రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, భారత మార్కెట్లో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కిగర్'ను విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది. గత నవంబర్ 2020లోనే ఈ మోడల్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ను అధికారికంగా ఆవిష్కరించిన రెనో, ఈసారి ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను జనవరి 28, 2021వ తేదీ ప్రదర్శించనుంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

పూర్తిగా భారతదేశంలో తయారైన ఈ రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, భారత్ నుండి వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి కానుంది. ఈ నేపథ్యంలో, జనవరి 28న ఈ మోడల్‌ను డిజిటల్ ఈవెంట్ ద్వారా రెనో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

గతంలో కంపెనీ ఆవిష్కరించిన రెనో కిగర్ కాన్సెప్ట్‌లో కనిపించిన అనేక ఫీచర్లు ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఫ్రంట్ బంపర్ మధ్యలో ఉన్న స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్ మరియు ఫ్రంట్ గ్రిల్ మధ్యలో అమర్చిన ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు ఉంటాయి.

MOST READ:రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

ముందు భాగంలో డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌‌లో ప్రతి హెడ్‌ల్యాంప్‌లో మూడు స్ప్లిట్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి. ఫ్రంట్ బంపర్ మధ్యలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా ఉంది. బంపర్ దిగువ భాగంలో మరో మెష్ గ్రిల్, కారు బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

కిగర్‌ను విడుదల చేయడానికి ముందే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని దేశంలో అనేకసార్లు టెస్టింగ్ చేశారు. తాజాగా విడుదలైన స్పై చిత్రాల్లో ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ నుండి అత్యంత పాపులర్ అయిన సిఎమ్‌ఎఫ్-ఎ+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్‌లో అనేక ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీ టెక్నాలజీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్‌లో ఉపయోగిస్తున్న పెట్రోల్ ఇంజన్లనే కొత్త రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించనున్నారు. బేస్ వేరియంట్లలో 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండొచ్చని అంచనా. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

టాప్-ఎండ్ వేరియంట్ రెనో కిగర్ మోడళ్లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తేదీ ఖరారు

ప్రస్తుతం దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెనో కిగర్ విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.5 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Kiger Global Premiere Date Announced, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X