Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్‌ప్రైజ్: నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలుపై రూ.80,000 వరకూ ఆదా!
నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కిక్స్ ఎస్‌యూవీపై జనవరి 2021 నెల ఆఫర్లలో భాగంగా ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. ఈ నెలలో నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని కొనుగోలు చేసే కస్టమరు రూ.80,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ బెనిఫిట్స్‌లో రూ.10,000 నగదు తగ్గింపు మరియు రూ.20,000 లాయల్టీ బోనస్‌లు ఉన్నాయి. అలాగే, కొత్త నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ కోసం కస్టమర్లు తమ ఏదైనా పాత కారును షోరూమ్‌లో మార్పిడి (ఎక్సేంజ్) చేసుకున్నట్లుయితే, వారికి ఎక్సేంజ్ బోనస్‌గా కంపెనీ అదనంగా రూ.50,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ ఆఫర్ జనవరి 2021 నెల మొత్తం చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో ఇటీవలే విడుదలైన మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు ఇంపోర్టెడ్ స్పోర్ట్స్ కార్ జిటి-ఆర్ మోడళ్లు ఉన్నాయి.
MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

నిస్సాన్ కిక్స్ విషయానికి వస్తే, ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ మరియు ఎమ్‌జి హెక్టర్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు పోటీగా ఉంటుంది. నిస్సాన్ కిక్స్ ప్రస్తుతం దేశీయ విపణిలో ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం మరియు ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.

ఇందులోని ఎంట్రీ లెవల్ ఎక్స్‌ఎల్ మరియు మిడ్-స్పెక్ ఎక్స్‌వి వేరియంట్లలో 1.5 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తాయి. ఇకపోతే, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లతో కూడిన కొత్త 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఇందులో టాప్-స్పెక్ ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.
MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

మార్కెట్లో నిస్సాన్ కిక్స్ ధరలు రూ.9.49 లక్షల నుండి రూ.14.15 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 1.5-లీటర్ ఇంజన్ 105 బిహెచ్‌పి పవర్‌ను మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్‌ను మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

బిఎస్6 అప్‌డేట్ తరువాత, నిస్సాన్ కిక్స్‌లో కంపెనీ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తోంది. ఇందులోని టర్బో వేరియంట్‌లో వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (విఎస్ఎమ్), ట్రాక్షన్ కంట్రోల్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు లభిస్తాయి.

కొత్త నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో క్యాస్కేడింగ్ గ్రిల్, ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రెండు చివర్లలో సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్ మరియు 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో కార్బన్ ఫైబర్ ఫినిషింగ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్ మరియు బ్రాండ్ యొక్క ‘నిస్సాన్ కనెక్ట్' కనెక్టింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇచ్చే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఇందులో రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, బ్రైట్ అండ్ కూల్ గ్లౌవ్ బాక్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.