కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన రెనాల్ట్ కిగర్‌ ను విడుదల చేసింది. రెనాల్ట్ కిగర్‌ ఎస్‌యూవీ విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే మార్కెట్లో ఈ కంపెనీ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచినట్లు ప్రకటించింది.

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు తన లైనప్‌లోని వేరియంట్ల ప్రకారం ధరను పెంచింది. రెనాల్ట్ కిగర్‌ ఎస్‌యూవీపై పెరిగిన ధరలు 2021 మే 1 నుండి అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదల తరువాత ఎటువంటి అమ్మకాలను చవిచూస్తుందో వేచి చూడాలి.

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

రెనాల్ట్ కిగర్‌ ఎస్‌యూవీలో 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో మాన్యువల్‌తో పాటు ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌లో కూడా వస్తుంది. ఈ ఇంజిన్ కారు యొక్క నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది, వీటిలో ఆర్‌ఎక్స్‌ఇ, ఆర్ఎక్స్ఎల్, ఆర్‌ఎక్స్‌టి మరియు ఆర్‌ఎక్స్‌జెడ్ వేరియంట్లు ఉన్నాయి. కిగర్ యొక్క బేస్ వేరియంట్ ఆర్‌ఎక్స్‌ఇ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

అదే సమయంలో, కిగర్ యొక్క ఆర్ఎక్స్ఎల్ వేరియంట్‌పై రూ. 18,000, ఆర్‌ఎక్స్‌టి వేరియంట్‌పై రూ. 20,000, ఆర్‌ఎక్స్‌జెడ్ వేరియంట్‌పై రూ. 14,000 పెంచారు. ఇందులో ఉన్న ఎఎమ్‌టి మోడల్ కూడా ఆర్ఎక్స్ఎల్, ఆర్‌ఎక్స్‌టి మరియు ఆర్‌ఎక్స్‌జెడ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. రెనాల్ట్ ఇండియా ఈ ఎఎమ్‌టి మోడల్ ధరలను వరుసగా రూ. 23,000, రూ. 25,000 వేలు, రూ. 19,000 వేలు పెంచింది.

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

రెనాల్ట్ యొక్క దాని టర్బో వేరియంట్స్ విషయానికి వస్తే ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ఆర్ఎక్స్ఎల్, ఆర్‌ఎక్స్‌టి మరియు ఆర్‌ఎక్స్‌జెడ్ లలో అందించబడుతుంది. ఈ మూడు వేరియంట్ల ధరను కంపెనీ వరుసగా రూ. 28,000, రూ. 30,000, రూ. 24,000 పెంచింది.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

రెనాల్ట్ కిగర్ యొక్క టర్బో పెట్రోల్ సివిటి వేరియంట్ ధరలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. అన్ని వేరియంట్లను డ్యూయల్-టోన్ పెయింట్ షేడ్స్‌తో కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు మీరు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ కలిగిన కార్లను, మోనో-టోన్ వేరియంట్ కంటే 3,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలి.

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

ఇక్కడ వినియోగదారులు గమనించదగ్గ విషయం ఏమిటంటే, రెనాల్ట్ కిగర్ యొక్క కొత్త ఎక్స్-షోరూమ్ ధరలను 'ఆల్ ఇండియా వన్ ప్రైస్' గా ఉంచారు. కావున ఈ ధరలు అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉన్నాయి.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

ఇటీవలే కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క కొత్త ప్రకటనను విడుదల చేసింది, ఇందులో ఇందులో దాని ఫీచర్స్ వంటి సమాచారాన్ని వివరిస్తుంది. దీన్ని రెనాల్ట్ ఇండియా ఛానెల్‌లో చూడవచ్చు. ఇందులో దాని ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్స్ గమనించినట్లయితే ఇది దాని విభాగంలో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.

కిగర్‌ ఎస్‌యూవీ ధరలు పెంచిన రెనాల్ట్; కొత్త ధరల లిస్ట్

ఇది 1.0-లీటర్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది, ఇది వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. సాధారణ పెట్రోల్ ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి మరియు టర్బో పెట్రోల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?

Most Read Articles

English summary
Renault Kiger Price Hike Upto Rs 30,000 Variant Wise Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X