ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ప్రముఖ క్యాబ్ కంపెనీ అయిన ఓలా, ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. భారత స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగష్టు 15 న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ ఫుల్ బ్యాటరీ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ఇదిలా ఉండగా ఇప్పుడు ఓలా కంపెనీ దేశీయ విఫణిలోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రవేశపెట్టడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ కారు కూడా భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ట్విట్టర్ లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నేను రెండు నెలల క్రితమే కారు కొన్నాను మరియు అది హైబ్రిడ్. తదుపరి కారు నేను 2023 లో కొనుగోలు చేస్తాను మరియు అది ఓలా యొక్క ఎలక్ట్రిక్ కారు అవుతుంది. 2023 లో కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయబోతున్నట్లు ఓలా సీఈవో భవిష్య అగర్వాల్ ఈ ట్వీట్‌లో స్పష్టం చేశారు.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు, లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు కావచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయనుంది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓలా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. భారతీయ మార్కెట్లోని ఎలక్ట్రిక్ స్కూర్ విభాగంలో ఓలా కంపెనీ కూడా చోటు దక్కించుకుంది. స్కూటర్ విడుదల చేసిన తరువాత కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ కారు విడుదలతో కంపెనీ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల మార్కెట్లో కూడా అరంగేట్రం చేయనుంది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ఓలా కంపెనీ కొన్ని నెలల క్రితం, ఓలా హైపర్‌ఛార్జ్ నెట్‌వర్క్‌ను భారతదేశమంతటా విస్తరించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో, కంపెనీ భారతదేశంలోని 400 నగరాల్లో ఒక లక్ష కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్‌లను సృష్టిస్తుంది. దీనికయ్యే ఖర్చు దాదాపు $ 2 బిలియన్లకు పైగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ఈ హైపర్‌ఛార్జ్ నెట్‌వర్క్ రెండు ఫార్మాట్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి వర్టికల్ బేస్డ్ ఛార్జర్ కాగా, మరొకటి స్టాండలోన్ ఛార్జర్. ఎలక్ట్రిక్ వాహనాలను వర్టికల్ టవర్ ఛార్జర్‌లో పార్క్ చేసి, సులభంగా ఛార్జ్ చేయవచ్చు. అయితే ఐటి పార్కులు, షాపింగ్ మాల్‌లు మరియు కేఫ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలలో స్టాండలోన్ ఛార్జర్ వ్యవస్థాపించబడుతుంది. ఓలా కంపెనీ తన స్కూటర్‌తో పాటు కస్టమర్‌లకు ఛార్జర్‌ను కూడా ఇస్తుంది, దీనిని కస్టమర్ తన హోమ్ లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కావున వాహన వినియోగదారులకు ఎటువంటి సమస్య ఉండదు.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

దేశంలో సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడమే కాకుండా, లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని కూడా ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభించబోతోంది. రాబోయే కాలంలో, కంపెనీ భారతదేశంలో ఈవి సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక్కడ 100% 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్' టెక్నాలజీతో బ్యాటరీని తయారు చేయవచ్చు. ప్రస్తుతం, భారతదేశంలో విక్రయించబడుతున్న చాలా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు బయటి నుండి దిగుమతి చేసుకున్నావే.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ఆగస్టు 15 న ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ స్కూటర్ల ధరలు వరుసగా ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 99,999 మరియు రూ. 1,29,999 . ఈ స్కూటర్లు 3.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి మరియు దాని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 కిలోవాట్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

750 వాట్ సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, కంపెనీ ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపించని అనేక కొత్త ఫీచర్లను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా చేర్చింది.

ఎలక్ట్రిక్ కార్ తయారీకి సిద్దమవుతున్న 'ఓలా'; 2023 కి మార్కెట్లో విడుదల

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 181 కిమీ వరకు ప్రయాణించే సామర్త్యాని కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. ఇది మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది, ఇందులో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండి, బలమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో అందుబాటులో ఉంది. అంతే కాకూండా ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 10 కలర్ అప్సన్లలో అందుబాటులో తీసుకువచ్చింది.

Most Read Articles

English summary
Ola to launch electric car by 2023 confirms ceo bhavish aggarwal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X