మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) తమ వినియోగదారుల కోసం గత 2016 సంవత్సరంలో ప్రారంభించిన 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్' (Workshop On Weels) కార్యక్రమానికి కొనసాగింపుగా కంపెనీ ఇప్పుడు 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్-లైట్' (Workshop On Weels Lite)ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రిమోట్ లొకేషన్లలో నివసించే వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేని యాజమాన్య అనుభవాన్ని అందించే ప్రయత్నంగాలో భాగాంగా కంపెనీ ఈ చొరవ తీసుకుంది.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

రెనో వర్క్‌షాప్ వీల్స్ ఆన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, కస్టమర్లు కోరుకున్న ప్రదేశానికే సర్వీస్ ఇంజనీర్లు ఓ వాహనంలో వెళ్లి, కస్టమర్ల రెనో వాహనాలకు అవసరమైన సర్వీస్ చేస్తారు. రెనో ఇండియా దేశీయ విపణిలోకి ప్రవేశించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకను జరుపుకునేందుకు కంపెనీ 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్-లైట్' చొరవను ప్రారంభించింది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా రెనో ఇండియా 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్-లైట్' అనేది ఓ మొబైల్ వర్క్‌షాప్ కాన్సెప్ట్ మోడల్.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

రెనో వాహనాలకు సంబంధించిన అనేక ఇతర చెకప్స్ తో పాటు చిన్నపాటి సర్వీస్ మరియు రిపేర్ జాబ్స్ నిర్వహించడానికి అవసరమైన అన్ని సాధనాలు మరియు సాంకేతికతలను ఈ వర్క్‌షాప్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో, రెనో ఇండియా అసాధారణమైన వృద్ధితో అమ్మకాలను కనబరుస్తోంది మరియు నెట్‌వర్క్ విస్తరణ పరంగా భారతదేశంలో తన స్థానాన్ని మరియు ఉనికిని వేగంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

గ్రామీణ ప్రాంతాలలో కంపెనీ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కూడా కంపెనీ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. గ్రామీణ మార్కెట్‌లలో బ్రాండ్‌ను మెరుగ్గా వ్యాప్తి చేయడానికి కస్టమర్ బేస్‌ను మరింత విస్తరించింది. దీని కారణంగా, కంపెనీ తన గ్రామీణ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి 2016 సంవత్సరంలో 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్' (WOW)ని ప్రారంభించింది.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా రెనో కార్లకు సర్వీసింగ్ సదుపాయాలను అందించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి. 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్' అనేది తప్పనిసరిగా నాలుగు చక్రాల వాహనంపై నిర్మించిన మొబైల్ వర్క్‌షాప్ లాంటిది మరియు ఇది అన్ని నిర్వహణ సేవలు మరియు మరమ్మతులతో సహా వర్క్‌షాప్ కార్యకలాపాల యొక్క 90 శాతం డిమాండ్‌లను తీర్చగలదు.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

'వర్క్‌షాప్ ఆన్ వీల్స్ లైట్'కి విషయానికి వస్తే, ఇది రెనో ఇండియాకి దేశవ్యాప్తంగా ఉన్న 530కి పైగా టచ్ పాయింట్‌ల యొక్క బలమైన సేవా నెట్‌వర్క్‌ను మరింత పెంచుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. ఇందులో ఇప్పుడు దేశవ్యాప్తంగా 250 వర్క్‌షాప్ ఆన్ వీల్స్ మరియు వర్క్‌షాప్ ఆన్ వీల్స్ లైట్ ఉన్నాయి. ఈ సర్వీస్ కాన్సెప్ట్ మోడల్ ఇన్నోవేషన్‌తో నడిచే రూరల్ ఫ్లోట్ రెనో రిమోట్ కస్టమర్ బేస్‌కి మరో మెట్టు దగ్గరగా ఉంటుంది

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

ఈ కాన్సెప్ట్ ద్వారా రెనో తమ వినియోగదారులకు నిష్కళంకమైన రెనో యాజమాన్య అనుభవాన్ని అందిస్తుంది. రూరల్ ఫ్లోట్‌తో, కంపెనీ తన కొత్త రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని గ్రామీణ మార్కెట్‌లోని సంభావ్య వినియోగదారులకు ప్రదర్శిస్తోంది. రూరల్ ఫ్లోట్ ప్రచారం 13 రాష్ట్రాల్లోని 233 పట్టణాలలో 23,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులను కనెక్ట్ చేసింది. అంతేకాకుండా, ఈ ప్రచారం 2700 కంటే ఎక్కువ టెస్ట్ డ్రైవ్‌లను కూడా నిర్వహించింది, దీని సహాయంతో కంపెనీ తమ వినియోగదారులను మరింత చేరువ కాగలిగింది.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

ఇదిలా ఉంటే, రెనో ఇండియా (Renault India) తాజాగా మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Renault Kiger) మార్కెట్లో కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందుతోంది. ఇటీవల, కంపెనీ ఈ కారు కోసం ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్ వీడియోను కూడా విడుదల చేసింది, ఈ వీడియోలో రెనో కైగర్ డిజైన్ మరియు ఫీచర్లను కంపెనీ హైలైట్ చేసింది. ఇటీవలి కాలంలో రెనో కైగర్ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి మరియు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ, రెనో ఇండియాను ఎస్‌యూవీ విభాగంలో నిలదొక్కుకునేలా చేయడంలో సహకరిస్తోంది.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

ప్రస్తుతం, భారత మార్కెట్లో రెనో కైగర్ RXE, RXL, RXT, RXT (O) మరియు RXZ అనే ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ మాదిరిగానే రెనో కైగర్ కూడా 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదలైంది. ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 10.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మీరు ఎక్కడుంటే, అక్కడికే కార్ సర్వీస్.. Renault వర్క్‌షాప్ ఆన్ వీల్స్ ప్రారంభం..

ఈ ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకు వైర్‌లెస్‌గా సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్ మరియు పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ మరియు సెలక్టబల్ డ్రైవింగ్ మోడ్స్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault workshop on wheels lite initiative launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X