నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

జపనీస్ ఆటోమోటివ్ బ్రాండ్ టొయోటాకు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ (Lexus) పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ LX 600 లో కంపెనీ ఓ నెక్స్ట్ జనరేషన్ మోడల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కొత్త 2022 లెక్సస్ ఎల్ఎక్స్ 600 (2022 Lexus LX 600) మూడవ తరానికి చెందిన మోడల్.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

లెక్సస్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 70 కి పైగా దేశాల్లో తన ఉనికిని కలిగి ఉంది. ఈ బ్రాండ్ ఇప్పుడు తమ కొత్త 2022 లెక్సస్ ఎల్ఎక్స్ 600 లగ్జరీ ఎస్‌యూవీని గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. గడచిన 14 సంవత్సరాల క్రితం అమ్మకానికి వచ్చిన ఈ ప్రీమియం ఎస్‌యూవీ యొక్క మూడవ తరం ప్రతిరూపమే ఇది.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

అంతేకాకుండా, దీనిని టొయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క లగ్జరీ మోడల్ కూడా అని చెప్పొచ్చు. కొత్త 2022 లెక్సస్ ఎల్ఎక్స్ 600 ఎస్‌యూవీని టొయోటా ల్యాండ్ క్రూయిజర్‌ కి అంతర్లీనంగా ఉండే అదే ప్లాట్‌ఫామ్‌ పై నిర్మించారు. కాకపోతే, ఈ జపనీస్ బ్రాండ్ తమ వాహనం యొక్క బరువును 200 కేజీల కంటే తక్కువగా తగ్గించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

ఎల్ఎక్స్ 600 ఎస్‌యూవీ లెక్సస్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ స్టైలింగ్ శైలిని అనుసరిస్తుంది. సైడ్ నుండి చూస్తే, ఇది టొయోటా ల్యాండ్ క్రూయిజర్‌ మాదిరిగా కనిపిస్తుంది. లెక్సస్ సాధారణంగా అనుసరించే శైలి ఇదే అని కూడా గమనించాలి. లెక్సస్ లగ్జరీ ఎస్‌యూవీలో సి పిల్లర్ ఉండదు, కంపెనీ దానిని గ్లాస్ తో రీప్లేస్ చేసింది. ఇది మినహా సైడ్ నుండి మిగిలిన డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కొత్త ల్యాండ్ క్రూయిజర్ మాదిరిగానే ఉంటాయి.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్‌ తో పోలిస్తే, లెక్సస్ ఎల్ఎక్స్ 600 సాలిడ్ ఫ్రంట్ గ్రిల్ మరియు వెడల్పాటి ఎల్ఈడి టెయిల్‌ లైట్‌లను కలిగి ఉంటుంది. ఇకపోతే, ఇందులో మరిన్ని మార్పులను క్యాబిన్ లోపల స్పష్టంగా చూడొచ్చు. కొత్త లెక్సస్ ఎల్ఎక్స్ 600 ఇప్పుడు లెక్సస్ డ్యూయల్ టచ్‌స్క్రీన్ సెటప్ మరియు ఆఫ్‌రోడ్ ఫీచర్లు, ఆడియో మరియు నావిగేషన్ కంట్రోల్స్ ను ప్రదర్శించడానికి పెద్ద 12.3 ఇంచ్ స్క్రీన్‌ ను కలిగి ఉంటుంది.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

టెంపరేచర్ కంట్రోల్స్ ని త్వరితగతిన యాక్సెస్ చేయటానిడి ఇందులో మరొక స్క్రీన్ కూడా ఉంటుంది, దానిని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కి దిగువన అమర్చబడి ఉంటుంది. అంతేకాదు, ఇది ఆఫ్-రోడ్ డేటాను కూడా ప్రదర్శిస్తుంది మరియు బహుళ భూభాగాల ఎంపికకు (టెర్రైన్ మోడ్ సెలక్షన్‌కు) మద్దతుగా పనిచేస్తుంది.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

