎక్స్‌సి60 లో అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫేస్‌లిఫ్ట్ వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ రోడ్డుపై వచ్చే పోయే ఇతర వాహనాలను గుర్తించడానికి, అలాగే ఆటోమేటిక్ బ్రేకింగ్ మరియు పైలట్ అసిస్టెన్స్ వంటి డ్రైవింగ్ అసిస్టెడ్ ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

కొత్త 2021 వోల్వో ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మొత్తం ఐదు విభిన్న ట్రిమ్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వీటిలో, మూడు పవర్‌ట్రెయిన్‌లు రెండు మైల్డ్ హైబ్రిడ్ మరియు ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లను కంపెనీ అందించనుంది. ఏదేమైనప్పటికీ, వోల్వో ఎక్స్‌సి60 కారులో ట్రెడిషనల్ 2.0 లీటర్ ఇన్‌లైన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ యధావిధిగా కొనసాగనుంది.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

కొత్త వోల్వో ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్ దాని బోనెట్ లోపల ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ కారులో 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ను ఉపయోగించనున్నారు. ఇది కారు యొక్క మైలేజ్ ను పెంచడంలో సహకరిస్తుందని భావిస్తున్నారు.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

ఈ కొత్త వోల్వో ఎస్‌యూవీలోని బి5 మరియు బి6 ట్రిమ్‌లలో రెండు తేలికపాటి హైబ్రిడ్ ఆప్షన్లు అందించబడ్డాయి మరియు దాని టి8 ట్రిమ్ లో మాత్రం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఛాయిస్ ఉంటుంది. కొత్త వోల్వో ఎక్స్‌సి60 యొక్క అన్ని ట్రిమ్ లు కూడా 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తోనే అందుబాటులో ఉంటాయి.

Volvo XC60 మైల్డ్-హైబ్రిడ్ టీజర్: త్వరలోనే భారత మార్కెట్లో విడుదల

కాగా, ఇందులోని ఎంట్రీ లెవల్ మోడల్ అయిన బి5 ట్రిమ్ స్టాండర్డ్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో వస్తుంది. అయితే, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ ఆప్షనల్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ను కూడా అందిస్తోంది. అలాగే, ఇందులోని అన్ని ఇతర వేరియంట్లు స్టాండర్డ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
New volvo xc60 mild hybrid petrol variant india launch soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X