Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ రెనో డస్టర్ (Renault Duster) ఒకప్పుడు ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ గా నిలిచిన సంగతి తెలిసినదే. అయితే, ఈ విభాగంలో పెరిగిన పోటీ కారణంగా, క్రమంగా ఈ మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, తిరిగి డస్టర్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ మోడల్ ఎంపిక చేసిన వేరియంట్ల ధరను భారీగా తగ్గించింది.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

ప్రస్తుతం, మార్కెట్లో రెనో డస్టర్ 1.5 పెట్రోల్ మరియు 1.3 టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. కాగా, ఇందులోని 1.5 లీటర్ ఆర్ఎక్స్‌జెడ్ మాన్యువల్ వేరియంట్ ధరను కంపెనీ భారీగా రూ. 46,060 మేర తగ్గించింది. తాజా ధరల సవరణ అనంతరం ఈ మోడల్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 9,99,990 లకు చేరుకుంది. సవరించిన ధరలు అక్టోబర్ 12, 2021 నుండి అమల్లోకి వస్తాయి.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

వీటికి అదనంగా, రెనో ఇండియా ఈ నెల డస్టర్ ఎస్‌యూవీ పై లక్ష రూపాయాల వరకు అదనపు ఆఫర్‌ లను అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో అధీకృత రెనో డీలర్‌షిప్ కేంద్రాన్ని సందర్శించండి. ప్రస్తుతం, భారత మార్కెట్లో రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ. 9.86 లక్షల నుండి రూ. 14.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

రెనో డస్టర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ కారులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, 6.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay మరియు Android Auto ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

రెనో డస్టర్ ఎస్‌యూవీ లోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 156 బిహెచ్‌పి శక్తిని మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

ఈ రెండు ఇంజన్ ఆప్షన్లలో1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ చాలా సమర్థవంతమైన ఇంజన్. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 16.5 కిలోమీటర్ల మైలేజీని మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 16.42 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. గతేడాది అక్టోబర్ 2020లో కంపెనీ ఈ ఇంజన్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

భారత మార్కెట్లో రెనో డస్టర్ ఒకప్పుడు కింగ్ లా మార్కెట్ ని రూల్ చేసిన మోడల్, అయితే కంపెనీ ఈ మోడల్ ని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా రెడీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. భారత మార్కెట్లో రెనో ఇండియా తమ మొదటి తరం డస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ మోడల్‌లో పెద్దగా కొత్త అప్‌గ్రేడ్స్ ఏవీ తీసుకురాలేదు.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

ఈ ఎస్‌యూవీలో చిన్నపాటి మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లు మినహా పూర్తిగా కొత్త తరం మోడల్‌ను కంపెనీ ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కొత్తగా వచ్చిన మోడళ్ల కారణంగా పోటీ అధికంగా ఉంది. ఇలాంటి పోటీ వాతావరణంలో రెనో డస్టర్ నిలబడలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం, దాని బోరింగ్ డిజైన్ మరియు ఫీచర్లే అని చెప్పొచ్చు.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

నిజం చెప్పాలంటే, రెనో ఇండియా ఇటీవల విడుదల చేసిన కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభిస్తున్నటువంటి ఫీచర్లు కూడా ఈ డస్టర్ ఎస్‌యూవీలో లభించడం లేదు. ఈ విభాగంలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభించిన ఏకైక ఎస్‌యూవీ కూడా ఇదే. కానీ, ఇప్పుడు కంపెనీ ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లను ఆప్షనల్ గా కూడా అందించడం లేదు.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ కారణంగా, రెనో డస్టర్ ను ఈ విభాగంలోనే అత్యంత సామర్థ్యం గల ఎస్‌యూవీ లలో ఒకటిగా మార్చింది. అయితే, ఈ ఫ్రెంచ్ బ్రాండ్ దాని డిజైన్ విషయంలో గణనీయమైన మెరుగుదలలను అందించడంలో విఫలం కావడమే డస్టర్ యొక్క ప్రస్తుత పరిస్థితికి కారణం అని చెప్పవచ్చు. తొలినాళ్లలో ఈ మోడల్ దాని యూరోపియన్ డిజైన్ అందంతో చాలా మంది కస్టమర్లను ఆకర్షించింది, కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ కూడా పనిచేయడం లేదు.

Renault Duster పై భారీ డిస్కౌంట్, కొనడానికి ఇదే సరైన సమయం!

రెనో డస్టర్‌ ఎస్‌యూవీలో కంఫర్ట్ మరియు సేఫ్టీ పరంగా కంపెనీ మంచి ఫీచర్లనే అందించింది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆర్కిమెడిస్ సోర్స్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఈఎస్‌పి మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault duster rxz manual variant price dropped details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X