ఇంత భారీగా కనిపించే ఎస్‌యూవీలో కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఉంటాయి. ఇందులో ఒకటి డ్రైవర్ కోసం మిగిలినవి ప్యాసింజర్ల కోసం. వెనుక వరుసలోని రెండు కెప్టెన్ సీట్లు అత్యుత్తమ సౌకర్యాన్ని అందిస్తాయి. ఇవి స్లైడ్ అండ్ రిక్లైనింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. అత్యుత్తమ లెథర్ మెటీరియల్స్ తో వీటిని రూపొందించారు.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

వెనుక సీట్లలోని ప్యాసింజర్ల వినోదం మరియు సమాచారం కోసం ఫ్రంట్ సీట్లపై రెండు పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి సెంటర్ ఆర్మ్‌రెస్ట్ లో టచ్‌స్క్రీన్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో హిడెన్ స్టోరేజ్, కప్ హోల్డర్స్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అదనపు లెగ్‌రూమ్ కోసం ఫ్రంట్ ప్యాసింజర్ సీటును పూర్తిగా ముడుచుకోవచ్చు.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

లెక్సస్ ఎల్ఎక్స్ అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ యొక్క స్టాండ్-అలోన్ ప్రయోజనాలు కూడా గుర్తించదగినవి. ఈ కారులో రీడింగ్ లైట్లు, వెనుక ప్రయాణీకుల కోసం వినోద వ్యవస్థ మరియు రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్‌లు ఉన్నాయి. ఎల్ఎక్స్ 600 ఎస్‌యూవీ యొక్క ఎఫ్ స్పోర్ట్ వేరియంట్ ప్రత్యేకమైన 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ తో వస్తుంది. ఇది ఈ మోడల్ లైన్‌లో అతి పెద్దది కావడం విశేషం.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

ఈ భారీ అల్లాయ్ వీల్స్ ఎస్‌యూవీ రోడ్ ప్రజెన్స్ ను పెంచడమే కాకుండా, వెనుక యాక్సిల్‌ పై మెరుగైన ట్రాక్షన్ కోసం పరిమిత స్లిప్‌ను కూడా అందిస్తుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఈ కొత్త 2022 మోడల్ ఎల్ఎక్స్ 600లో సమర్థవంతమైన 3.5 లీటర్ ట్విన్ టర్బో వి6 ఇంజన్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇది గతంలోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 5.7 లీటర్ వి8 ఇంజన్‌ ను రీప్లేస్ చేస్తుంది.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

ఇందులోని కొత్త 3.5 లీటర్ ట్విన్ టర్బో వి6 ఇంజన్ గరిష్టంగా 409 బిహెచ్‌పి పవర్ ను మరియు 650 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ టర్బో ఇంజన్ తో కూడిన ఎల్ఎక్స్ 600 దాని మునుపటి వెర్షన్ కంటే చాలా శక్తివంతమైనది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీని తక్కువ బరువు కారణంగా, 2022 మోడల్ మునుపటి వెర్షన్ కంటే అధికంగా 26 బిహెచ్‌పి పవర్ నుమరియు 107 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

ఈ కొత్త 3.5-లీటర్ ట్విన్-టర్బో వి6 ఇంజన్ పాత మోడల్ యొక్క 8 స్పీడ్ గేర్‌బాక్స్‌ కు బదులుగా 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. మరి ఈ మూడవ తరం లెక్సస్ ఎల్ఎక్స్ 600 ను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే, టొయోటా మాత్రం ఈ ఏడాది డిసెంబర్ నాటికి తమ కొత్త ల్యాండ్ క్రూయిజర్‌ ఎస్‌యూవీని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

నెక్స్ట్ జనరేషన్ Lexus LX600 లగ్జరీ ఎస్‌యూవీ విడుదల

అంతర్జాతీయ మార్కెట్లో విడులైన ఈ కొత్త తరం టొయోటా ల్యాండ్ క్రూయిజర్ లగ్జరీ కార్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాబట్టి, ఈ కొత్త తరం ఎల్‌సి 300 ఎస్‌యూవీ భారతీయ వినియోగదారులను కూడా ఆకట్టుకోగదలని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా, టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 3.5 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ మరియు 3.3 లీటర్ ట్విన్-టర్బో వి6 డీజిల్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Next gen lexus lx 600 luxury suv launched with major upgrades details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X