భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan: ధర రూ. 1.50 కోట్లు

ప్రముఖ జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ పోర్స్చే (Porsche) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త టైకాన్‌ (Taycan) EV ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆల్ ఎలక్ట్రిక్ కార్ ప్రారంభ ధర రూ. 1.50 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి టైకాన్‌ (Taycan) EV రెండు బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉంది. అవి టైకాన్‌ సెడాన్ మరియు టైకాన్ క్రాస్ టురిస్మో ఎస్టేట్.

భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

టైకాన్‌ సెడాన్ అనేది నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

అవి:

 • టైకాన్‌ (స్టాండర్డ్) - రూ. 1.50 కోట్లు
 • టైకాన్‌ 4ఎస్ - రూ. 1.63 కోట్లు
 • టైకాన్‌ టర్బో - రూ. 2.08 కోట్లు
 • టైకాన్‌ టర్బో ఎస్ - రూ. 2.29 కోట్లు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)
 • భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

  టైకాన్ క్రాస్ టురిస్మో ఎస్టేట్ మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది.

  అవి:

  • టైకాన్ క్రాస్ టురిస్మో 4ఎస్ - రూ. 1.70 కోట్లు
  • టైకాన్ క్రాస్ టురిస్మో టర్బో - రూ. 2.10 కోట్లు
  • టైకాన్ క్రాస్ టురిస్మో టర్బో ఎస్ - రూ. 2.31 కోట్లు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)
  • భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   భారతీయ మార్కెట్లో విడుదలై కొత్త Taycan పోర్స్చే యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్. ఇది బ్రాండ్ యొక్క Porsche Panamera లాగా, నాలుగు-డోర్ల కూపే. అంతే కాకుండా దీని డిజైన్ 2015 నుండి మిషన్ E కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   టైకాన్‌ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అందులో నాలుగు ఎల్ఈడీ డిఆర్ఎల్ ఎలిమెంట్స్ తో కూడిన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇవి ఈ కారుకి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి. ఇక ఈ కారు యొక్క వెనుకవైపు వెడల్పుగా ఉండే ఒక లైట్‌బార్ ఉంటుంది. దీనికింద బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మునుపటికంటే 30 మిమీ అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   పోర్స్చే టైకాన్‌ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 16.8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 10.9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం 8.4 ఇంచెస్ స్క్రీన్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ప్రయాణీకుల కోసం కూడా ఇందులో 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   పోర్స్చే టైకాన్‌ Turbo లోని స్టాండర్డ్ కిట్‌లో 20 ఇంచెస్ అల్లాయ్స్, కారును 22 మిమీ వరకు తగ్గించగల అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆపిల్ కార్ప్లే, బోస్ స్టీరియో సిస్టమ్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అయితే పోర్స్చే టైకాన్‌ టర్బో S లో 21 ఇంచెస్ వీల్స్, అప్‌గ్రేడ్ బ్రేక్‌లు మరియు 18-వే ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్ సీట్లు ఉంటాయి.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   Porsche Taycan EV గరిష్టంగా 600 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 500 కిమీల రేంజ్‌ను అందించే రెండు హై వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీల ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. టైకాన్ క్రాస్ టురిస్మో టర్బో ఎస్ వేరియంట్ 761 బిహెచ్‌పి పవర్ మరియు 1050 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత శక్తివంతమైన EV గా నిలిచింది.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   Taycan RWD మరియు 4S 79.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కానీ టర్బో మరియు టర్బో S మాత్రం 93.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టైకాన్ క్రాస్ టురిస్మో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కిమీ పరిధిని అందిస్తుంది.ఇందులోని బ్యాటరీ 20 నిమిషాలలో 5 శాతం నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   స్టాండర్డ్ 11 కిలో వాట్ AC ఛార్జర్ దీనికి ఛార్జ్ చేయడానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది. అదేవిధంగా 50 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 93 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

   భారత్‌లో విడుదలైన కొత్త Porsche Taycan : ధర రూ. 1.50 కోట్లు

   భారతీయ మార్కెట్లో Porsche Taycan సెడాన్ Audi e-tron GT కి ప్రత్యర్థిగా ఉంది. అంతే కాకుండా Jaguar I-Pace మరియు Mercedes EQC ఎలక్ట్రిక్ వంటి వాటికీ కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Porsche launched taycan ev sports car in indian market specs and details
Story first published: Friday, November 12, 2021, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X