Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీదారులలో ఒకటి రెనాల్ట్ (Renault). రెనాల్ట్ కంపెనీ భారతీయ మార్కెట్లో 2021 ప్రారంభంలో తన సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV అయిన రెనాల్ట్ కిగర్ (Renault Kiger) ను విడుదల చేసింది. భారత మార్కెట్లో ప్రస్తుతం అత్యంత సరసమైన సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

Renault Kiger అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కంపెనీ రెనాల్ట్ కిగర్ SUV కోసం యాక్సెసరీస్‌ను కూడా పరిచయం చేసింది. రెనాల్ట్ ఇండియా నెలరోజుల క్రితం దక్షిణాఫ్రికా మార్కెట్లోకి ఈ SUV ని ఎగుమతి చేయడం ప్రారంభించింది.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

అయితే కంపెనీ యొక్క ఈ SUV ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో అమర్చబడి ఉంటుంది. దీనికి సంబంధించి వీడియో కూడా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందిన మొదటి రెనాల్ట్ కిగర్ కూడా ఇదే. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే, ఇక్కడ ఉన్న రెనాల్ట్ కిగర్ బేస్ వేరియంట్ కాదని స్పష్టమైంది. ఇందులో కేవలం 17-ఇంచెస్ అల్లాయ్ వీల్‌ మాత్రమే జోడించబడి ఉంటుంది. అయినప్పటికీ ఇది సాధారణ మోడల్ కంటే కొంత పొడవుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వీల్స్ చూడటానికి ఆకర్షనీయంగా ఉన్నప్పటికి, డ్రైవింగ్ నాణ్యత మరియు పనితీరు గురించి ఖచ్చితంగా చెప్పలేము.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

రెనాల్ట్ కిగర్ దేశీయ మార్కెట్లోని పోటీదారులకు గట్టిపోటీనే ఇస్తుంది. దీనికోసం కంపెనీ అద్భుతమైన ఫీచర్స్ అందిస్తుంది. రెనాల్ట్ కిగర్ కారులో బోనెట్, హనీకూంబ్ షేప్ గ్రిల్ క్రోమ్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు రూఫ్ రైల్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ టెయిల్‌లాంప్, అల్యూమినియం స్కిడ్ ప్లేట్, షార్ప్ రియర్ విండ్‌స్క్రీన్, 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటివి ఉన్నాయి.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

రెనాల్ట్ కిగర్ SUV లో సెంటర్ కన్సోల్, ఆర్మ్‌రెస్ట్, వాయిస్ కమాండ్స్, గ్లో బాక్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ ఆన్/ఆఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 3డి సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు సన్‌రూఫ్ కూడా అందుబాటులో ఉంటాయి.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

కిగర్ SUV లోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి ఉంది. ఈ స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

రెనాల్ట్ ఇండియా భారత మార్కెట్లో అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ కారణంగానే కంపెనీ రెనాల్ట్ యొక్క కొత్త కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ SUV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి RXE, RXL, RXT మరియు RXZ వేరియంట్స్.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ యొక్క కొత్త మాగ్నెట్ SUV రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫారమ్‌ ద్వారా అభివృద్ధి చేయబడినట్లు తెలుస్తుంది. మేడ్-ఇన్-ఇండియా కిగర్ త్వరలో సార్క్ ప్రాంతంలోని ఇతర దేశాలలో అందుబాటులోకి రానుంది. నేపాల్‌లో, వైశాల్ గ్రూప్‌లో భాగమైన బ్రాండ్ డీలర్ - అడ్వాన్స్‌డ్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రెనాల్ట్ కిగర్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది.

Renault Kiger ఇప్పుడు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో.. మీరు చూసారా..!!

రెనాల్ట్ ఇప్పటికే ప్రపంచంలోని ప్రధాన మార్కెట్‌లకు వివిధ కార్ మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఇది ఇప్పుడు కిగర్ మోడల్‌తో మరింత ఎక్కువమందిని ఆకర్షించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కూడా రెనాల్ట్ యొక్క కార్లు అమ్మకానికి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ SUV నిస్సాన్ మాగ్నెట్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Image Courtesy: Plati Alloy Wheels

Most Read Articles

English summary
Renault kiger modified with 17 inch alloy wheels details
Story first published: Sunday, November 7, 2021, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X