విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, ఇటీవలే భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో కైగర్'ను అతి త్వరలోనే దేశీయ విపణిలో ప్రవేశపెట్టనుంది. భారతదేశంలో అత్యంత పోటీతో కూడుకున్న సబ్-4 మీటర్ విభాగంలోకి కైగర్ ప్రవేశించనుంది.

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

రెనో కైగర్ ఇప్పటికే దాని స్టన్నింగి డిజైన్‌తో చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ ఇంకా అధికారికంగా మార్కెట్లోకి విడుదల కాకమునుపే, ఇది దేశవ్యాప్తంగా ఉన్న రెనో అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలకు, స్టాక్ యార్డులకు చేరుకుంటోంది.

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

తాజాగా, రెనో కైగర్ ఎస్‌యూవీలను ఓ డీలర్‌షిప్ స్టాక్ యార్డులో ఉండటాన్ని తమ కెమెరాలో బంధించారు ఓ నెటిజెన్. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలలో రెనో కైగర్ కలర్ ఆప్షన్లను మనం చూడొచ్చు. ఇందులో మెరూన్, సిల్వర్, బ్లూ కలర్లలో పెయింట్ చేయబడిన రెనో కైగర్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

ఈనెల ఆరంభంలో రెనో ఇండియా తమ కైగర్ ఎస్‌యూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించినప్పుడు, రెడ్ కలర్‌లో ఉన్న కైగర్ వాహనాన్ని ప్రదర్శించింది. ఈ రెడ్ కలర్ కైగర్ చూడటానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఇది డీలర్‌షిప్‌లలో కనిపించే అవకాశం ఉంది.

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

రెనో కైగర్ బ్రోచర్ ప్రకారం, ఈ కారును మొత్తం ఆరు రంగులలో అందించనున్నారు. ఇందులో ఐస్ కూల్ వైట్, ప్లానెట్ గ్రే, మూన్లైట్ గ్రే, మహోగని బ్రౌన్, కాస్పియన్ బ్లూ మరియు రేడియంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి. అంతేకాకుండా, దీనిని మిస్టరీ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా అందించనున్నారు.

MOST READ:తండ్రి దూరమయ్యాక జ్ఞాపకార్థం హార్దిక్ పాండ్యా పంచుకున్న వీడియో, ఇదే

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

అయితే, ఇందులో రెడ్ బాడీ పెయింట్ మరియు బ్లాక్ కలర్ రూఫ్ ఆప్షన్ మాత్రం టాప్-ఎండ్ వేరియంట్లలోనే లభించే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్‌ను గమనించినట్లయితే, ముందు భాగంలో సిగ్నేచర్ టూ స్లాట్ గ్రిల్, క్రోమ్ ఇన్సర్ట్స్, సన్నటి ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్, త్రీ పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇరువైపులా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

కారు చుట్టూ బ్లాక్ క్లాడింగ్, రూఫ్ రైల్స్ మరియు 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కారు వెనుక భాగంలో సి-ఆకారపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, హైమౌంట్ స్టాప్ లైట్‌తో కూడిన స్పాయిలర్, వాషర్ మరియు వైపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన డ్యూయల్ టోన్ బంపర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

రెనో కైగర్ బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్ థీమ్‌తో లభ్యం కానుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

విడుదలకు ముందే రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూస్తారా..? అయితే ఇదిగో..

ఇక ఇంజన్ విషయానికి వస్తే, రెనో కైగర్ 1.0-లీటర్ న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తాయి. సాధారణ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుండగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది.

MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది

Image Courtesy: Ketul Patel/Rushlane Spylane

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Kiger Spotted At Dealership In New Brown Paint Scheme, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X