Just In
- 2 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 58 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ; త్వరలో విడుదల
రెనో ఇండియా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కైగర్'ను మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది. తాజాగా, రెనో ఈ ఎస్‌యూవీని డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేయటం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కావటానికి ముందే ఓ డీలర్‌షిప్ వద్దకు వచ్చిన రెనో కైగర్ కార్ కింగ్ / యూట్యూబ్ ఛానెల్ తమ కెమెరాలో బంధించింది. ఈ చిత్రాల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో ఉన్న ఓ కైగర్ టెస్ట్ డ్రైవ్ వాహనాన్ని మరియు సిల్వర్ కలర్‌లో ఉన్న మరొక రెనో కైగర్‌ను చూడొచ్చు.

ఈ చిత్రాలను గమనిస్తే, రెనో కైగర్ ముందు భాగంలో రెండు-స్లాట్ గ్రిల్‌ను కలిగి ఉండి, దాని మధ్యలో పెద్ద రెనో లోగోను చూడవచ్చు. గ్రిల్‌కి ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన సన్నటి ఎల్ఈడి డిఆర్ఎల్స్ మరియు ఫ్రంట్ బంపర్‌లో ఇరువైపులా అమర్చిన త్రీ-పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను గమనించవచ్చు. బంపర్‌కి దిగువ భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ అమర్చబడి ఉంది.
MOST READ:కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్ : వివరాలు

ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, స్టైలిష్ 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్, బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌తో కూడిన వీల్ ఆర్చెస్, పియా బ్లాక్ ఫినిష్‌లో ఉన్న సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్‌ను చూడొచ్చు.

రెనో కైగర్ వెనుక భాగంలో స్టాప్ లాంప్‌తో రూఫ్‌కి అమర్చిన స్పాయిలర్, సిగ్నేచర్ సి-ఆకారపు ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, సిల్వర్-ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన డ్యూయల్ టోన్ బంపర్ మొదలైన వివరాలను గమనించవచ్చు.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

ఈ చిత్రాలలో రెనో కైగర్ ఇంటీరియర్‌లను కూడా చూడొచ్చు. ఈ క్యాబిన్‌లో అనేక టెక్నాలజీ, కంఫర్ట్ మరియు కన్వీనెన్స్ ఫీచర్లతో పాటుగా ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చారు. దీని క్యాబిన్‌ను బ్లాక్ / యాష్ కలర్‌లో ఫినిష్ చేశారు. ఇది లోపలిపై ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీలో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్‌లు మొదలైనవి ఉన్నాయి.

కొత్త రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మాదిరిగానే 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇవి రెండూ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి.
MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కూడా లభించే అవకాశం ఉంది. అలాగే, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. మార్కెట్ అంచనా ప్రకారం, రెనో కైగర్ ధర కూ రూ.5 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

రెనో కైగర్ భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్‌తో పాటుగా హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.
Image Courtesy: car king