జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, భారత మార్కెట్లో తమ కొత్త తరం ఆక్టేవియా సెడాన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, వాయిదాపడిన ఈ కార్ లాంచ్, ఎట్టకేలకు వచ్చే నెలలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

ఈ మేరకు స్కొడా డీలర్లు తమ వినియోగదారులకు సమాచారాన్ని కూడా పంపిస్తున్నాయి. కొత్త తరం స్కొడా ఆక్టేవియాను జూన్ 10, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. స్కొడా డీలర్‌షిప్‌లు ఇప్పటికే ఈ కొత్త 2021 ఆక్టేవియా కోసం బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించాయి.

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

ఒక డీలర్‌షిప్ తమ వినియోగదారులకు పంపిన సందేశం ప్రకారం, నాల్గవ తరం స్కొడా ఆక్టేవియాను జూన్ 10, 2021న విడుదల చేస్తామని, ఈ మోడల్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని తెలిపింది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.27.50 లక్షల నుండి రూ.32 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని కూడా ఆ సందేశంలో పేర్కొన్నారు.

MOST READ:విమానంలో ప్రయాణించేటప్పుడు మీ సెల్‌ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయమన్నారా? ఎందుకో తెలుసా?

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో స్కొడా ఆక్టేవియా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్. చాలా కాలంగా భారత మార్కెట్లో ఉన్న ఈ మోడల్ ఇప్పుడు మరింత ప్రీమియం డిజైన్, ఆధునిక టెక్నాలజీ మరియు అద్భుతమైన ఫీచర్లతో రాబోతోంది. భారత్‌లో బిఎస్6 కాలుష్య నిబంధనల తర్వాత పాత తరం స్కొడా ఆక్టేవియా అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసినదే.

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

స్కొడా ఆటో ఇటీవలే ఈ కొత్త తరం 2021 ఆక్టేవియా సెడాన్‌ను యూరోపియన్ మార్కెట్లలో కూడా విడుదల చేసింది. మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మోడల్ మరింత ప్రీమియంగా, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ సెడాన్‌ను ఎమ్‌క్యూబి ఇవో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించారు.

MOST READ:చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ కాస్తంత పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో క్రోమ్ హౌసింగ్‌తో కూడిన బటర్‌ఫ్లై గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, కారు వెనుక భాగంలో బూట్ లిడ్‌పై పెద్ద అక్షరాలతో ముద్రించబడిన 'స్కొడా' బ్యాడ్జింగ్‌లు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

కొత్త తరం 2021 స్కొడా ఆక్టేవియా సెడాన్‌ను రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేయనున్నారు. ఇందులో మొదటిది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు రెండవది 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఇవి రెండూ కూడా రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లే.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

ఇందులోని 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 2.0 ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

జూన్ 10న కొత్త స్కొడా ఆక్టేవియా లాంచ్, బుకింగ్స్ ఓపెన్: ధర, వివరాలు

కొత్త తరం 2021 స్కొడా ఆక్టేవియా మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, ఇది మునుపటి కన్నా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులోని అప్‌డేటెడ్ పవర్ టూ వెయిట్ రేషియో కారణంగా, ఈ కారు కేవలం 8.33 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదని కంపెనీ పేర్కొంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Next Generation 2021 Skoda Octavia Launch On June 10, Bookings Open. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X