మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, ఈ నెల 15వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో కైగర్' డెలివరీలును మార్చి 3వ తేదీ నుండి ప్రారంభించినున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనో ఇండియా ఈ ఎస్‌యూవీని రూ.5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుండే ఈ మోడల్ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ.11,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రెనో-నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇదే ప్లాంట్‌లో నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తున్నారు. మాగ్నైట్ మాదిరిగానే రెనో కైగర్ విషయంలో మెగా డెలివరీ డ్రైవ్‌లను నిర్వహించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

MOST READ:హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఇప్పటికే ఈ మోడల్ కోసం తగినంత ఉత్పత్తి సామర్థ్యాన్ని రెనో ఇండియా సిద్ధం చేసుకుంది. మార్చ్ నెలలో ఈ కారు కోసం ఒక్కసారిగా భారీ స్థాయిలో డెలివరీలను నిర్వహించాలని కంపెనీ భావిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ విషయంలో డిమాండ్‌కు తగినట్లుగా సప్లయ్ లేకపోవటంతో సదరు మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది.

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

నిస్సాన్ మాగ్నైట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైన రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

మార్కెట్లో రెనో కైగర్ RXE, RXL, RXT మరియు RXZ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.5.45 లక్షల నుండి రూ.9.55 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ పవర్‌ను జనరేట్ చేస్తాయి.

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

రెనాల్ట్ కైగర్ ట్రై-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ట్విన్-స్లాట్ క్రోమ్ గ్రిల్, సి-ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఇది సింగిల్ కలర్ ఆప్షన్స్‌తో పాటుగా, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్స్‌తో కూడా లభిస్తుంది.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Renault Kiger Compact SUV Deliveries To Begin From March 3rd, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X