Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- News
కోవిడ్ వ్యాక్సిన్ అప్డేట్: ధర, రిజిస్ట్రేషన్, సైడ్ ఎఫెక్ట్స్ - అన్ని ప్రశ్నలకు సమాధానాలు
- Movies
మరణం తర్వాత కూడా తీరని వివేక్ చివరి కోరిక.. అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెట్రోల్, డీజిల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు, ధరలు దిగొస్తాయ్ అంటున్న మంత్రి!
ఇటీవలి కాలంలో దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో నడికే వాహనాలకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ వాహనాలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో, రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల ధరలతో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలో ఉన్న మౌళిక సదుపాయాలు అంతంత మాత్రమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఇవి క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో, దేశంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కొత్త వాహన తయారీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి.

మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రోత్సాహకాలను మరియు భారీ సబ్సిడీలను అందిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, వచ్చే 2 సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్ కార్ల ధరలతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు సరిపోతాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ మీడియా కార్యక్రమంలో చెప్పారు.
MOST READ:క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన దాని ప్రకారం మరియు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, రానున్న రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు సుమారు 50 శాతం వరకూ తగ్గాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌గా ఇది ఎంత వరకూ సాధ్యమవుతుందనేది కాలమే నిర్ణయించాలి.

ఉదాహరణకు, దేశంలో టాటా నెక్సాన్ పెట్రోల్ కారు ధర సుమారు రూ.7 లక్షలు ఉంటే, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ.14 లక్షలుగా ఉంది. అంటే, టాటా నెక్సాన్ ఈవీ ధర దాని కౌంటర్ పెట్రోల్ వెర్షన్ ధరకు సమానంగా ఉండాలంటే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ధరను సుమారు రూ.7 లక్షలు (అంటే ప్రస్తుత ధరలో సగం) తగ్గించాల్సి ఉంటుంది.
MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

ఈ విషయంపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యానిస్తూ.. దేశంలోని అన్ని కొత్త వాహనాలు బిఎస్6 కాలుష్య నిబంధనలను పాటించేలా విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 8,00,000 కోట్ల రూపాయల (108 బిలియన్ యూఎస్ డాలర్ల) ముడి చమురును దిగుమతి చేసుకునే భారీ సమస్యతో దేశం సతమతమవుతోంది. ఇది ఆర్థికంగా కూడా మనలను వెనక్కి నెట్టివేస్తోందని మనం అర్థం చేసుకోవాలి.

ఈ సమస్యను అటుంచితే, న్యూ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న వాహన మరియు వాయు కాలుష్యం మరింత ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం, భారతదేశంలో లిథియం అయాన్ బ్యాటరీలను స్థానికంగా 81 శాతం వరకు మనమే తయారుచేసుకుంటున్నాం. రెండేళ్లలోపు దీనిని 100 శాతానికి తీసుకెళ్లగలమనే విశ్వాసం నాకు ఉంది.
MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

ఇదే గనుక జరిగితే రాబోయే రెండేళ్ళలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనల ధరలు వాటి సాంప్రదాయక పెట్రోల్, డీజిల్ వాహనాల ధరల స్థాయికి వస్తాయని నేను భావిస్తున్నాను. ఎలక్ట్రిక్ బస్సులు కూడా వాటి డీజిల్-శక్తితో నడిచే మోడళ్లకు సమానమైన ధరలకే రిటైల్ కావచ్చని ఆశిస్తున్నాము అని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

ఇదంతా పూర్తిగా 100 శాతం జరగటానికి కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని, కాని ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పనిచేస్తున్న విధానాన్ని మరియు దాని వేగవంతమైన పనితీరును చూస్తుంటే దీన్ని సాధించడం పట్ల తనకు చాలా నమ్మకంగా ఉందని, మెటల్-అయాన్ మరియు మెటల్-ఎయిర్ బ్యాటరీ టెక్నాలజీస్ వంటి రంగాలలో అద్భుతమైన పని జరుగుతోందని అయన అన్నారు.
MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రధానంగా ఎక్కువ ఖర్చయ్యే ముడిసరుకు అందులో ఉపయోగించే బ్యాటరీలే. ప్రస్తుతం చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు ఈ బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాయి. కొన్ని సంస్థలు పూర్తి బ్యాటరీ ప్యాక్‌లను దిగుమతి చేసుకుంటుంగా మరికొన్ని సంస్థలు బ్యాటరీ సెల్స్‌ని మాత్రమే దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్ చేస్తున్నాయి. బ్యాటరీలను స్థానికంగా భారతదేశంలోనే తయారు చేసి, తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చినట్లయితే నితిన్ గడ్కరీ చెప్పినట్లు రెండేళ్లలో కాకపోయినా మరికొన్ని ఏళ్లలోనైనా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే ఆస్కారం ఉంటుంది.
Source: AutoCar Professional