రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

రెనో ఇండియా నుంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కిగర్'కు సంబంధించి కంపెనీ తొలి టీజర్‌ను విడుదల చేసింది. రెనో ఇప్పటి వరకూ ఈ మోడల్ కాన్సెప్ట్ రూపాన్ని మాత్రమే మనకు ప్రదర్శించింది. కాగా, ఈ నెలలో ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయనుంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

గత నవంబర్ 2020లోనే ఈ మోడల్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ను అధికారికంగా ఆవిష్కరించిన రెనో, ఈసారి ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను జనవరి 28, 2021వ తేదీ ప్రదర్శించనుంది. రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

భారతదేశంలో తయారైన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. తాజాగా రెనో విడుదల చేసిన కిగర్ టీజర్‌ను గమనిస్తే, కంపెనీ ఇందులో ఐస్-క్యూబ్ స్టైల్ ఎల్ఈడి హెడ్‌లైట్లను, ఎల్ఈడి టెయిల్ లైట్లను మరియు ఫ్రంట్ గ్రిల్ మధ్యలో పెద్ద రెనో బ్యాడ్జ్‌ను కంపెనీ హైలైట్ చేసింది.

MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

ఈ ఫీచర్లన్నీ కంపెనీ ఇదివరకు ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌లో ఉన్నట్లుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే రిలీజ్ చేసిన రెనో కిగర్ కాన్సెప్ట్‌లో కనిపించిన అనేక ఫీచర్లు ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

ముందు భాగంలో అమర్చిన ఐస్-క్యూబ్ స్టైల్ డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌‌లో ప్రతి హెడ్‌ల్యాంప్‌లో మూడు స్ప్లిట్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి. ఫ్రంట్ బంపర్ మధ్యలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా ఉంది. బంపర్ దిగువ భాగంలో మరో మెష్ గ్రిల్, కారు బాడీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:భారత సర్కార్ సాయం చేసి ఉంటే రూ.5,000 లకే ఈ కార్ లభించేంది..

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ నుండి అత్యంత పాపులర్ అయిన సిఎమ్‌ఎఫ్-ఎ+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా కంపెనీ ఇందులో అధునాతన ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీ టెక్నాలజీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.

MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించే ఇంజన్లనే రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించనున్నారు. బేస్ వేరియంట్లలో 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండొచ్చని అంచనా. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

టాప్-ఎండ్ వేరియంట్ రెనో కిగర్ మోడళ్లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం.

MOST READ:కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్, జనవరి 28న విడుదల!

దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెనో కిగర్ విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.5 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Kiger Compact SUV New Teaser Released Ahead Of Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X