అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయా అన్నట్టు పెరిగిపోతూ ఉన్నాయి. మే నెలలో దేశంలో పెట్రోల్ ధర చాలా ఎక్కువగా పెరిగింది. మే తర్వాత కొన్ని రోజులు పెట్రోల్, మరియు డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే ఇటీవల మళ్ళీ ధరలు అమాంతం పెరుగుదల దిశవైపు సాగుతున్నాయి.

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర ఏకంగా 100 రూపాయలు దాటింది. ముంబైలో పెట్రోల్ ధర 20 మే 2021 న రూ. 100.19 కు చేరింది. తరువాత గత 24 రోజుల్లో పెట్రోల్ ధర 3.07 రూపాయలకు పెరిగింది. దేశవ్యాప్తంగా బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 2020 ఏప్రిల్ నుండి, పెట్రోల్ ధరలు 24.91 రూపాయలు పెరగడం ఆశ్చర్యకరం.

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ముంబైలో మాత్రమే కాకుండా, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 93.94 రూపాయలకు చేరుకోగా, చెన్నైలో ధర 92.7 రూపాయలకు, కోల్‌కతాలో ధర 93.97 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం దాదాపు అన్ని నగరాల్లో పెట్రోల్ ధర గత ఏప్రిల్ నెల కంటే రూ. 21 రూపాయలు ఎక్కువవయింది.

MOST READ:ఈ కారణంగానే అక్కడ లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా?

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం పెట్రోల్ ధర మాత్రమే కాదు, డీజిల్ ధరలు కూడా ఏ మాత్రం తక్కువగా లేదు. ఇప్పుడు ముంబైలో డీజిల్ ధర రూ. 92.17 కు చేరింది. కేవలం ఈ ఒక్క నెలలోనే డీజిల్ ధర రూ. 3.98 పెరిగింది. గత ఏప్రిల్ నెలతో పోలిస్తే దాదాపు రూ. 26.98 పెరిగినట్లు తెలుస్తుంది.

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ఈ ధర దాదాపు పెట్రోల్ ధర కంటే ఎక్కువగా ఉంది. ముంబైలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం 2020 ఏప్రిల్‌లో రూ. 10.09 కాగా, ఇప్పుడు అది రూ. 8.02 గా మారింది. డిల్లీలో డీజిల్ ధరను రూ .84.89 కు చేరుకోగా, చెన్నైలో రూ. 89.65 గా ఉంది. అదేవిధంగా కలకత్తాలో డీజిల్ ధర రూ. 87.74 కు పెరిగింది.

MOST READ:టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలతో సహా అన్ని రకాల వాహన యజమానులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ కారణంగా వాహన అమ్మకాలు కూడా ప్రభావితమవుతున్నాయి. దేశంలో ఇంధన ధరలు పెరగడానికి కారణం ఎక్కువవుతున్న కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు.

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ టాక్స్ 35.53% వాసూలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 23% టాక్స్ వసూలు చేస్తుంది. ఈ రెండు పన్నులతో సహా, ప్రభుత్వం 58.60% అనగా ఢిల్లీ పెట్రోల్‌లో సుమారు 55 రూపాయలు టాక్స్ తీసుకుంటోంది.

MOST READ:2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ఇక డీజిల్ విషయానికి వస్తే, ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం 38.21%, రాష్ట్ర ప్రభుత్వం 14.64% టాక్స్ వసూలు చేస్తుంది. మొత్తం మీద, ప్రభుత్వం 52.85% టాక్స్ వసూలు చేస్తుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగలేదు. కానీ ఇప్పుడు అక్కడ కూడా పెరుగుతూనే ఉంది.

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

ప్రస్తుతం, కరోనా సమయంలో ప్రజా రవాణా లేకపోవడం వల్ల, ప్రజలు వ్యక్తిగత రవాణాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి సమయంలో పెరుగుతున్న ఇంధన ధరలు ప్రతి ఒక్కరినీ ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. అదే సమయంలో వస్తువుల ధరలు కూడా ప్రజలను చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి.

MOST READ:ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

కరోనా మహమ్మారి వల్ల కేవలం ప్రజలు మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. కరోనా లాక్ డౌన్ వల్ల అమ్మకాలు భారీగా తగ్గుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలు కూడా వాహన అమ్మకాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఏది ఏమైనా పెరుగుతున్న వాహన ధరలు సామాన్య ప్రజలకు మోయలేని భారమని చెప్పాలి.

Most Read Articles

English summary
Petrol Price Crosses Rs. 100 Mark In Mumbai. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X