రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్, ఇప్పుడు తమ వినియోగదారుల గోప్యత మరియు విలాసం (ప్రైవసీ అండ్ లగ్జరీ) కోసం కొత్తగా ఫాంటమ్ ప్రైవసీ సూట్‌ను అభివృద్ధి చేసింది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

సాధారణంగా, కోట్ల రూపాయాల విలువ చేసే ఇలాంటి ఖరీదైన కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సమాజంలో హైప్రొఫైల్ కలిగిన వ్యక్తులు అయి ఉంటారు. ఈ నేపథ్యంలో, వారి గోప్యతను మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని రోల్స్ రాయిస్ ఈ ఫాంటమ్ ప్రైవసీ సూట్‌ను డిజైన్ చేసింది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

అత్యాధునిక సాంకేతికతలు మరియు అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్థాలతో, తమ డిజైన్ తెలివితేటలకు అద్దం పట్టేలా రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్‌ను రూపొందించారు. ఈ కారులోని ప్రముఖులు ప్రయాణంలో ఉన్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భంలో ప్రైవేట్ స్థలంగా ఉపయోగపడే లక్ష్యంతో ఈ ఫాంటమ్ ప్రైవసీ సూట్ నిర్మించబడింది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

లగ్జరీ మరియు టెక్నాలజీ కలయికతో ఈ సూట్‌ను రూపొందించారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ మరియు వెనుక ప్యాసింజర్లకు మధ్యలో ఇంటిగ్రేటెడ్ ఎలెక్ట్రోక్రోమాటిక్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకులు ఒక్క బటన్ సాయంతో ఈ స్కీన్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులు తమ ప్రైవసీ కోసం ఈ అద్దాన్ని ఓ బలమైన గోడలా ఉపయోగించుకోవచ్చు. ఇందులో కూర్చుని వారు మాట్లాడుకునే మాటలు, తీసుకునే నిర్ణయాలు వెనుక సీటులో ఉన్నవారికి తప్ప ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు.

MOST READ:చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

డ్రైవర్ వైపు నుండి చూస్తే, కారు వెనుక సీటులో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కష్టం. కానీ, అదే వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులు ముందు సీటులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు మరియు రహదారిని కూడా స్పష్టంగా చూడొచ్చు. పూర్తి గోప్యత కోసం రియర్ విండ్‌షీల్డ్‌కు కర్టెన్లను కూడా జోడించారు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన ఇంజన్ కలిగిన కారుగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి ఈ కారులో కొత్తగా డిజైన్ చేసిన ప్రైవసీ సూట్ కారణంగా, ఇందులో అదనపు శబ్ద డంపింగ్ ఉపయోగించి, ఈ సీక్రెట్ సూట్‌లో మరింత ఎక్కువ ధ్వని ఐసోలేషన్‌ను అందించేలా డిజైన్ చేశారు.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ప్రైవసీ స్క్రీన్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, వెనుక సీటులో కూర్చున్న వ్యక్తులు చిన్నగా మాట్లాడుకున్నా లేదా అరచి గగ్గోలు పెట్టిన అది బయటి వారికి కానీ లేదా కారులో ముందు సీట్లలో ఉన్న డ్రైవర్ మరియు క్యో-ప్యాసింజర్‌కి కానీ తెలిసే అవకాశం లేదు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ఈ ప్రైవసీ స్క్రీన్ యాక్టివేట్ అయినప్పుడు, ఒకవేళ వెనుక వరుసలోని ప్రయాణీకులు డ్రైవర్‌తో సంభాషించవలసి వస్తే, అందుకోసం ఈ కారులో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్‌కామ్ సిస్టమ్‌ను జోడించారు. ఒక్క బటన్ సాయంతో ఈ సిస్టమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే, డ్రైవర్ కూడా అవసరమైనప్పుడు క్యాబిన్‌లోపల ఉన్న యజమానులతో మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో ఇదే వ్యవస్థ సాయంతో కాల్ చేయవచ్చు.

MOST READ:ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ఈ కారులో వెనుక సీటులో కూర్చున్న వారు ముందు సీటులోని వారికి ఏవైనా పత్రాలు పంపించాల్సి వచ్చినట్లయితే, అందుకోసం కూడా ఇందులో ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానిని కూడా వెనుక సీటులో కూర్చున్న వారు మాత్రమే నియంత్రించగలరు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ఇన్ని అద్భుతాలు కలిగిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్‌లో వెనుస వరుసలోని ప్రయాణీకుల వినోదం కోసం ఓ ప్రత్యేకమైన థియేటర్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. వెనుక సీటులోని వారు ప్రెజెంటేషన్లు చేయటానికి లేదా లైవ్ న్యూస్‌ను సమీక్షించడానికి లేదా వారి మ్యూజిక్ లైబ్రరీని కంట్రోల్ చేయటానికి కూడా ఇందులో వీలు ఉంటుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ఈ థియేటర్ సిస్టమ్‌లో పూర్తిగా కనెక్టింగ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌తో కూడిన రెండు హై-డెఫినిషన్ 12 ఇంచ్ మానిటర్‌లను జోడించారు. ప్రయాణీకులు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ సాయంతో వారి స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ వంటి వ్యక్తిగత పరికరాలను కనెక్ట్ చేసి, వాటిని ఈ స్క్రీన్స్‌పై ప్రొజెక్ట్ చేసుకునే అకాశం ఉంటుంది. ఇంకా ఇందులో ఆన్-బోర్డ్ 20జిబి హార్డ్ డ్రైవ్, యూఎస్‌బి పోర్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

రోల్స్ రాయిస్ కార్లలో ఆల్రెడీ స్టార్‌లైట్ హెడ్‌లైనర్ ఉంటుంది. ఇది కారు లోపల పైభాగంలో నక్షత్రాలను పోలిన డిజైన్‌ను లైట్ల రూపంలో ప్రొజెక్ట్ చేస్తుంది. పైన చెప్పిన అన్ని కంఫర్ట్, సేఫ్టీ, ప్రైవసీ మరియు లగ్జరీ ఫీచర్లతో ఈ కారులో ప్రయాణంచే వారు సురక్షితమైన మరియు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.

Most Read Articles

English summary
Rolls Royce Develops New Phantom Privacy Suite, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X