భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) భారత మార్కెట్లో మరో సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేసింది. రేంజ్ రోవర్ వెలార్ పేరుతో కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ.79.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

ఈ కొత్త 2021 రేంజ్ రోవర్ వెలార్ అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది మరియు ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇందులో ఆర్-డైనమిక్ ఎస్ వేరియంట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పాత మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 రేంజ్ రోవర్ వెలార్ ధర ఎక్కువగా ఉంది.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

రేంజ్ రోవర్ వెలార్‌ను మొట్టమొదటి సారిగా 2017 డిసెంబర్‌లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.78.83 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఆ తర్వాత 2019లో మేడ్-ఇన్-ఇండియా వెలార్‌ను జేఎల్ఆర్ ప్రవేశపెట్టింది. మేడ్ ఇన్ ఇండియా కారణంగా దాని ధర దిగొచ్చింది. రెండేళ్ల క్రితం ఈ కారు ధర రూ.72.47 లక్షలుగా ఉండేది.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

కాగా, కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీ ధరను తిరిగి రూ.7.4 లక్షలు పెంచింది. అయితే, పెరిగిన ధరకు అనుగుణంగా కంపెనీ ఈ కొత్త 2021 రేంజ్ రోవర్ వెలార్‌లో అనేక అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. ఇది ప్రపంచంలో సాంకేతికంగా అత్యంత ఆధునికమైన ఎస్‌యూవీ అని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

ఈ 2021 రేంజ్ రోవర్ వెలార్‌లో కంపెనీ అనేక స్మార్ట్ ఫీచర్లను జోడించింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 246 హెచ్‌పి శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 201 హెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

ఇంకా ఇందులో టార్క్-ఆన్-డిమాండ్ ఆల్ వీల్ డ్రైవ్, టెర్రైన్ రెస్పాన్స్ 2 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, వెలార్ ఎస్‌యూవీ కేవలం 8.20 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 210 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. దీని పేలోడ్ సామర్థ్యం 2400 కిలోలుగా ఉంటుంది.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

ఈ కారులో లభించే కొన్ని కీలకమైన ఫీచర్ల గురించి ప్రస్తావిస్తే, ఇందులో పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండు 10 ఇంచ్ టచ్‌స్క్రీన్‌లు (ఒకటి డ్యాష్ బోర్డులో, మరొకటి సెంటర్ కన్సోల్‌లో) రీడిజైన్డ్ ఇంటర్ఫేస్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రిమోట్, 12.3 ఇంచ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు 3డి నావిగేషన్ వంటి అనేక లగ్జరీ, కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో రేంజ్ రోవర్ వెలార్ విడుదల; ధర రూ.79.87 లక్షలు

అంతేకాకుండా, ఈ కారులో మెరీడియన్ సౌండ్ సిస్టమ్, 3డి సరౌండ్ కెమెరా, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్‌తో క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్ కూడా అందించబడుతుంది. ఈ ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, బంపర్లపై కాపర్ యాక్సెంట్స్, సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, బానెట్‌పై రేంజ్ రోవర్ బ్యాడ్జింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, పెద్ద ఎయిర్ వెంట్స్, సన్నటి ఎల్ఈడి డిఎల్ఆర్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Range Rover Velar Launched In India; Price Starts At Rs 79.87 Lakhs. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X