ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, మార్కెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, కేవలం రూ.11.99 లక్షల ప్రారంభ ధరకే తమ ఫ్యూచరిస్టిక్ 6/7-సీటర్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ700' (సెవన్ డబుల్ ఓ అని పలకాలి)ని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజన్లు మరియు సరికొత్త సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఎక్స్‌యూవీ700 ఇప్పుడు మార్కెట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ కారు విషయంలో అందరినీ ఆశ్చర్యపరచే అంశం దాని సరసమైన ధర.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

వాస్తవానికి ఈ ధర మహీంద్రా విక్రయిస్తున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కన్నా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో లభిస్తున్న అనేక కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ కార్ల కంటే కూడా ఈ ధర చాలా తక్కువే. నిజానికి ఆ కార్లను కొనుగోలు చేయడానికి వెచ్చించే సొమ్ముతో ఈ సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

ఎక్స్‌యూవీ700 యొక్క అన్ని వేరియంట్‌ల వివరాలను మహీంద్రా ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి, ఇందులో నాలుగు వేరియంట్ల ధరలను మాత్రమే కంపెనీ వెల్లడి చేసింది. ఇందులో ఎమ్ఎక్స్ పెట్రోల్, ఎమ్ఎక్స్ డీజిల్, ఏఎక్స్3 పెట్రోల్ మరియు ఏఎక్స్5 పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలను పరిశీలిస్తే..

ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ పెట్రోల్ - రూ.11.99 లక్షలు

ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ డీజిల్ - రూ.12.49 లక్షలు

ఎక్స్‌యూవీ700 ఏఎక్స్3 పెట్రోల్ - రూ.13.99 లక్షలు

ఎక్స్‌యూవీ700 ఏఎక్స్5 పెట్రోల్ - రూ.14.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

ఈ కథనంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క ఎమ్ఎక్స్ వేరియంట్ ధరను భారతదేశంలో అందుబాటులో ఉన్న 5 ఇతర కాంపాక్ట్ కార్ల ధరలతో పోల్చాము మరియు అవి ఈ వేరియంట్ ధర కంటే అధిక ధరను కలిగి ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

ముందుగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క బేస్ వేరియంట్ అయిన ఎమ్ఎక్స్ విషయానికి వస్తే, ఈ కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, స్మార్ట్ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన పవర్-అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఆర్17 అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

1. టాటా నెక్సాన్

ప్రస్తుతం, టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ (ఆప్షనల్) డ్యూయల్ టోన్ పెట్రోల్ (ఏఎమ్‌టి) వేరియంట్ ధర రూ.11.76 లక్షలు మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ (ఆప్షనల్) డ్యూయల్ టోన్ డీజిల్ (మ్యాన్యువల్) వేరియంట్ ధర రూ.12.47 లక్షలుగా ఉంది. ఇదొక సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ఈ కారులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

2. కియా సొనెట్

కియా సొనెట్ యొక్క జిటిఎక్స్ ప్లస్ టర్బో పెట్రోల్ (ఐఎమ్‌టి) వేరియంట్ ధర దాదాపు ఎక్స్‌యూవీ700 ఎక్స్ వేరియంట్ ధరతో సమానంగా ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో దీని ధర రూ.12.19 లక్షలు మరియు జిటిఎక్స్ ప్లస్ డీజిల్ (మ్యాన్యువల్) వేరియంట్ ధర రూ.12.45 లక్షలుగా ఉంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రిమోట్ ఇంజన్ స్టార్ట్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథెరెట్ అప్‌హోలెస్ట్రీ మరియు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

3. హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ వెన్యూ యొక్క ఎస్ఎక్స్ ప్లస్ స్పోర్ట్ టర్బో పెట్రోల్ (డిసిటి) వేరియంట్ ధర రూ.11.85 లక్షలుగా ఉంది. ఇది కూడా ఇంచు మించు ఎక్స్‌యూవీ700 యొక్క ఎమ్ఎక్స్ వేరియంట్ ధరకు సమానంగా ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ కూడా సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీనే. ఈ కారులో రిమోట్ ఇంజన్ స్టార్ట్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

4. కొత్త తరం హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 యొక్క ఆస్టా (ఆప్షనల్) డ్యూయల్ టోన్ టర్బో పెట్రోల్ (డిసిటి) వేరియంట్ ధర రూ.11.40 లక్షలుగా ఉంటుంది. ఇది ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ వేరియంట్ కన్నా రూ.50,000 తక్కువ ధరను కలిగి ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్, బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ మరియు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కార్లకు పెట్టే డబ్బుతో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 కొనుక్కోవచ్చు..

5. కొత్త తరం హోండా సిటీ

జపనీస్ కార్ బ్రాండ్ హోండా అందిస్తున్న కొత్త-తరం సిటీ సెడాన్ యొక్క వి డీజిల్ (మ్యాన్యువల్) వేరియంట్ ధర రూ.12.76 లక్షలుగా ఉంటుంది. ఇది ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్ వేరియంట్ ధర కన్నా ఎక్కువ. హోండా సిటీ ఒక మిడ్-సైజ్ సెడాన్ మరియు ఈ కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
Price comparison of popular compact cars with mahindra xuv700
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X