Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 17 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిస్సాన్ మాగ్నైట్‌పై వాలెంటైన్స్ డే ఆఫర్స్; 100% క్యాష్‌బ్యాక్, మరెన్నో..
జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సరికొత్త లక్కీ డ్రా కాంటెస్ట్‌ను ప్రారంభించింది. కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ కొనుగోలుపై నిస్సాన్ పూర్తిగా 100 శాతం క్యాష్ బ్యాక్‌ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది.

కొత్తగా నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని బుక్ చేసుకున్న కస్టమర్లు మరియు ఫిబ్రవరి 12, 2021 నాటికి ఇంకా డెలివరీని అందుకోని వినియోగదారులందరికీ ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత లభిస్తుంది. వచ్చే మూడు నెలల పాటు ప్రతి 30 రోజులకు ఒకసారి చొప్పున ఈ లక్కీ డ్రా జరుగుతుంది.

ఈ లక్కీ డ్రాలో గెలిచిన మొత్తం 100 మంది వినియోగదారులకు వివిధ రకాల ఆఫర్లు లభిస్తాయి. ఇందులో ఒక కస్టమర్‌కు నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధరలో పూర్తిగా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు.

అలాగే, 8 మంది కస్టమర్లు ఒక్ వేరియంట్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు మరియు 25 మంది కస్టమర్లు 1 సంవత్సరం పాటు పొడిగించిన వారంటీని గెలుచుకోవచ్చు. మిగిలిన 66 మంది కస్టమర్లు 2 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్ల మెయింటినెన్స్ ప్యాకేజీని ఉచితంగా పొందవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ విషయానికి వస్తే, గతేడాది డిసెంబర్ నెలలో ఈ కారును కేవలం రూ.4.99 లక్షల ప్రారంభ ధరకే విడుదల చేశారు. ఆ తర్వాత జనవరి 2021లో కేవలం ఈ ప్రారంభ వేరియంట్ ధరను మాత్రమే రూ.50,000 మేర పెంచారు. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.5.49 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

నిస్సాన్ మాగ్నైట్ డిజైన్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు మొదలైన అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు లభిస్తాయి.

ఇంటీరియర్స్‌లో ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

అంతేకాకుండా, ఇది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.