మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్; ఇప్పుడు ఏకంగా..

భారత మార్కెట్లో ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తన కిగర్‌ను విడుదల చేసినప్పటి నుంచి అత్యదిక అమ్మకాలతో మంచి ప్రజాదరణ పొందిన వాహనంగా మారింది. ఈ కారుకి మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్ కారణంగా ఇప్పుడు దీని కోసం వేచి చూసే సమయం [డెలివరీ టైమ్] మరింత పెరిగింది.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

రెనాల్ట్ కిగర్ పొందటానికి వినియోగదారులు వేచి చూడాల్సిన సమయం ఇప్పుడు మరో 16 వారాలు పెరిగింది. దేశీయ మార్కెట్లో ఈ కిగర్ అతి తక్కువ ధరకే అడుగుపెట్టింది. కేవలం తక్కువ ధర మాత్రమే కాకూండా ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది కొనుగోలుదారుల ద్రుష్టి దీనిపై పడింది.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

కొత్త రెనాల్ట్ కిగర్ యొక్క ఏ వేరియంట్ ఎంత కాలం వెయిటింగ్ పీరియడ్ అనే విషయాన్నీ కంపెనీ అధికారికంగా వెల్లడించ్చానప్పటికీ, ఇందులో ఉన్న ఆర్ఎక్స్టి, ఆర్ఎక్స్జెడ్ మరియు సివిటి వేరియంట్‌ల వంటి అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్‌లకు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని మేము భావిస్తున్నాము.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

కొత్త రెనాల్ట్ కిగర్ ఫ్రంట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్ సెటప్, క్రోమ్ హనీ కూంబ్ షేప్ ఫ్రంట్ గ్రిల్, ఫ్లాట్ బోనెట్ వంటివి కలిగి ఉంది. అంతే కాకుండా దీనికి ఎస్‌యూవీ-కూపే లాంటి డిజైన్ ఇవ్వబడింది, స్లైడింగ్ రూఫ్‌లైన్‌ బ్లాక్డ్ అవుట్ సీ పిల్లర్ కలిగి ఉంది. ఇది 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ కూడా కలిగి ఉటుంది.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

ఇక ఈ కొత్త కిగర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో గ్రే ప్లాస్టిక్ డాష్‌బోర్డ్‌లు, సెంటర్ కన్సోల్ మరియు బ్లాక్ విండోతో పవర్ విండో స్విచ్‌లు అందించబడతాయి. ఎసి వెంట్స్‌కు కొద్దిగా లైట్ గ్రే కలర్ ఫినిషింగ్ ఇవ్వబడుతుంది. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

రెనాల్ట్ కిగర్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 4-ఎయిర్‌ బ్యాగులు, ఏబీఎస్, ఈబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మాత్రమే కాకూండా వాహనదారునికి కావలసిన అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి వాహనదారుని భద్రతకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

రెనాల్ట్ కిగర్ 1.0-లీటర్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్లలో 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి మరియు టర్బో పెట్రోల్‌లో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌లు అందించబడతాయి.

మళ్ళీ పెరిగిన రెనాల్ట్ కిగర్ వెయిటింగ్ పీరియడ్

రెనాల్ట్ కిగర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ కొత్త కిగర్ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెనాల్ట్ కిగర్ వివిధ కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండి, తక్కువ ధరకు లభ్యమవుతున్న కారణంగా దీని అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

Most Read Articles

English summary
Renault Kiger Waiting Period Increases. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X