భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, భారత మార్కెట్లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్న తమ సరికొత్త కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తిని చెన్నై ప్లాంట్‌లో ప్రారంభించింది. ఈ మోడల్‌కి సంబంధించిన డెమో కార్లు ఇప్పటికే డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

నిస్సాన్ మాగ్నైట్ విషయంలో జరిగిన పొరపాటు రెనో కైగర్ విషయంలో జరగకూడదని కంపెనీ భావిస్తోంది. అందుకే ఈ మోడల్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసే సమయానికి తగిన సంఖ్యలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలని రెనో ఇండియా నిర్ణయించింది.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

నిస్సాన్ మాగ్నైట్‌ను గడచిన డిసెంబర్ నెలలో రూ.4.99 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేశారు. అప్పటి నుండి ఈ మోడల్‌కి భారీ డిమాండ్ ఏర్పడటంతో, దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో ఎక్కువ కాలం వేచి ఉండటం ఇష్టంలేని కస్టమర్లు మాగ్నైట్‌ను వదలి ఇతర మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

ఈ నేపథ్యంలో, నిస్సాన్ అనుబంధ సంస్థ అయిన రెనో ఈ పరిస్థితులను అధ్యయనం చేసి, తమ కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయంలో ఇలా జరగకుండా ఉండాలని భావిస్తోంది. అందుకే, ఈ మోడల్‌ను పూర్తిస్థాయిలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావటానికి ముందే, వీలైనంత ఎక్కువ స్టాక్‌ను కలిగి ఉండాలని కంపెనీ ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని వేగవంతం చేసింది.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

సబ్-4 మీటర్ విభాగంలో విడుదల కానున్న రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో-నిస్సాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇదే ప్లాంట్‌లో నిస్సాన్ మాగ్నైట్ కూడా తయారవుతోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, రెనో కైగర్ ఈ ఏడాది మార్చ్ నెలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

రెనో కైగర్ విషయానికి వస్తే ఇది ఈ విభాగంలో ప్రధానంగా కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లతో ఇది పోటీ పడనుంది. కైగర్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, మాగ్నైట్ మాదిరిగానే ఇది కూడా సరసమైన ధరకే విడుదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇటీవలే ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో రెనో కైగర్ ఎస్‌యూవీలోని అనేక ఫీచర్లను హైలైట్ చేశారు. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ టూ స్లాట్ గ్రిల్, క్రోమ్ ఇన్సర్ట్స్, సన్నటి ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్, త్రీ పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇరువైపులా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ వంటి ఫీచర్లను మనం చూడొచ్చు.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

ఇంకా ఇందులో వీల్ ఆర్చెస్‌పై బ్లాక్ క్లాడింగ్, డోర్ ప్యానెల్స్‌పై బ్లాక్ ప్లాస్టిక్ ఇన్‌సెర్ట్స్, రూఫ్ రైల్స్ మరియు 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, కారు వెనుక భాగంలో సి-ఆకారపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, హైమౌంట్ స్టాప్ లైట్‌తో కూడిన స్పాయిలర్, వాషర్ మరియు వైపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన డ్యూయల్ టోన్ బంపర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

రెనో కైగర్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది వివిధ రకాల సమాచారాన్ని డ్రైవర్‌కు తెలియజేస్తుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పిఎస్2.5 ఎయిర్ ప్యూరిఫైయర్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

ఈ కారులో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయటానికి ఓ గుండ్రటి డయల్ నాబ్ సెంటర్ కన్సోల్‌పై ఉంటుంది. రెనో కైగర్‌లో త్రీ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంటుంది, దీనిపై కాల్ రిసీవ్, రిజెక్ట్, వాల్యూమ్ మరియు ప్లేట్రాక్ వంటి వివిధ రకాల కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా ఇందులో 4 స్పీకర్లతో కూడిన ఆర్కామి 3డి సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

రెనో కైగర్ 1.0-లీటర్ న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తాయి. సాధారణ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుండగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

రెనో కైగర్‌ను మొత్తం ఆరు రంగులలో అందించనున్నారు. ఇందులో ఐస్ కూల్ వైట్, ప్లానెట్ గ్రే, మూన్లైట్ గ్రే, మహోగని బ్రౌన్, కాస్పియన్ బ్లూ మరియు రేడియంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి. అంతేకాకుండా, దీనిని మిస్టరీ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా అందించనున్నారు.

భారత్‌లో రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి షురూ; త్వరలో విడుదల

అయితే, ఇందులో రెడ్ బాడీ పెయింట్ మరియు బ్లాక్ కలర్ రూఫ్ ఆప్షన్ మాత్రం టాప్-ఎండ్ వేరియంట్లలోనే లభించే అవకాశం ఉంది. రెనో కైగర్ 205 మిమీ అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మరియు 405 లీటర్ల అత్యధిక బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుందిన కంపెనీ తెలిపింది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Kiger Compact SUV Production Starts In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X