ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్. రోల్స్ రాయిస్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను విడుదల చేసింది. ఈ కార్లు ఎక్కువగా సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు వంటివారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కుబేరులకు సైతం కొనడానికి ఒక్కసారి ఆలోచించే విధంగా ఒక లగ్జరీ కారును ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

రోల్స్ రాయిస్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన అత్యంత ఖరీదైన కారు 'బోట్ టెయిల్'. ఈ కారుకు 'బోట్ టెయిల్' అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం దీని డిజైన్ దాదాపుగా రేసింగ్ బోట్ మాదిరిగానే ఉంటుంది. అంతే కాదు కారు వెనుక ఉన్న డెక్ పిక్నిక్ టేబుల్ లాగా మార్చే సదుపాయం కూడా ఇందులో కల్పించబడింది.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

రోల్స్ రాయిస్ తయారుచేసిన ఈ బోట్ టెయిల్ కారు ధర అంతర్జాతీయ మార్కెట్లో 28 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా 200 కోట్ల రూపాయలు. రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన కారు ఇప్పుడు ఈ బోట్ టెయిల్.

MOST READ:లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

కేవలం ధర మాత్రమే కాదు ఈ బోట్ టెయిల్ లగ్జరీ కారులో కనిపించే ఫీచర్స్ కూడా రోల్స్ రాయిస్ కంపనీ ఇప్పటివరకు మరే ఇతర కారులోనూ ప్రవేశపెట్టలేదు. కావున ఈ కారుని కంపెనీ యొక్క వెరీ స్పెషల్ కారుగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఇతర రోల్స్ రాయిస్ కార్లకంటే కూడా చాలా స్పెషల్.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఈ రోల్స్ రాయిస్ కారులోని అత్యంత ఆకర్షనీయమైన ఫీచర్, దాని వెనుక డెక్‌లో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అనేక రకాలైన డ్రింక్స్ నిల్వచేసుకోవచ్చు. దీనితో పాటు, కన్వర్టిబుల్‌ టేబుల్స్ మరియు కుర్చీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇందులో ఉండటం వల్ల పిక్నిక్ లేదా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుంది.

MOST READ:భారత్‌లో వాడుకలో ఉన్న అంబులెన్స్ రకాల గురించి మీకు తెలుసా?

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

నివేదికల ప్రకారం, రోల్స్ రాయిస్ కంపెనీ 2017 లో స్వెప్టైల్ కారుని లాంచ్ చేసింది. ఈ కారు ధర 12.8 మిలియన్ పౌండ్లు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ కొత్త బోట్ టెయిల్ కారు దీని ప్రేరణ చేత రూపొందింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటాయి.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

యూరప్‌లోని కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల ఆదేశాల మేరకు కంపెనీ ఈ కార్లను తయారు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అన్ని రోల్స్ రాయిస్ కార్ల నుండి పూర్తిగా భిన్నమైన కారు వీరు కోరుకుంటున్నందువల్ల కంపెనీ వీటిని తయారుచేసింది. ఇలాంటివి తమకు చాలా అవసరమని వ్యాపారవేత్తలు కూడా తెలిపారు.

MOST READ:ఎమర్జెన్సీ వాహనాల్లో రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

వ్యాపారవేత్త డిమాండ్ మేరకు, కంపెనీ ఇంజనీర్లు సుమారు నాలుగేళ్ళకు పైగా కష్టపడి ఈ కారును తయారు చేశారు. నివేదికల ప్రకారం, బోట్ టెయిల్ కార్లు కేవలం 3 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేస్తుంది. బోట్ టెయిల్ కొనుగోలు చేసే వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కారును మార్చవచ్చు.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

రోల్స్ రాయిస్ విడుదల చేస్తున్న ఈ కొత్త కారులో నాలుగు సీట్లు ఉంటాయి. అయితే దాని బూట్ స్పేస్ లోపల డ్రింక్ క్యాబిన్ ఉంది, దీనిలో షాంపైన్ మరియు అనేక ఇతర రకాల పానీయాలు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేయబడతాయి. దాని బూట్ యొక్క డోర్స్ మాత్రం 'సీతాకోకచిలుక' రెక్కల వలె పైకి ఓపెన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:360 సీట్ల విమానంలో ఒక్కడే ప్రయాణికుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

రోల్స్ రాయిస్ యొక్క ఈ బోట్ టెయిల్ కారు చాలా వరకు కార్బన్ ఫైబర్ కవర్ తో కన్వర్టిబుల్ ఓపెన్ టాప్ రూఫ్ తో వస్తుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి చూస్తే మనసు దోచే విధంగా ఉన్న ఈ కారు అత్యంత ఖరీదైనది కావున ఎక్కువమందిని చేరే అవకాశం ఉండదు.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో వి12 6.75-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ రోల్స్ రాయిస్ బ్రాండ్ అయిన కల్లినన్, ఫాంటమ్ మరియు బ్లాక్ బ్రిడ్జ్ వంటి వాటిలో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 563 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Rolls Royce Boat Tail Launched Price Rs 200 Crore Most Expensive Car In The World. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X